వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలోకి నటుడు అలీ: రాజమండ్రి నుంచి పోటీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Actor Ali
హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్య నటుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పడూ సినీ హంగులు ఉంటాయి. ఈ పార్టీలో సినీ తారలు ఎక్కువే. తాజాగా, అలీ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు, ఆ పార్టీ నాయకుడు మురళీ మోహన్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.

రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పోటీ చేయబోతున్న మురళీ మోహన్ ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈసారి గెలిచేందుకు అవసరమైన మార్గాలన్నింటినీ వెతుక్కుంటున్నారు. దీంతో రాజమండ్రి లోకసభ స్థానంలోని అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను దించేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.

తన వ్యూహరచనలో భాగంగా మురళీ మోహన్ రాజమండ్రి శాసనసభ స్థానం నుంచి నటుడు అలీని పోటీకి దించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఆయన అలీతో మాట్లాడినట్లు, అలీ అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అలీ పోటీ విషయంలో మురళీ మోహన్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అనమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజమండ్రి శాసనసభా స్థానం అలీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు చెబుతున్నారు.

English summary

 Comedian in Telugu films Ali may join in Telugudesam party to contest from Rajamundry assembly seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X