హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీపై షా అసంతృప్తి: కృష్ణంరాజు పర్సు చోరీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, సీనియర్ నేత, సినీ నటుడు కృష్ణంరాజు, వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీతో అమిత్‌షా పర్యాటక భవన్‌కు చేరుకున్నారు.

ఆ తర్వాత బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావును అమిత్‌షా పరామర్శించారు. కాగా, దక్షిణాదిలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అందుకు తగ్గట్టు ఇరు రాష్ట్రాల్లో నాయకత్వానికి ప్రేరణ కల్పించి, మార్గదర్శనం చేస్తారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు.

గురువారం ఉదయం పలువురు ప్రముఖులను అమిత్ షా పర్యాటక భవన్‌లో కలుసుకుంటారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరబోతున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై కొంత మంది ప్రముఖులతో రహస్య నివేదికలను తెప్పించుకున్న అమిత్ షా ఆ నివేదికల ఆధారంగా పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారని తెలిసింది.

ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డిని, మరికొంత మంది సీనియర్ నేతలను సైతం నివేదికలను ఇవ్వాల్సిందిగా అమిత్ షా కోరారు. పార్టీ సభ్యత్వం పెంచడంతోపాటు బూత్ స్థాయిలో కనీసం 300మంది ఓటర్లు ఉండేలా చూసుకోవాలని, తద్వారా బూత్ స్థాయి కమిటీలను నెలకోల్పేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అమిత్ షా పార్టీకి సూచించనున్నట్టు తెలిసింది.

అమిత్ షా

అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

అమిత్ షా

అమిత్ షా

అమిత్ షాకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, సీనియర్ నేత, సినీ నటుడు కృష్ణంరాజు, వందలాది మంది నాయకులు,, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీతో అమిత్‌షా పర్యాటక భవన్‌కు చేరుకున్నారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

అమిత్ షాకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపడంతో శంషాబాద్ విమానాశ్రయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.

అమిత్ షా

అమిత్ షా

బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావును అమిత్‌షా పరామర్శించారు.

కృష్ణం రాజు

కృష్ణం రాజు

శంషాబాద్ విమానాశ్రయంలో కృష్ణం రాజు పర్సు చోరీకి గురైంది. అమిత్ షాకు స్వాగతం పలికేందుకు ఆయన విమానాశ్రయానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

అమిత్ షా

అమిత్ షా

గురువారం ఉదయం పలువురు ప్రముఖులను అమిత్ షా పర్యాటక భవన్‌లో కలుసుకుంటారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరబోతున్నారని దత్తాత్రేయ అన్నారు.

గురువారం ఉదయం పర్యాటక భవన్‌లో పార్టీ పదాధికారులు, సీనియర్లతో సమావేశం అవుతారు. 10 గంటలకు కోర్ కమిటీ సమావేశం అవుతుంది. అనంతరం 11 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మరికొంతమంది సీనియర్లు, నగర ప్రముఖులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు సెస్ భవనంలో పార్టీ సభ్యత్వం విషయమై మరో సమావేశంలో పాల్గొని రాత్రి 7.20కి హైదరాబాద్‌లో బయలుదేరి రాత్రి 8.20కి విజయవాడ చేరుకుంటారు. ఏపి నేతలతో అక్కడ సమావేశమవుతారు.

కృష్ణం రాజు పర్సు చోరీ

ఇది ఇలా ఉండగా శంషాబాద్ విమానాశ్రయంలో కృష్ణం రాజు పర్సు చోరీకి గురైంది. అమిత్ షాకు స్వాగతం పలికేందుకు ఆయన విమానాశ్రయానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. పర్సులో విలువైన క్రెడిట్ కార్డులు, కొంత నగదు ఉన్నాయని కృష్ణంరాజు తెలిపారు.

తెలంగాణ కోర్ కమిటీపై అమిత్ షా ఆగ్రహం

‘మిషన్ తెలంగాణ - 2019'లో భాగంగా గురువారం తెలంగాణ కోర్ కమిటీ సభ్యులతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ కోర్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో అవకాశాలున్నా ఎందుకు పార్టీ పుంజుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

English summary
BJP president Amit Shah arrived in Hyderabad on Wednesday evening as part of his two-day tour of Telangana and Andhra Pradesh to launch party’s membership drive in both the States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X