విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు పట్టుదల: బెజవాడకు ఆఫీసుల తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించే కార్యక్రమం ముమ్మరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పట్టుదలతో త్వరలోనే 56 కార్యాలయాలు రాజధాని ప్రాంతానికి తరలేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 150కి పైగా శాఖాధిపతుల కార్యాలయాలు, 52 సచివాలయ విభాగాలు ఉండే ప్రభుత్వాన్ని ఏకమొత్తంగా కొత్త ప్రదేశానికి తరలించడం అంత సులభం కాదు.

హైదరాబాద్‌ నుంచి ఏపీ పాలన సాగించడం అంత సులభంగా కనిపించడం లేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని విజయవాడలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రివర్గ సమావేశాలు సహా అన్ని రకాల సమీక్షలను అక్కడినుంచే నిర్వహిస్తున్నారు. వారాంతంలో హైదరాబాద్‌కు రావడం మినహా మిగిలిన అన్ని రోజులూ ఉంటే విజయవాడలో ఉండడం లేదంటే సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించడం చేస్తున్నారు.

చంద్రబాబు పనులను విజయవాడ నుంచి నిర్వహిస్తుండడంతో ప్రభుత్వవిభాగాలు, కార్యాలయాలను తరలించడానికి రంగం సిద్ధం చేశారు. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏపీలోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అలాగే, డీజీపీ కూడా తన కార్యాలయాన్ని కొత్త రాజధాని పరిసరాల్లో ప్రారంభించారు.

AP offices will be shifted to Vijayawada from Hyderabad

సాధారణ పరిపాలన శాఖలో ఉండే రెండు సెక్షన్లను విజయవాడకు తరలించారు. సీఎం, మంత్రులు విజయవాడలోనే ఉంటున్నందున ప్రొటోకాల్‌ విభాగం చూసే సెక్షన్‌ను విజయవాడకే పంపించేశారు. మంత్రివర్గ సమావేశాలు విజయవాడలోనే జరుగుతున్నాయి. దీంతో కేబినెట్‌ సెక్షన్‌ హైదరాబాద్‌లో అవసరం లేదని దాన్ని కూడా తరలించారు. త్వరలోనే సీఎంఆర్‌ఎఫ్‌ ప్రజోపయోగ విభాగాలను కూడా విజయవాడకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటానికి వీలుగా భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నివేదికలు ఇవ్వాలని, యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ కార్యక్రమానికి ఈ నెల 26 వ తేదీని డెడ్‌లైన్‌గా విధిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ బాబు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాల యంలో కలెక్టర్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

విజయ వాడలో అధికారిక కార్యకలాపాలు నిర్వహించాలని ఉన్నత స్థాయి అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికా రులంతా క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ భవనాలు ఖాళీగా ఉన్నాయో పరిశీలించా లన్నారు. భవనాలు ఎక్కడ అందు బాటులో ఉన్నాయో పరిశీలించి వాటి ఫొటోలు తీసి పంపించాల్సిందిగా ఆదే శాలు జారీ చేశారు.

కమర్షియల్‌ భవనాలు, షాపుల వివరాలు కూడా సేకరించాల్సిందిగా ముని సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. భవనాల విస్తీర్ణం, మౌలిక సదుపాయాలు, పార్కింగ్‌ స్థలం వంటి అంశాలను కూడా నివేదికలో పొందుపరచాలని చెప్పారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ గుర్తించిన భవనాల అంశాన్ని కమిషనర్‌ వీరపాండ్యన్‌ వివరించారు.

English summary
Several andhra Pradesh offices will be shifted to Vijayawada from hyderabad soon as CM Chandrababu Naidu is particular about the administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X