వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ మాత్రం అర్ధరాత్రే జెండా ఎగరేస్తారు!: 1947 నుంచే...

స్వాతంత్య్ర వేడుకలను దేశం మొత్తం ఆగస్టు 15న ఉదయం ఘనంగా నిర్వహించుకుంటారనే విషయం తెలిసిందే. అయితే, అక్కడ మాత్రం కాస్తా విభిన్నంగా ముందురోజు అర్ధరాత్రే ఈ వేడుకలను నిర్వహిస్తారు.

|
Google Oneindia TeluguNews

పాట్నా: స్వాతంత్య్ర వేడుకలను దేశం మొత్తం ఆగస్టు 15న ఉదయం ఘనంగా నిర్వహించుకుంటారనే విషయం తెలిసిందే. అయితే, అక్కడ మాత్రం కాస్తా విభిన్నంగా ముందురోజు అర్ధరాత్రే ఈ వేడుకలను నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచీ విధంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం గమనార్హం.

అర్ధరాత్రే వేడుకలు..

అర్ధరాత్రే వేడుకలు..

ఆ వివరాల్లోకి వెళితే.. బీహార్‌ రాష్ట్రంలోని లోని పుర్నియా ప్రాంతంలోని జెండా చౌక్‌లో సోమవారం అర్ధరాత్రి తర్వాత 12.01 నిమిషాని((అంటే ఆగస్టు 15)రోజునే)కి జాతీయ జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

Recommended Video

Independence Day 2017 : Beating Retreat at the Wagah Border, Watch full celebration | Oneindia News
కొనసాగుతున్న సంప్రదాయం..

కొనసాగుతున్న సంప్రదాయం..

ఇక్కడ ఈ సంప్రదాయాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు రామేశ్వర్‌ ప్రసాద్‌ ప్రారంభించారు. ఆయన మరణం అనంతరం కూడా ఆయన వారసులు ఈ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.

అప్పట్నుంచే...

అప్పట్నుంచే...

భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించిన(1947, ఆగస్ట్ 14 అర్ధరాత్రి) వెంటనే రామేశ్వర్‌ ప్రసాద్‌ పుర్నియాలో 10 వేల మందితో కలిసి అదే అర్ధరాత్రి జెండా వందన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వారసులు తెలిపారు.

ఎప్పుడూ విఫలం కాలేదు..

ఎప్పుడూ విఫలం కాలేదు..

ఇక నాటి నుంచి ఈ వేడుకలను ఇక్కడ అర్ధరాత్రి సమయంలోనే నిర్వహిస్తున్నామని.. ఎప్పుడూ వేడుకల నిర్వహణలో విఫలం కాలేదని వారసులు వివరించారు. ఆయన మరణానంతరం కుమార్తె సులేఖ.. ఇప్పుడు మనవడు విపుల్‌ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

English summary
The town of Purnea in Bihar has continued its tradition of hoisting the national flag at 12.01 am on Independence Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X