వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ప్లాన్ ఇదీ: చంద్రబాబు ప్రత్యామ్నాయం అదీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తెగదెంపులు చేసుకోవాలని బిజెపి ఓ నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు. బిజెపితో పొత్తు చెడిపోతే ఏం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు పడ్డారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

బిజెపి యాక్షన్ ప్లాన్

బిజెపి యాక్షన్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటడానికి బిజెపి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. బలం పుంజుకోవడానికి చంద్రబాబు ఆటంకంగా ఉన్నారనే అభిప్రాయం ఓ వర్గం బిజెపి నాయకుల్లో ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనే వాదనను వారు ముందుకు తెస్తున్నట్లు సమాచారం.

కేంద్ర పథకాలతో ముందుకు...

కేంద్ర పథకాలతో ముందుకు...

కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా బలం పుంజుకోవాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. అందులో బాగంగానే చంద్రబాబు ప్రభుత్వంపై దగ్గుబాటి పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు వంటి బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని వారంటున్నారు.

మిత్రధర్మాన్ని పాటిస్తున్నామంటూనే...

మిత్రధర్మాన్ని పాటిస్తున్నామంటూనే...

తాము తెలుగుదేశంతో మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నామని చెబుతూనే దూకుడుగా వెళ్తూ తమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ, చంద్రబాబును కార్నర్ చేయాలనే ఆలోచనలో బిజెపి నేతలు ఉన్నట్లు అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఘనత, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాని నిర్మాణ వ్యయాన్ని భరించడానికి ముందుకు వచ్చిన చరిత్ర తమదేనని బిజెపి నాయకులు చాటుకునేందుకు సిద్ధపడ్డారు.

పార్టీ ఫిరాయింపులపై

పార్టీ ఫిరాయింపులపై

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులను తెలుగుదేశంలో చేర్చుకోవడంపై బిజెపి నేతలు తప్పు పడుతున్నారు. చంద్రబాబను ఇరకాటంలో పెట్టడానికే ఈ అంశాన్ని వారు ఎత్తుకున్నట్లు అర్థమవుతోంది. రాజీనామాలు అడగకుండా వారిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా కొద్ది మందికి చంద్రబాబు మంత్రిపదవులు ఇవ్వడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. ఈ విషయంలో విష్ణుకుమార్ రాజు చేసిన విమర్శ చంద్రబాబుకు మింగుడు పడడం లేదని అంటున్నారు.

టిడిపి మోసం చేసిందని..

టిడిపి మోసం చేసిందని..

తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లోనే కాకుండా కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోనూ మోసం చేసిందని విష్ణుకుమార్ రాజు పదే పదే విమర్శిస్తున్నారు. తమకు గత శాసనసభ ఎన్నికల్లో కేటాయించిన కొన్ని సీట్లలో స్వతంత్రులను బరిలోకి దింపిందని ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మిత్రధర్మాన్ని పాటించడం లేదనేది ఆయన వ్యాఖ్యగా కనిపిస్తోంది. (

మాణిక్యాలరావు తాజా వ్యాఖ్య

మాణిక్యాలరావు తాజా వ్యాఖ్య

తాము కూడా మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని బిజెపి నేత, మంత్రి మాణిక్యాలరావు సోమవారం స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలను అదుపు చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఏవైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకుందామని కూడా అన్నరని, అందువల్ల తమ పార్టీ నేతలను తాము అదుపు చేస్తామని, ఇకపై విభేదాలు లేకుండా పనిచేస్తామని ఆయన వివరించారు.

బిజెపితో పొత్తు తెంచుకుంటే...

బిజెపితో పొత్తు తెంచుకుంటే...

వచ్చే ఎన్నికల నాటికి బిజెపితో పొత్తు చెడిపోతే ఏం చేయాలనే విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ప్రత్యామ్నాయం కోసం వేట ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో బిజెపికి రెండు శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఆ పార్టీ ఓట్ల శాతం ఐదుకు పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మోడీతో భేటీ తర్వాత చంద్రబాబు

మోడీతో భేటీ తర్వాత చంద్రబాబు


ఇటీవల చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. బిజెపితో పొత్తుపై చంద్రబాబు ఆ భేటీ తర్వాత మూడు సార్లు మాట్లాడారు. బిజెపి నేతలు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని ఆయన తన పార్టీ నాయకులకు సూచించారు.

ప్రత్యామ్నాయం పవన్ కల్యాణ్

ప్రత్యామ్నాయం పవన్ కల్యాణ్

బిజెపితో పొత్తు చెడిపోతే వచ్చే ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపితో కన్నా పవన్ కల్యాణ్‌తో తనకు ఎక్కువ లాభం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఇటీవల ఆయన బిజెపిపై పొత్తు విషయంలో ఘాటుగా మాట్లాడినట్లు చెబుతున్నారు.

English summary
With the elections not too far away, the BJP has started implementing its action plan for Andhra Pradesh. While maintaining coalition dharma, the BJP wants to expand its base.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X