వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గుపడొద్దన్నారు: అమల, రామోజీ రావు, మంచు లక్ష్మిలను సత్కరించారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ వంటివారే పని మనుషులను పెట్టుకోకుండా తన లావెట్రీని తాను శుభ్రం చేసుకునే వారని, మన లావెట్రీని మనం కడుక్కునేందుకు సిగ్గుపడవద్దని తన తల్లి తనకు చిన్నప్పుడు సూచించిందని అమల అన్నారు.

స్వచ్ఛ భారత్ అంబాసిడర్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సత్కరించారు. ఇందులో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల తరఫున అమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

మన చుట్టుపక్కల ప్రాంతాలను మనమే శుభ్రం చేసుకోవాలన్నారు. తన తల్లి అదే చెప్పేదని, ఇప్పటికీ తాను దానినే పాటించానన్నారు. సమాజంలో రోడ్లు ఊడ్చేవాళ్లు తక్కువ అనే అభిప్రాయం చాలామందిలో ఉందని, కానీ వాళ్లు శుభ్రం చేయడం వల్లే మనం ఆరోగ్యంగా ఉన్నామనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

వారిలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూడలేని వారు ఎక్కువ మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ అంటే ఎవరో సెలబ్రిటీలు చేస్తారు అనే ఆలోచన చాలామందిలో ఉందని, ప్రజలందర్నీ ఇందులో భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు పాల్గొనేలా సర్టిఫికేట్లు జారీ చేయాలన్నారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పెద్ద ముందడుగే పడిందని, అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. మోడీ ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ను చేపట్టి దాదాపుగా ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రచారకర్తలను రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్‌హాల్‌లో గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు.

 స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్‌ ప్రచారకర్తలుగా ప్రముఖులకు భాగస్వామ్యం కల్పించినందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభినందించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ విసిరేయడం నుంచి, బహిరంగ మలవిసర్జన, మూత్రవిసర్జన నుంచి, పరిశుభ్రత లోపించడం వల్లే వచ్చే అనారోగ్యం నుంచి దేశం, దేశ ప్రజలకు స్వేచ్ఛ అవసరమని వెంకయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన... కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ పద్మావతిని ప్రత్యేకంగా అభినందించారు.

 స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్‌పై రూపొందించిన పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి తొలి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. అమల.. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో తన అనుభవాన్ని వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల వివక్షాపూరిత, అవమానపూరిత వైఖరికి ముగింపు పలకడమూ ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.

 స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

తెలుగు రాష్ట్రాల నుంచి ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీ రావు, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, జిఎస్ రావు (యశోదా ఆస్పత్రులు), అమల అక్కినేని, తుమ్మల నరేంద్ర చౌదరి (ఎన్టీవీ), డాక్టర్‌ జె రామేశ్వర్ రావు (మై హోం గ్రూప్‌), జెఎచౌదరి (టాలెంట్‌ గ్రూప్‌), సిఎం దేవరాజ రెడ్డి (వైస్‌ప్రెసిడెంట్), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా), మంచు లక్ష్మి (ప్రముఖ చలనచిత్ర నటి)లను సత్కరించారు.

 స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

రెస్‌ ఎంపీ శశిథరూర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెందుల్కర్‌, రాందేవ్‌ బాబా, కమల్‌హాసన్, ఆధ్యాత్మిక ప్రముఖులు మౌలానా అబ్దుల్లా ముఘేషీ, రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామీ శుభకరణానంద తదితర ప్రముఖులను సత్కరించారు.

English summary
Brand Ambassadors of Swachh Bharat Mission call on President Mukherjee
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X