వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అనుమానమే నిజమా: మరో మార్గం లేదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Arun Jaitley On Special Package & Visakha Railway Zone In Rajya Sabha

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. బిజెపి ఆయనను పూర్తిగా కార్నర్ చేసినట్లే ఉంది. కేంద్ర బడ్డెట్‌లో మొండి చేయి చూపడం ద్వారా చంద్రబాబుకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేసింది.

బిజెపితో తెగదెంపులు చేసుకోవడం తప్ప చంద్రబాబుకు మరో మార్గం ఉన్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీరుపై చంద్రబాబు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దిగొస్తుందనేది అనుమానమే..

దిగొస్తుందనేది అనుమానమే..

పార్లమెంటు సభ్యులు పార్లమెంటు వెలుపలా, బయటా ఆందోళనలు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపిస్తుందా అంటే అనుమానమే కలుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి మంగళవారం చేసిన ప్రసంగంలో కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు పెద్దగా ఏమీ లేవు. కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు నిర్దిష్ట కాల పరిమితి పెట్టాలని తెలుగుదేశం పార్టీ అడుగుతోంది.

నరేంద్ర మోడీ చెప్పినా...

నరేంద్ర మోడీ చెప్పినా...


ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిర్దిష్టంగా ఏమీ హామీ ఇవ్వడం లేదు. చూస్తామని చెప్పడం తప్ప కచ్చితమైన హామీలను ఏమీ ఇవ్వడం లేదు. బుజ్జగించే ధోరణిలో మాత్రమే మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో మాట్లాడినా, తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులతో, పార్లమెంటు సభ్యులతో మాట్లాడినా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ గానీ అరుణ్ జైట్లీ గానీ నిర్దిష్టమైన ప్రకటనలు చేయడానికి సిద్ధంగా లేనట్లే కనిపిస్తున్నారు.

బాబు అనుమానమే నిజమా...

బాబు అనుమానమే నిజమా...

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలహీన పరచాలనే ఎత్తుగడలో బిజెపి ఉన్నట్లు చంద్రబాబు అనుమానిస్తున్నారు. ఆ అనుమానమే నిజం కావచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం ద్వారా వైఎస్ జగన్‌ను బలోపేతం దిశగా చేసే దిశగా బిజెపి పావులు కదుపుతుందని అనుకుంటున్నారు. తమిళనాడులో కేంద్రం అనుసరించిన వ్యూహాన్ని బట్టి అది నిజమేనని అనుకోవడానికి కూడా వీలుంది.

బిజెపి వ్యూహం ఇదే..

బిజెపి వ్యూహం ఇదే..

ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడం రాష్ట్రాల్లో అస్థిర రాజకీయాలు బీజం వేసి, తన ఆధీనంలోకి తెచ్చుకునే వ్యూహాన్ని బిజెపి అనుసరిస్తోందని అంటున్నారు. నిజానికి, కాంగ్రెసు చేసిన పని కూడా అదే. సంకీర్ణంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడాన్ని జాతీయ పార్టీలు పద్థతి ప్రకారం అమలు చేస్తూ వస్తాయి. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరిస్తున్న వ్యూహం అదేనని అంటున్నారు.

మిత్రపక్షాల గోడు పట్టదా...

మిత్రపక్షాల గోడు పట్టదా...

బిజెపితో వేగలేక ఇప్పటికే శివసేన తెగదెంపులు చేసుకుంది. చంద్రబాబు కూడా ఆ బాటలో నడవక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అకాలీదళ్ కూడా కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబుకు బాసటగా నిలిచింది. అయినా, బిజెపి పట్టించుకునే స్థితిలో లేదని అంటున్నారు. పావులు కదపడం ద్వారా దేశవ్యాప్తంగా తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగానే అది సాగుతుందని అంటున్నారు. తాను గెలవలేని రాష్ట్రాల్లో అస్థిరతను సృష్టించి, రాజకీయాలను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడమే దాని వ్యూహం. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
According to political analysts - Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu has left no option other than breakup.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X