హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజయ్య కోసం వెయిటింగ్, నివ్వెరపోయారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వైన్ ఫ్లూ ప్రత్యేక చికిత్స వార్డుల పైన కేంద్ర వైద్య నిపుణుల బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్య సిబ్బందిలో అవగాహన లోపం, అజాగ్రత్తలపై నివ్వెలపోయింది. స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కేంద్ర వైద్య బృందం రెండు రోజుల పర్యటనకు వచ్చింది. గాంధీ ఆసుపత్రిని పరిశీలించి, అపరిశుభ్రతపై విస్మయం చెందింది.

ఆసుపత్రిలో పారిశుధ్యంపై పెదవి విరిచిన బృందం.. తక్షణమే మెరుగుపర్చాలని సూచించింది. కేంద్ర ప్రజారోగ్య అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్ కుమార్, శశి ఖరే, ప్రదీప్, ప్రణయ్ వర్మలతో కూడిన ఈ బృందం గురువారం ఉదయం నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకొని స్వైన్ ఫ్లూ బాధితులకు చికిత్సను అందిస్తున్న వార్డులను సందర్శించింది. మరుగుదొడ్లు, ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రం కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ వాతావరణం ఉంటే వ్యాధుల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. రోగిని పరీక్షించిన ఓ నర్సు సాధారణ నీళ్లతో శుభ్రపరుచుకోవడం చూసి విస్మయం చెందింది. సూక్ష్మ క్రిములను నిర్మూలించే ద్రావణంతో తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని, అజాగ్రత్తగా వ్యవహరిస్తే రోగితో పాటు సిబ్బందికి ప్రమాదమని చెప్పింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ఈ విషయంపై తగిన శిక్షణ ఇప్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించింది. కాగా, హోటల్ మారియట్ వద్ద ఉప ముఖ్యమంత్రి రాజయ్య కోసం కేంద్రబృందం నిరీక్షించవలసి వచ్చింది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ బాధితుల పైన ఆరా తీసింది. వారి వివరాలు ఒక పద్ధతి ప్రకారంగా, ఒకచోట నిక్షిప్తం చేసి లేకపోవడంపై బృంద సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ పై భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర బృందం తెలిపింది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు తుమ్మినా, దగ్గినా కనీసం చేతిని అడ్డంగా పెట్టుకున్నా సరే గాలిలో వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చునని తెలిపారు.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

స్వైన్‌ఫ్లూ వార్డు ప్రత్యేకంగా ఉండాలి. ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని, కానీ మీరు స్వైన్‌ఫ్లూ రోగులను డిజాస్టర్‌ వార్డులో పెట్టారని, ఇలా చేయడం ద్వారా స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని ఎలా అడ్డుకుంటారని, రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని ఎలా ఎదుర్కొంటారంటూ కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం రాష్ట్ర వైద్యాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

బృందం సభ్యులు స్వైన్‌ఫ్లూ గాంధీలో వార్డులను కలియ తిరిగి పరిస్థితులను అంచనా వేశారు. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్సలపై కేంద్ర బృందం అసంతృప్తిని వ్యక్తం చేసింది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

స్వైన్‌ఫ్లూ వార్డు ఏర్పాటు తీరు, అక్కడి సదుపాయలు, పరిస్థితులు, జాగ్రత్తలపై బృందం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితిల్లో స్వైన్‌ఫ్లూను ఎలా నియంత్రించగలరని కేంద్ర వైద్య బృందం స్థానిక వైద్యులను, అధికారులను ప్రశ్నించింది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

స్వైన్‌ఫ్లూ రోగుల కేస్‌షీట్లు పరిశీలించిన కేంద్రం బృందం స్వైన్‌ఫ్లూ మృతులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతుల పూర్తి సమాచారం ఎందుకు సేకరించలేదని బృందం మండిపడింది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

స్వైన్‌ఫ్లూ వార్డు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాల్సి ఉండగా, అపరిశుభ్ర వాతావరణంలో స్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేయడంపైనా అసహనం వ్యక్తం చేసింది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

పరిస్థితులు ఇలా ఉంటే స్వైన్‌ఫ్లూను ఎలా నియంత్రించగలమని అనుకున్నారని బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వైన్‌ఫ్లూ వార్డులో జూనియర్‌ వైద్యులను ఏర్పాటు చేయడంపైనా వైద్య బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

సీనియర్‌ వైద్యులు కూడా ఉండాలని ఆదేశించింది. కాగా, కేంద్ర బృందం శుక్రవారం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే పర్యటించనుంది.

 స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ

గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన బృందం సభ్యులు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిసి పరిస్థితని చర్చించారు. శుక్రవారం బృందం సభ్యులు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనుంది.

English summary
A two-member central medical team reached the Gandhi General Hospital in Secunderabad and after a brief interaction with the resident doctors, visited the wards where suspected swine flu patients are being treated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X