వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు భారీ షాక్: 'పనామా పేపర్స్'లో హెరిటేజ్ డైరెక్టర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కొద్ది రోజులుగా 'పనామా పేపర్స్' సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తదితరుల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరి పేర్లు కూడా వచ్చాయి.

తాజాగా, మరో షాకింగ్ అంశం వెల్లడైంది. పనామా పేపర్స్ తాజాగా విడుదల చేసిన జాబితాలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరు బయటపడ్డట్లుగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

ఎంపీ హోల్డింగ్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెండ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లుగా తేలిందంటున్నారు. పనామాలో మూడుసార్లు ఆయన ప్రస్తావనకు వచ్చింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, ఈక్వెడార్‌లో మూడు కంపెనీలు ఉన్నాయని, వీటి ద్వారా పన్నులు ఎగవేశారని ఆరోపణలున్నాయి.

Chandrababu family's Heritage Foods director named thrice in Panama Papers

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం... ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధం ఉన్న ఆయన పేరు పనామా పేపర్సులో మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. వరప్రసాద్ పేరు బయటకు రావడంతో చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికర పరిస్థితిలో పడిందని అంటున్నారు.

వరప్రసాద్ లావాదేవీల పైన సమగ్ర విచారణ జరిపితే బినామీ ఎవరో తెలిసే అవకాశముందని కూడా పేర్కొంటున్నారు. వరప్రసాద్ పేరు బయటకు రావడంతో టిడిపి నేతల్లో ఆందోళన కనిపిస్తోందని సాక్షి పత్రిక పేర్కొంది.

ప్రసాద్ తనయుడు సునీల్ కూడా బిట్ కెమీ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా వెల్లడించింది. సునీల్.. అమెరికా, హైదరాబాదులలో స్టార్టప్ కంపెనీల్లో ఈ డబ్బును పెట్టుబడి పెట్టునట్లుగా చెబుతున్నారు. ప్రసాద్ ప్రవాస భారతీయుడు కాగా.. హైదరాబాదులో కొన్ని కంపెనీలకు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నాడు.

ఆయనకు ఇతర దేశాల్లో వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ప్రసాద్ 2014 నుంచి హెరిటేజ్ ఫుడ్స్‌కు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా, దీనిపై ప్రసాద్ కూడా స్పందించారు. తాను ప్రవాస భారతీయుడనని, గత 30 ఏళ్లుగా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నానని చెప్పారు.

తనకు బ్రిటిష్ వర్జీన్ ఐల్యాండులో కూడా కంపెనీలు ఉన్నాయని, పనామా వ్యవహారం గురించి తనకు తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని కంపెనీ సిబ్బంది, లాయర్లు చూసుకుంటారని చెప్పారని అంటున్నారు. వ్యాపార లావాదేవీలు అన్నీ చట్టబద్దంగా ఉన్నాయన్నారు.

English summary
The Panama Papers mentions the name of industrialist Motaparti Siva Rama Vara Prasad thrice, for having offshore companies in Ghana and Togo in Africa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X