వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలిగిన నారా లోకేష్: శాంతింపజేసేందుకు బాబు...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తన తనయుడు నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి కానుకను అందించబోతున్నారు. నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాతనే మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాలని తొలుత చంద్రబాబు భావించారు.

కానీ, నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఒత్తిడి తీవ్రం కావడంతో దీపావళికి ముందే ఆయన తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దీపావళికి ముందు సాధ్యం కాకపోతే, ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని అంటున్నారు.

నారా లోకేష్‌తో పాటు మరో ఇద్దరు, ముగ్గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో ఇద్దరికి ఉద్వాసన పలకాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉద్వాసనకు గురయ్యేవారిలో ఒకరు ఆంధ్రప్రాంతానికి చెందినవారు కాగా, మరొకరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు.

దానివల్లనే దీపావళికి ముందు...

దానివల్లనే దీపావళికి ముందు...

రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఆ తర్వాత నవంబర్ 12వ తేదీన చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో దీపావళికి ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీపావళి ఈ నెల 30వ తేదీన ఉంది.

జలీల్ ఖాన్‌కు మిగిలేది నిరాశేనా...

జలీల్ ఖాన్‌కు మిగిలేది నిరాశేనా...

మైనారిటీ కోటాలో పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎంఎ షరీఫ్‌కు అవకాశం దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ షరీఫ్‌ను తీసుకోకపోతే మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు.

అలా అయితేనే అఖిలప్రియకు...

అలా అయితేనే అఖిలప్రియకు...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టిడిపిలోకి వచ్చినవారికి ఈసారి అవకాశం లభించకపోవచ్చునని అంటున్నారు. ఒకవేళ వస్తే వారిలో ఒక్కరికి మాత్రమే మంత్రిపదవి దక్కే అవకాశం ఉంటుంది. జలీల్ ఖాన్‌కు మంత్రిపదవి దక్కకపోతే మాత్రమే భూమా అఖిల ప్రియకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు.

నారా లోకేష్‌కు ఐటి, పరిశ్రమలు...

నారా లోకేష్‌కు ఐటి, పరిశ్రమలు...

మంత్రివర్గంలోకి తీసుకుని నారా లోకేష్‌కు ఐటి, పరిశ్రమలు, విద్యుచ్ఛక్తి శాఖలను చంద్రబాబు అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పరిశ్రమలు, విద్యుచ్ఛక్తి శాఖలు ప్రస్తుతం చంద్రబాబు ఉండగా, ఐటి శాఖ పల్లె రఘునాథ రెడ్డి వద్ద ఉంది. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా నారా లోకేష్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు.

నారా లోకేష్ అలిగాడట...

నారా లోకేష్ అలిగాడట...

నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని అన్ని వైపుల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ మూడు రోజుల శిక్షణా శిబిరానికి తొలి రెండు రోజులు లోకేష్ హాజరు కాలేదు. క్యాబినెట్ విస్తరణ విషయంలో చంద్రబాబు చేస్తున్న జాప్యానికి అలిగి నారా లోకేష్ దూరంగా ఉన్నట్లు మీడియా ప్రచారం చేస్తోంది. లోకేష్‌ను శాంతింపజేయడానికి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు నడుం కట్టినట్లు కూడా పుకార్లు పుట్టాయి.

ఆ మహిళా మంత్రికి ఉద్వాసన....

ఆ మహిళా మంత్రికి ఉద్వాసన....

గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను నిర్వహిస్తున్న కె. మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు కళా వెంకటరావును మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు.

English summary
Chief Minister N. Chandrababu Naidu will most likely reshuffle the Cabinet before Diwali. Sources close to him said there are strong indications of this. In the Cabinet reshuffle, Mr Naidu will induct his son and TD national general-secretary Nara Lokesh and two or three more into the Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X