చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూతాపం - చెన్నైలో కుండపోత: పారిస్‌లో ప్రదర్శన

By Srinivas
|
Google Oneindia TeluguNews

పారిస్/చెన్నై: భూతాపం ఫలితంగానే చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పారిస్‌లో జరుగుతున్న ఐక్యరాయ్ సమితి వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఢిల్లీలోని వాతావరణ వైజ్ఞానిక కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్రభూషణ్ మాట్లాడారు.

వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే పరిణామాలను మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని, ప్రపంచ ఉష్ణోగ్రతలు సగటున ఒక డిగ్రీ వరకు పెరిగాయని, ఆ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇక రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.

చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యుద్ధ ప్రాతిపదిన సహాయక చర్యలు చేపడుతోందన్నారు.

Chennai floods: Climate change footprints in freak weather

యాక్షన్ ఇండియా ప్రతినిధి హజీత్ సింగ్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్లే కుండపోత వర్షాలని కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే దాని ప్రభావమైతే కనిపిస్తోందన్నారు. వందేళ్లలో అత్యంత భారీగా కురుస్తున్న వర్షాలు, వాటి పర్యావసనాల పైన చర్చిస్తున్నట్లు చెప్పారు.

గత ఐదేళ్లలో కాశ్మీర్, ఉత్తరాఖండ్ మధ్య సంభవించిన విపత్తుల తీరును పరిశీలిస్తే, వాతావరణ మార్పుల ప్రభావం ఉన్నట్లు కచ్చితంగా తెలుస్తోందన్నారు. వాతావరణ సదస్సు సందర్భంగా చెన్నైలో కురుస్తున్న వర్షాలపై ఆయన విజువలైజ్‌గా వివరించారు.

English summary
In 24 hours ending Wednesday, Chennai got almost twice the rain it normally receives in the entire month of December. This was just the sort of extreme weather event associated with global warming and the news of the deluge reverberated at the Paris climate summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X