• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చోటా రాజన్‌ను పట్టించింది ఎవరో తెలుసా?

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్టుపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. 20 ఏళ్ల పాటు భారత ప్రభుత్వానికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న చోటా రాజన్‌ను రెండు రోజుల క్రితం ఇండోనేసియా పోలీసులు బాలిలో అదుపులోకి తీసుకున్నారు. రాజన్ అరెస్ట్‌ పలు కథనాలు వెలువడ్డాయి.

చోటా రాజన్ అరెస్ట్‌లో భారత మాజీ ఆర్మీ చీఫ్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కీలక భూమిక పోషించారని తొలుత కథనాలు వెలువడ్డాయి. చోటా రాజన్ అరెస్ట్‌కు రెండు రోజుల ముందు ఆస్ట్రేలియా వెళ్లిన వీకే సింగ్ అతడి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఇండోనేసియా పోలీసులకు సమాచారమిచ్చి రాజన్ పట్టుబడేలా చేశారని తెలుస్తోంది.

అయితే చోటా రాజన్ అరెస్ట్‌లో తానే కీలకమని మరో మాఫియా డాన్ చోటా షకీల్ చెబుతున్నాడు. నిజానికి 15 ఏళ్ల క్రితమే ఛోటా రాజన్‌ను బ్యాంకాక్‌లో చంపించేందుకు షకీల్ ప్లాన్ వేశానని, గత వారంలో కూడా తన మనుషులు ఫిజీలో ఛోటా రాజన్‌ను చంపేందుకు షకీల్ దాడి చేయించాడు.

Chhota Shakeel claims credit for Rajan's arrest

అయితే ఈ దాడి నుంచి కూడా రాజన్ క్షేమంగా బయటపడ్డాడు. ఇక లాభం లేదనుకుని ఇండోనేసియాకు రాజన్ పారిపోతున్న విషయాన్ని తెలుసుకున్న షకీల్ పోలీసులకు సమాచారం చేరవేశాడట. తానిచ్చిన సమాచారంతోనే ఇండోనేసియా పోలీసులు రాజన్ ను అరెస్ట్ చేశారని షకీల్ చెబుతున్నాడు.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడిభుజం లాంటి ఛోటా షకీల్ ఎప్పటినుంచో చోటా రాజన్ కోసం వెతుకుతున్నాడంట. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్లతో దావూద్ - చోటా రాజన్ మధ్య విభేదాలు వచ్చాయి. అదే సమయంలో దావూద్ నేర సిండికేట్ అయిన డి కంపెనీని నిర్వహిస్తున్న సత్య, చోటా షకీల్, శారద షెట్టి... చోటా రాజన్‌కు వ్యతిరేకంగా దావూద్‌కు చెప్పారు.

దీంతో ఇద్దరి మధ్య వైరం పెరిగింది. రెండు గ్యాంగులు పరస్పరం తలపడేవి. మత కారణాలతో జరిగిన ముంబై పేలుళ్లను వ్యతిరేకించిన చోటా రాజన్.. దావూద్ నుంచి ముప్పు పొంచి ఉందనే కారణంతో తన మాకం ముంబై నుంచి మలేషియాకు, ఆ తర్వాత దుబాయ్ మార్చాడు. రెండు గ్యాంగులు పరస్పరం దాడులు చేసుకున్నాయి.

Chhota Shakeel claims credit for Rajan's arrest

చోటా రాజన్ పైన దావూద్ ఇబ్రహీం 2000 సంవత్సరంలో హత్యాయత్నం చేయించాడు. బ్యాంకాకులోని ఓ హోటల్లో ఉన్న రాజన్ పైన దావూద్ అనుచరుడు చోటా షకీల్ దాడి చేశాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా వచ్చిన షకీల్ కాల్పుల్లో చోటా రాజన్ అనుచరులు రోహిత్ వర్మ, అతని భార్య చనిపోయారు. చోటా రాజన్ భార్య పేరు అంకితా నికాల్జే. కూతుళ్లు నికిత, ఖుషీ ఉన్నారు.

చోటా రాజన్ మాత్రం తెలివిగా తప్పించుకొని హోటల్ అత్యవసర ధ్వారం నుంచి బయటపడ్డాడు. చోటా రాజన్‌ను ఎలాగైనా చంపుతామని, అప్పటివరకు విశ్రమించేది లేదని షకీల్ అంటున్నాడు. అతడు భారత్‌కు వచ్చినా తన ప్రయత్నాలను కొనసాగిస్తానని తెలిపాడు. భారత ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని, రాజన్‌ను పెంచి పోషించారని, తమమీదకు ఉసిగొల్పారని షకీల్ మండిపడ్డాడు.

భారత్‌లో చోటా రాజన్‌పై 17 మర్డర్ కేసులు, వందకు పైగా ఇతరత్రా కేసులు ఉన్నాయి. భారత్‌లో అతడి మీద విచారణ జరిగి, శిక్ష పడుతుందన్న నమ్మకం తనకు లేదన్నాడు. శత్రువును చంపేయడమే చేయడమే తమ లక్ష్యమని షకీల్ చెప్పాడు. అతడు ఎక్కడున్నా క్షమించేది లేదని స్పష్టం చేశాడు.

ఇక రాజన్, షకీల్ గ్యాంగ్‌ల మధ్య ఉన్న వైరం రెండు దశాబ్ధాలది. రెండు గ్యాంగులు జరుపుకున్న దాడుల్లో చాలా మంది హతమయ్యారు. అందరికంటే ముందుగా మరణించింది దావూద్‌కు సన్నిహిత అనుచరుడు శరద్ శెట్టి. ఆ తర్వాత బిల్డర్ ఓపీ కుక్రేజా, ఎయిర్‌లైన్స్ సంస్థ ఎండీ టకీయుద్దీన్ వాహిద్, నేపాల్ ఎమ్మెల్యే మీర్జా బేగ్, అక్కడి కేబుల్ ఆపరేటర్ జమీమ్ షా, పర్వేజ్ తండా.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chhota Rajan's arch-rival Shakeel Shaikh alias Chhota Shakeel claimed credit for his arrest in Indonesia. But Shakeel, who had orchestrated the fatal attack on Rajan in Bangkok in 2000, also said he was not happy with Rajan's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more