వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ దెబ్బ: కుంతియాతో విజయశాంతి భేటీ, అందుకేనా?

మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియాను కలిశారు. రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ ‌పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి కుంతియాను కలుసుకోవడం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియాను కలిశారు. రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ ‌పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి కుంతియాను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ భేటీకి ప్రాధాన్యత లేదని విజయశాంతి సన్నిహితులు చెబుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇతర పార్టీల నుండి నేతలకు వల విసురుతోంది. ముఖ్యంగా టిడిపికి చెందిన నేతలపై ఆ పార్టీ గాలం వేస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీలు కూడ కొంత అలర్ట్‌గా ఉంటున్నాయి.

Recommended Video

కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ? వాటి కోసం పట్టు Konda Surekha May Join Congress | Oneindia Telugu

టార్గెట్ 2019: కాంగ్రెస్‌లో విజయశాంతి, అజహరుద్దీ‌న్‌కు కీలకపదవులుటార్గెట్ 2019: కాంగ్రెస్‌లో విజయశాంతి, అజహరుద్దీ‌న్‌కు కీలకపదవులు

టిడిపిని వీడిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ ఛైర్మెన్ బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే పీసీసీ ప్రచార కమిటీలో విజయశాంతి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది.

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చోటుచేసుకొన్నంటున్న పరిణామాల నేపథ్యంలో విజయశాంతి కుంతియాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడ విజయశాంతి దూరంగా ఉంటున్నారు.

కుంతియాతో విజయశాంతి సమావేశం వెనుక

కుంతియాతో విజయశాంతి సమావేశం వెనుక

టిడిపిని వీడి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మెన్ బాధ్యతలను రేవంత్‌రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇదే పదవిని గతంలో విజయశాంతికి కూడ ఇస్తారనే ప్రచారం కూడ సాగింది. అయితే కుంతియాతో విజయశాంతి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

కుంతియాతో విజయశాంతి భేటీ వెనుక

కుంతియాతో విజయశాంతి భేటీ వెనుక

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇంచార్జీ కుంతియాను సినీ నటి విజయశాంతి కలవడం వెనుక రాజకీయంగా ప్రాధాన్యం లేదని ఆమె వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకురాలిగా ముఖ్య నేతలను విజయశాంతి తరచుగా కలుస్తూనే ఉన్నారని విజయశాంతి సన్నిహితులు అంటున్నారు. అయితే టీపీసీసీలో ప్రచార కమిటీ ఏర్పాటు అంశం నిన్నటి భేటీలో చర్చకు రాలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మెన్‌గా రేవంత్‌కు బాధ్యతలు అప్పగిస్తే విజయశాంతికి ఏ భాద్యతలను అప్పగిస్తారు. పార్టీ ఆలోచన ఏమిటనే విషయాలపై చర్చ సాగిసట్టు పరిశీలకులు అంచనావేస్తున్నారు.

రాజకీయాలకు దూరంగా లేడీ అమితాజ్

రాజకీయాలకు దూరంగా లేడీ అమితాజ్

2014 ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుండి ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సినిమాల్లో కూడ నటించడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఆమె కొనసాగుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత శశికళను విజయశాంతి కలిశారు. ఈ తరుణంలో అన్నాడిఎంకెను నడపాలని విజయశాంతి కోరినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీని మాత్రం విజయశాంతి వీడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరోసారి విజయశాంతి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని ఆమె వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్‌ బలోపేతం కోసం సన్నాహలు

కాంగ్రెస్‌ బలోపేతం కోసం సన్నాహలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ తరుణంలో ప్రచార కమిటీలో విజయశాంతి, అజహరుద్దీన్ లాంటి నేతలకు ఆ పార్టీ నాయకత్వం స్థానం కల్పించింది. దీనికి తోడు రేవంత్‌రెడ్డి కూడ టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను గద్దెదించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ నాయకులందరు కూడ క్రియాశీలకంగా పని చేసేలా నాయకత్వం ప్రయత్నాలను సాగిస్తోంది. ఇందులో భాగంగానే విజయశాంతి కుంతియాతో సమావేశమైందని సమాచారం.

English summary
Tollywood Cine actress Vijayashanthi met Congress party Telangana incharge Kuntia on Saturday. No importance in this meeting said Vijayashanthi's followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X