వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏందీ లొల్లి?: ముదురుతోన్న ఎమ్మెల్యేలు-కలెక్టర్ల 'వార్', పద్మా దేవెందర్, ఎర్రబెల్లి కూడా?

రాజ్‌పల్లి హైదరాబాద్‌ రహదారిలో ఉన్నందునా.. పట్టణం విస్తరించడానికి అవకాశం ఉంటుందనేది డిప్యూటీ స్పీకర్ వాదన.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు మధ్య రోజురోజుకు అగాధం పెరుగుతోంది. కలెక్టర్ల మాటకు ఎమ్మెల్యేలు నో చెప్పడం.. కలెక్టర్లు సైతం వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురి మధ్య వివాదాలు ముదురుతూనే ఉన్నాయి.

కేసీఆర్‌కు చిక్కులు: కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేలు.. పార్టీకి నష్టం చేసేదే?కేసీఆర్‌కు చిక్కులు: కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేలు.. పార్టీకి నష్టం చేసేదే?

కలెక్టర్లు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలన్ని భూవివాదాల చుట్టే చక్కర్లు కొడుతున్నాయి. కలెక్టర్స్ రూల్స్ మాట్లాడుతుంటే.. అధికారం చేతిలో ఉన్నాక తాము చెప్పిందే రూల్ అన్న తరహాలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. దీంతో కలెక్టర్లకు-ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగని వాతావరణం కనిపిస్తోంది.

రాద్దాంతం వద్దు, జరిగింది అదే!: తేలనివ్వండి, ముత్తిరెడ్డిని వణికిస్తున్న కలెక్టర్..రాద్దాంతం వద్దు, జరిగింది అదే!: తేలనివ్వండి, ముత్తిరెడ్డిని వణికిస్తున్న కలెక్టర్..

మెదక్ లోను అదే పరిస్థితి:

మెదక్ లోను అదే పరిస్థితి:

జనగామ, మహబూబాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఇప్పటికే కలెక్టర్లు వర్సెస్ ఎమ్మెల్యేల గొడవలో చేరిపోగా.. తాజాగా మెదక్ జిల్లా కూడా ఆ జాబితాలో చేరింది. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్ రెడ్డికి, కలెక్టర్ భారతికి మధ్య కలెక్టరేట్ విషయమై పంచాయితీ నడుస్తోంది.

కలెక్టరేట్ అక్కడే నిర్మించాలని:

కలెక్టరేట్ అక్కడే నిర్మించాలని:

మెదక్‌ మండలంలోని రాజ్‌పల్లి శివారులో కలెక్టరేట్‌ నిర్మించాలని డిప్యూటీ స్పీకర్‌ పట్టుబడుతున్నారు. కలెక్టర్ మాత్రం అవుసులపల్లి వద్ద నిర్మిస్తే బాగుంటుందంటున్నారు. అయితే రాజ్‌పల్లి హైదరాబాద్‌ రహదారిలో ఉన్నందునా.. పట్టణం విస్తరించడానికి అవకాశం ఉంటుందనేది డిప్యూటీ స్పీకర్ వాదన.

రాజ్‌పల్లి పట్టణానికి దూరంగా ఉన్నందువల్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందని, అది సమంజసం కాదనేది కలెక్టర్ వాదన. ఇలా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కలెక్టరేట్ నిర్మాణంపై పంచాయితీ నడుస్తోంది.

నిబంధనలకు విరుద్దంగా పద్మా దేవెందర్ రెడ్డి:

నిబంధనలకు విరుద్దంగా పద్మా దేవెందర్ రెడ్డి:

మంత్రుల తరహాలో జిల్లా స్థాయిలో అన్ని శాఖల పనితీరుపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్ రెడ్డి సమీక్షలు, సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ఇలాంటివి కుదరదని కలెక్టర్ భారతి అభ్యంతరం తెలపడంతో.. ఎమ్మెల్యే ఆమెపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో తనకు ఎదురువుతున్న ఇబ్బందుల గురించి ఇప్పటికే ఆమె సీఎస్ కు కూడా ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరు పట్ల అప్పట్లో ఐఏఎస్ లంతా సీఎస్‌ను కలవగా.. ఆ సమయంలోనే మెదక్ కలెక్టర్ భారతి కూడా తన సమస్యలను విన్నవించారు.

రామగుండంలోను అదే కథ:

రామగుండంలోను అదే కథ:

స్థానిక ఎమ్మార్వో శ్రీనివాసరావు అక్రమాలను కలెక్టర్ వెలుగులోకి తీసుకురావడంతో ఎమ్మెల్యే

సోమారపు సత్యనారాయణ కలెక్టర్ మీద కక్ష కట్టారన్న ప్రచారం ఉంది. ఎమ్మార్వోను కాపాడేందుకు ప్రయత్నిస్తూ.. కలెక్టర్ ను బదిలీ చేయించడానికి ఆయన శతవిధాలా ప్రయత్నించారని చెబుతున్నారు. అయినప్పటికీ కుదరకపోవడంతో.. ఎమ్మెల్యేకు కలెక్టర్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

వివాదం ఎలా మొదలైంది?:

వివాదం ఎలా మొదలైంది?:

రామగుండం తహశీల్దారు గూడూరి శ్రీనివాసరావును ఓదెల మండలానికి బదిలీ చేశారు. అయితే రామగుండంలో పలు ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, వాటిపై సదరు తహశీల్దారు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, అది పూర్తయ్యేంతవరకు ఆయన బదిలీ నిలిపివేయాలని ఇన్ చార్జి కలెక్టరు ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే సోమారపు లేఖ రాశారు.

పారని ఎమ్మెల్యే ఎత్తుగడ?:

పారని ఎమ్మెల్యే ఎత్తుగడ?:

అవినీతి ఆరోపణలున్న ఎమ్మార్వో బదిలీకి ఎమ్మెల్యే అడ్డుపడటం కలెక్టర్ కు నచ్చలేదని తెలుస్తోంది. అందువల్లే ఎమ్మెల్యే లేఖకు కూడా కలెక్టర్ స్పందించలేదు. దీంతో కలెక్టర్ పై కక్ష పెంచుకున్న ఎమ్మెల్యే.. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీఎస్ కు ఫిర్యాదు చేశారు.

రైస్‌ మిల్లర్లు, భూ నిర్వాసితుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.
అయితే ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఎత్తులు పారలేదు. ఉద్యోగులు, గోలివాడ భూనిర్వాసితులు కలెక్టర్ వైపే నిలవడంతో ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది.

ఎమ్మార్వో అక్రమాలు వెలుగులోకి:

ఎమ్మార్వో అక్రమాలు వెలుగులోకి:

ఎమ్మార్వోపై పలు అవినీతి ఆరోపణలు ఉండటంతో.. విచారణ జరపాలని పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్‌ను ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. విచారణలో ఆయన అక్రమాలు నిజమేనని తేలింది. అంతర్గాం టెక్స్‌టైల్‌ కో-ఆపరేటివ్‌ ప్రొడక్షన్‌ సొసైటీకి కేటాయించిన 11.25 ఎకరాల భూమిని అక్రమంగా ఇతరులకు అసైన్‌ చేశారని గుర్తించారు.

మేడిగడ్డ ప్రాజెక్టులో భాగంగా అంతర్గాం మండలంలోని గోలివాడలో పంప్ హౌజ్ నిర్మిస్తున్నందునా.. అక్కడి నిర్వాసితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎమ్మార్వో శ్రీనివాసరావు ప్రతిపాదనలు పంపిచారు. అయితే ఎలాంటి రికార్డులు లేకుండానే 58.33 ఎకరాల ప్రభుత్వ భూములకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రతిపాదించినట్లుగా విచారణలో తేలింది.

ఇక నిబంధనలు పాటించకుండా సింగరేణి ఉద్యోగుల వారసులకు సర్టిఫికెట్లు జారీ చేయడం, మ్యుటేషన్లు తదితర ఆరోపణలు నిజమని విచారణలో తేలడంతో.. ఆయన్ను సస్పెండ్ చేయాల్సిందిగా కలెక్టర్ సిఫారసు చేశారు. ఎమ్యార్వోపై చర్యలు ఎమ్మెల్యేకు రుచించలేదు. దీంతో కలెక్టర్-ఎమ్మెల్యే మధ్య విభేదాలు మొదలయ్యాయి.

మహబూబాబాద్‌లో.. శంకర్ నాయక్:

మహబూబాబాద్‌లో.. శంకర్ నాయక్:

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనా, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఓ వివాదాస్పద స్థలానికి సంబంధించి ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ చేసిన సిఫార్సును కలెక్టర్‌ ప్రీతిమీనా తిరస్కరించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

బతుకమ్మ వేడుకల్లోను ఈ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బతుకమ్మ వేడుకల ప్రాంగణంలోకి ఎమ్మెల్యే వస్తున్న సమయంలోనే కలెక్టర్ అక్కడినుంచి నిష్క్రమించారు. దీంతో కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేదని, ఎమ్మెల్యే వచ్చేంతవరకు వేచి చూడాలని తెలియదా? అంటూ బహిరంగంగానే శంకర్ నాయక్ అసహనం వ్యక్తం చేశారు.

ఎర్రబెల్లిదీ అదే గొడవ:

ఎర్రబెల్లిదీ అదే గొడవ:

ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ ప్రీతిమీనాల మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కలెక్టర్‌ సహకరించడం లేదని ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేస్తున్నారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భాగంగా.. తొలుత తొర్రూరు, పెద్ద వంగర మండలాలకు ఇళ్లు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే జీఎస్టీ అమలుతో నిర్మాణ వ్యయం పెరిగిందని, దీనికి అనుగుణంగా మరో ప్రొసీడింగ్‌ తెప్పించుకునే విషయంలో కలెక్టర్‌ ప్రీతి మీనా సహకరించడం లేదని ఎర్రబెల్లి వాపోతున్నారు.

దళితులకు భూపంపిణీ కోసం భూములు అమ్మడానికి ఆసాములు సిద్ధంగా ఉన్నా.. కలెక్టర్‌ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.కిచెన్‌ షెడ్‌ల నిర్మాణాలకు నిధులు వచ్చినా పనులు మొదలు పెట్టలేదని ఆరోపించారు.

English summary
Clashes between TRS MLA's and collectors damaging Govt image. Recently another conflict between Padma Devender Reddy and collector Bharathi came to light
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X