వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్ అప్‌సెట్: రోడ్డెక్కిన సోనియా, యాత్ర (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గురువారం నాడు ఉదయం రోడ్డెక్కారు! బొగ్గు కుంభకోణం కేసులో కోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోనియా, పార్టీ సీనియర్లు ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ తదితరులు ఏఐసీసీ కార్యాలయం నుండి మన్మోహన్ ఇంటి వరకు పాదయాత్రగా చేరుకున్నారు.

మన్మోహన్‌కు మద్దతుగా పాదయాత్ర చేశారు. అనంతరం సోనియా మాట్లాడారు. మన్మోహన్ సింగ్‌కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసునని చెప్పారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె చెప్పారు. తాము అందరం మన్మోహన్‌కు అండగా ఉంటామన్నారు.

కాగా, బొగ్గు కుంభకోణం కేసులో కేసు నమోదయిన విషయం తెలిసిందే. దీని పైన విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీంతో రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. మరోవైపు, దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు గడప తొక్కే అవకాశముంది.

తనకు నోటీసులు ఇవ్వడంపై మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. ఇది బాధాకరమైన విషయమన్నారు. ఇది తనను అప్‌సెట్‌కు గురి చేసిందన్నారు. అయితే, ఇది జీవితంలో ఓ భాగమని, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని చెప్పారు.

 సోనియా గాంధీ

సోనియా గాంధీ

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గురువారం నాడు ఉదయం రోడ్డెక్కారు! బొగ్గు కుంభకోణం కేసులో కోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది.

 సోనియా గాంధీ

సోనియా గాంధీ

మన్మోహన్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేతలు గురువారం ఉదయం పాదయాత్ర చేశారు. ఏఐసీసీ కార్యాలయం నుండి మన్మోహన్ ఇంటి వరకు పాదయాత్ర చేశారు.

 సోనియా గాంధీ

సోనియా గాంధీ

బొగ్గు కుంభకోణం కేసులో కేసు నమోదయిన విషయం తెలిసిందే. దీని పైన విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

సోనియా మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్‌కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసునని చెప్పారు.

English summary
It must be one of the darkest days in former Prime Minister Manmohan Singh's life, when he got summoned by a court in connection with coal scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X