వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌సైడ్ టాక్: టీఆర్ఎస్ నాయకుల్లో అలజడి.., ఆ విషయంలో తొందరపడ్డారా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పని అయిపోయింది అని చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ.. తమ స్వయంక్రుతాపరాధంతో ఆ పార్టీపై సానుభూతిని పెంచుతోందా?.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఏజీ రాజీనామా గులాబీ పార్టీపై ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు పంపిస్తున్నాయా?.. ఇదే విషయమై ఇప్పుడా పార్టీ ముఖ్య నాయకుల్లోనే అలజడి మొదలైందని తెలుస్తోంది.

తొందరపడ్డామా?:

తొందరపడ్డామా?:

మండలి చైర్మన్ స్వామి గౌడ్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 'హెడ్ ఫోన్స్' దాడికి సంబంధించి వీడియో ఫుటేజీని ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది.

కనీసం ప్రతిపక్ష పార్టీకైనా ఆ ఫుటేజీ చూపించకుండానే.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అటు పార్టీలోని ఒకరిద్దరు మంత్రులు కూడా అనవసరంగా తొందరపడ్డామని సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

ఉద్యమ సమయంలో మనమూ..:

ఉద్యమ సమయంలో మనమూ..:


తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అసెంబ్లీలో ఎంత దూకుడుగా వ్యవహరించిందో ప్రజలందరికి తెలుసునని గులాబీ నేతలు అనుకుంటున్నారట. ఒకానొక సమయంలో హరీశ్ రావు గవర్నర్ పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు కూడా తావిచ్చింది. అలాంటిది తాము చేసిన దాన్ని మాత్రం సమర్థించుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మాత్రం వేటు వేయడాన్ని సొంత పార్టీ నేతలే తప్పు పడుతున్నారట.

పున:సమీక్షించుకోవాలని..:

పున:సమీక్షించుకోవాలని..:

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ద్వారా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని, ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంటేనే మంచిదని ఒకరిద్దరు మంత్రులు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

అయితే అసెంబ్లీలో ఖాళీలను ప్రకటిస్తూ శాసనసభ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘానికి అదేరోజు లేఖను పంపించారని, కాబట్టి నిర్ణయాన్ని పున:సమీక్షించుకునే అవకాశం కూడా లేకపోయిందని వారు వాపోతున్నారట.

ఎందుకు తటపటాయిస్తున్నారు?:

ఎందుకు తటపటాయిస్తున్నారు?:


ఇక ఏజీ ప్రకాశ్ రెడ్డి రాజీనామా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా మారింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసులో.. అసెంబ్లీలో దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీని తమకు సమర్పించాలని హైకోర్టు ఏజీని ఆదేశించింది.

దీనికి ఏజీ సరేననడం.. ప్రభుత్వం, స్పీకర్‌ అనుమతి తీసుకోకుండానే న్యాయస్థానానికి హామి ఇవ్వడమేంటని టీఆర్ఎస్ మండిపడటం.. ఆపై ఆయన రాజీనామా చేయడం జరిగిపోయాయి. అయితే వీడియో ఫుటేజీని సమర్పించడానికి టీఆర్ఎస్ ఎందుకంత తటపటాయిస్తోందనేది ఇప్పుడు తలెత్తుతోన్న ప్రశ్న.

సానుభూతి పెరుగుతోందా?:

సానుభూతి పెరుగుతోందా?:

అటు ఎమ్మెల్యేల విషయంలోనూ, ఇటు ఏజీ విషయంలోనూ ప్రభుత్వం నిందలు మోయాల్సిన పరిస్థితి తలెత్తిందని కొంతమంది టీఆర్ఎస్ నాయకులే అనుకుంటున్నారట. అనవసరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సానుభూతి పెరిగేలా చేశామని వాపోతున్నారట. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి పరిణామాలు పార్టీకి ఏమాత్రం మంచివి కాదని భావిస్తున్నారట.

English summary
Some of the TRS leaders are dissatisfied with AG's resign over Congress MLA's expelled issue. They feel those MLA's are getting sympathy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X