హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో అమ్మాయిల వెంట పడే పోకిరీలకు బెడద పెరగడంతో పోలీసు యంత్రాంగం షీటీమ్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ షీటీమ్స్ ఆధ్వర్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో క్రైం ఎగైనెస్ట్‌ ఉమెన్‌(సీఏడబ్ల్యూ) పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా షీటీమ్స్‌కు పట్టుబడిన పోకిరీలకు ఈ కార్యక్రమం ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇప్పటి వరకూ పోకిరీలకు పోలీసులు మాత్రమే పాఠాలు చెప్పారు. కానీ ఇప్పటి నుంచి ప్రతి శనివారం షీటీమ్స్‌కు చిక్కిన వారికి నిపుణులే కౌన్సిలింగ్ ఇచ్చారు.

కౌన్సిలింగ్ అనంతరం ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని సిగ్గుతో తలదించుకున్న ఆకతాయిలు. ఫొటో తీసి పరువు తీయవద్దంటూ ప్రాధేయపడుతూ ఇలా పలు రకాలుగా తమ ముఖాలను దాచుకునే ప్రయత్నం చేశారు.

 అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు

అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు


ప్రశ్న - జవాబు విధానం ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నాపత్రం ద్వారా పోకిరీల నుంచి సమాధానాలు రాబడతారు. దీనిని బట్టి మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల మానసిక స్ధితిని అంచనా వేస్తారు. సాధారణంగా మహిళలను వేధించే వారు పరిస్ధితులు కారణంగానే ఇలా మారతారని పోలీసులు చెబుతున్నారు.

 అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు

అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు

ఈ నేపథ్యంలో దీనిని ముందుగా గుర్తించి సైకాలజిస్టుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ ఇప్పించడం వల్ల వారిలో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి, మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి సారథ్యంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు

అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు


పోకిరీలకు, ఆకతాయిలకు మహిళలను వేధించడం ద్వారా చట్టపరంగా, సమాజపరంగా ఎదురయ్యే అంశాలపై లఘుచిత్రాల రూపంలో అవగాహన కల్పించారు. విద్యార్థులైతే కెరీర్‌ను నష్టపోతారని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా మెలగాల్సిన బాధ్యతను గుర్తుచేశారు.

 అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు

అమ్మాయిల వెంట పడే పోకిరీలకు పోలీసు పాఠాలు


మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న వేధింపులను అరికట్టడంలో ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయని సీపీ సి.వి.ఆనంద్‌ తెలిపారు. మహిళలు తమకు ఎదురయ్యే ఇబ్బందులను ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ద్వారా కంట్రోల్‌ రూం నంబరు 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.

English summary
Cyberabad SHE TEAMS have introduced a Q & A method to understand the psyche of an eve-teaser. The questionnaire has various questions ranging from a person’s family background to the factors which are contributing to his impulse to commit a crime against women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X