వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డంగా దొరికాడు.. ఫోటోలు: రైళ్లో భార్యతో 1993 పేలుళ్ల నిందితుడి రొమాన్స్!

1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంకు సన్నిహితుడు ముస్తఫా దోస్సా రాత్రి రైళ్లో భార్యతో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయాడు.

|
Google Oneindia TeluguNews

ముంబై: 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంకు సన్నిహితుడు ముస్తఫా దోస్సా రాత్రి రైళ్లో భార్యతో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయాడు. పేలుళ్లలో దోస్సా పాత్ర పైన విచారణ జరుగుతోంది. 2015లో మోడళ్లకు ఆడిషన్ నిర్వహిస్తూ దోస్సా పోలీసులకు దొరికాడు.

ముస్తఫా దోస్సా రైల్లో వెళ్తూ భార్యతో గడిపిన వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. ఫోటోతో సహా మొత్తం వివరాలు బయటికి పొక్కడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం దీనిని సీరియస్‌గా తీసుకున్నారు.

హవాలా దివాలా?: మోడీ దెబ్బకు పాక్‌లో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలిహవాలా దివాలా?: మోడీ దెబ్బకు పాక్‌లో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి

సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ముస్తఫా దోస్సా దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు. పద్నాలుగేళ్లుగా ఆర్థర్ జైలులో ఉన్నాడు. గుజరాత్‌లో నమోదైన ఓ కేసు విచారణ కోసం ఇటీవల అతడిని అహ్మదాబాద్ మీదుగా రైల్లో పోరుబందర్‌కు తీసుకెళ్లారు.

Dawood Aide Accused Of 1993 Blasts Left Unsupervised With Wife On Train

ముంబైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతుండగానే దోస్సాతో మాట్లాడేందుకు అతని సన్నిహితులు పెద్ద ఎత్తున వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. దీనిని బట్టి ఇప్పటికీ అతడు జైలు నుంచే వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోందని అంటున్నారు.

అతడి వెంట ఎనిమిది మంది పోలీసులు ఎస్కార్ట్ బృందంగా ఉంది. అయినా ఇలా జరగడంపై విచారణ జరుగుతోంది. సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ రైలు అహ్మదాబాద్ చేరుకోగానే దోస్సా భార్య షబీనా ఖత్రి కూడా అదే రైలు ఎక్కారు.

పెద్ద నోట్ల రద్దు: దావూద్‌కు బిగ్ షాక్, రూ.100పై కన్ను, కానీ..పెద్ద నోట్ల రద్దు: దావూద్‌కు బిగ్ షాక్, రూ.100పై కన్ను, కానీ..

వారిద్దర్నీ పోలీసులు ఒంటరిగా వదిలేశారని అంటున్నారు. ఇద్దరూ పక్క పక్కన కూర్చుని మాట్లాడుకుంటుండగా పోలీసులంతా బోగీ వెనక్కి వెళ్లి తలుపుల దగ్గర నిలబడినట్టుగా చెబుతున్నారు.

తెల్లారి పోరుబందర్ వెళ్లాక గానీ పోలీసులు బోగీ లోపలికి వెళ్లినట్టుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమంటే రైలులో కొందరితో దోస్సా వ్యాపార విషయాల పైన కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోందంటున్నారు.

ముంబై పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న మరో ఖైదీ అబూ సలేం సైతం గతేడాది జూలైలో లక్నో కోర్టుకు వెళుతూ భార్యతో కలిసి ప్రయాణించాడు. తాజాగా దోస్సా వ్యవహారం తెరమీదికి రావడం గమనార్హం.

English summary
Dawood Aide Accused Of 1993 Blasts Left Unsupervised With Wife On Train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X