వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్కన్‌క్రానికల్ చైర్మన్ అరెస్ట్: నోటీసులేవని..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్కన్‌ క్రానికల్‌ చైర్మన్‌ వెంకట్రామి రెడ్డిని బెంగళూరు సీబీఐ అధికారులు శనివారం నాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తప్పుడు డాక్యుమెంట్లతో వెంకట్రామి రెడ్డి తమను రూ.357 కోట్ల మేర మోసం చేశారంటూ సీబీఐకి కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది.

బ్యాంకు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించారు. అనంతరం అరెస్టు చేశారు. కాగా, వెంకట్రామి రెడ్డి అరెస్టు సరికాదని, దీనిపై పోరాడుతామని డెక్కన్ క్రానికల్‌ పేర్కొంది.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీబీఐ అధికారులు డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డిని శనివారం నాడు అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జిల నివాస ప్రాంగణానికి తీసుకెళ్లి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం వెంకట్రామి రెడ్డిని బెంగళూరు తరలించారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను మోసం చేసినందుకు వెంకట్రామి రెడ్డిపై ఐపీసీ 420, 120(బీ), 468, 471 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

వెంకట్రామి రెడ్డితోపాటు ఆయన సోదరుడు వినాయక్ రవి రెడ్డి, డీసీహెచ్‌ఎల్‌ ముఖ్య అధికారి పీకే అయ్యర్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

గతంలో వివిధ బ్యాంకుల్లో రూ.1230 కోట్ల మేర వెంకట్రామి రెడ్డి లోను తీసుకున్నారు. అయితే ఆయన అన్ని బ్యాంకుల్లోనూ ఒకే ఆస్తిని తనఖా పెట్టినట్లు కెనరా బ్యాంకు గుర్తించింది.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

దీంతో వెంకట్రామిరెడ్డి తమను మోసగించారంటూ 2013లో సీబీఐకి ఫిర్యాదు చేసింది. వెంకట్రామి రెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ అధికారులు గోప్యత పాటించారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

కెనరా బ్యాంకు పెట్టిన కేసులో సీబీఐ అరెస్టు చేసిన వెంకట రామిరెడ్డి అప్పుల పర్వం 2005లో మొదలైంది. ఆ తరువాత 2009-11 మధ్యలో పలు వందల కోట్ల రూపాయల మేరకు వివిధ బ్యాంకుల నుంచి ఆయన సంస్థ డీసీహెచ్‌ఎల్‌ అప్పులు చేసింది.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

అలా అప్పులు చేయడం కోసం.. సికింద్రాబాద్‌లో ఉన్న కెనరా బ్యాంకు బ్రాంచ్‌ను మోసం చేశారని సీబీఐ ఆరోపణ. కెనరా బ్యాంకు నుంచి రెండు విధాలుగా వెంటరామి రెడ్డి అప్పులు తీసుకున్నారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

ఒకటి ఓపెన్‌ క్యాష్‌ క్రెడిట్‌ లిమిట్‌. రెండోది స్వల్పకాలిక కార్పొరేట్‌ రుణాలు. మొత్తం కలిపి సుమారు రూ. 1,230 కోట్ల మేర రుణాలు అందుకున్నారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

ఓపెన్‌ క్యాష్‌ క్రెడిట్‌ కోసం సంస్థ దగ్గర ఉన్న ముడి సరుకులు, ఇతర స్టాక్‌లు, జరుగుతున్న పని అంచనా విలువ, తయారై ఉన్న ఉత్పత్తులు, సంస్థకు రావాల్సిన బకాయిలను తాకట్టు పెట్టేశారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

వెంకట్రామి రెడ్డి అరెస్టు అక్రమమని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర్ అన్నారు. న్యాయమూర్తి ఇంటి వద్ద వెంకట్రామి రెడ్డి, వినాయక్ రవిరెడ్డిల న్యాయమూర్తి చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే నేరాలకు సంబంధించి కేసు నమోదైనప్పుడు అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పినప్పటికీ అందుకు విరుద్ధంగా వీరిద్దరని అరెస్టు చేశారన్నారు.

 డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

డెక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డి

సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సీబీఐ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రెండున్నర సంవత్సరాల నుండి దర్యాఫ్తుకు అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేయడం తగదన్నారు.

English summary
Deccan Chronicle Chairman T Venkatram Reddy Arrested Over Charges of Banking Fraud
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X