వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ వెళ్తుంటే, జగన్ వచ్చివెక్కిరింపు, సభలో..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ అనుకూల, వ్యతిరేక వర్గాలు ముఖాముఖి పోరాటానికి దిగటంతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీ రణ రంగంగా మారింది. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఇరుపక్షాలు తమ వ్యూహ ప్రతివ్యూహాలను కొనసాగిస్తుండడం, మరోవైపు తెలంగాణ బిల్లుకు ఎలాగైనా పార్లమెంటు పొందే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినాయకత్వం, జిఓఎం చకచకా పావులు కదుపుతుండడంతో తెలంగాణ సమస్యకు దేశ రాజధాని కేంద్రంగా మారిపోయింది.

జంతర్‌మంతర్ వద్ద వౌన దీక్ష చేయడం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న బస్సును తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు అడ్డగించటంతో ఎపి భవన్ ప్రాంతం యుద్ధ భూమిగా మారింది. కిరణ్ జంతర్‌మంతర్ వద్ద ధర్నా ముగిసిన తరువాత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి యుపిఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అధినాయకత్వంపై ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్రపతిని కలిసి తెలంగాణ బిల్లును పార్లమెంటుకు సిఫారసు చేయవద్దని కోరారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధులు ప్రధానిని కలిసి తెలంగాణ బిల్లును వీలున్నంత త్వరగా పార్లమెంటులో ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్లమెంటు ఉభయ సభలు కూడా తెలంగాణ అనుకూల, ప్రతికూల నినాదాలతో హోరెత్తిపోయాయి. పలుసార్లు వాయిదా పడ్డ తర్వాత ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయటం ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది.

కిరణ్ 1

కిరణ్ 1

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటుకు పంపించవద్దని కోరారు.

కిరణ్ 2

కిరణ్ 2

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటుకు పంపించవద్దని కోరారు. కిరమ్, బొత్సలు వినతి పత్రం ఇస్తూ..

కిరణ్ 3

కిరణ్ 3

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇస్తున్న దృశ్యం. పక్కన పిసిసి చీఫ్.

జగన్ 1

జగన్ 1

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతిని కలిసి వెళ్తుండగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు.

జగన్ 2

జగన్ 2

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జగన్ 3

జగన్ 3

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన నాలుగు గంటల దీక్ష పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెటకారంగా మాట్లాడారు.

తెలంగాణ మంత్రులు

తెలంగాణ మంత్రులు

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసిన అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత మంత్రులు. ప్రధాని నుండి తమకు హామీ వచ్చిందని చెప్పారు.

ప్రధాని

ప్రధాని

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి ఆయనకు పుష్పగుచ్చం ఇస్తున్న తెలంగాణ ప్రాంత నేత, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ.

దామోదర

దామోదర

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేయడంపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఆయనపై మండిపడ్డారు.

గీతా రెడ్డి

గీతా రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల ఆవేదన చెందిన మంత్రి గీతా రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం కిరణ్ దీక్షకు బయలుదేరిన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

పార్లమెంటు

పార్లమెంటు

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన పార్లమెంటు తొలిరోజైన బుధవారం దద్దరిల్లింది. ఇరు ప్రాంతాల నేతలు జై సమాక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.

చంద్రబాబు 1

చంద్రబాబు 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దేవేగౌడను కలిసిన దృశ్యం.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు శివసేన అధ్యక్షులు ఉద్దవ్ థాకరేను కలిసిన దృశ్యం.

చంద్రబాబు 3

చంద్రబాబు 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన దృశ్యం.

కెసిఆర్ 1

కెసిఆర్ 1

తెలంగాణకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ నేత శరద్ పవార్‌ను కలిశారు.

కెసిఆర్ 2

కెసిఆర్ 2

తెలంగాణకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ నేత శరద్ పవార్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...

English summary
There seems to be no respite for the Telangana statehood issue. Andhra Pradesh chief minister Kiran Kumar Reddy, who is hellbent against passing the Telangana-Bill in Parliament, is set to meet the president Pranab Mukherjee today to discuss the matter.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X