వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడువారాల్లో 45 మంది లక్షాధికారులయ్యారు, ఎలాగంటే?

నగదు రహిత లావాదేవీల్లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 45 మంది లక్షాధికారులుగా మారారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను కేంద్రం ప్రోత్సాహకాలను ఇస్తోంంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పెద్ద నగదు నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను లక్కీ గ్రాహక్ పథకం వినియోగదారులకు సిరులను కురిపిస్తోంది.వ్యాపారులకు కూడ ఈ పథకం ప్రయోజనాన్ని కల్గిస్తోంది. మూడు వారాల్లో 45మంది లక్షలాధికారులయ్యారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తరుణంలో నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఈ మేరకు డిజిటల్ లావాదేవీలను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సహకాలను ప్రకటించింది.

డిజిటల్ లావాదేవీలు చేసిన వారికి నగదు బహుమతులను ప్రభుత్వం ప్రకటించింది. నగదు రహిత లావాదేవీలన ప్రోత్సహించేందుకుగాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

రిజర్వ్ బ్యాంక్ ప్రాయోజిత నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పథకాల్లో లావాదేవీలు చేసిన సమయంలో వెలువడే లావాదేవీల ట్రాన్సక్షన్ ఐడి ఆదారంగా ఆటోమెటిక్ పద్దతిలో వినియోగదారులను ఎంపిక చేశారు.

డిజిటల్ లావాదేవీల ప్రోత్సహనికి చర్యలు

డిజిటల్ లావాదేవీల ప్రోత్సహనికి చర్యలు

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సబ్ కమిటీ సమావేశం కూడ డిజిటల్ చెల్లింపులపై ప్రోత్సాహాకాలను ప్రకటించింది. నగదు రహిత లావాదేవీల చెల్లింపులను ప్రోత్సహంలో భాగంగా లక్కీ డ్రా తీసి , విజేతలకు నగదు బహుమతులను ప్రకటించింది.నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆప్ ఇండియా పథకాల్లో చెల్లింపులు చేసిన సమయంలో ఆయా లావాదేవీల ఐడి ఆధారంగా ఆటోమెటిక్ పద్దతిలో లక్కీ వినియోగదారులు, వ్యాపారులకు నజరాలను ఎంపిక చేశారు.

 ఏప్రిల్ వరకు నగదు లావాదేవీలపై ప్రోత్సాహకాలు

ఏప్రిల్ వరకు నగదు లావాదేవీలపై ప్రోత్సాహకాలు

గత ఏడాది నవంబర్ 9వ, తేది నుండి ఏప్రిల్ 14 వ, తేది వరకు డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారులు, వ్యాపారులంతా లక్కీ డ్రా అర్హులే. డిసెంబర్ 25న, తొలి డ్రా వెలువడిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ 15 వేల మంది వినియోగదారులకు వెయ్యి చొప్పున నగదు ప్రోత్సాహకం అందిస్తారు. వారానికోసారి రూ. లక్ష , రూ. పదివేలు, రూ. 5 వేల, చొప్పున 7 వేల మందికి అవార్డులు ఇవ్వనున్నారు. ఈ మూడు వారాల్లో 45 మంది లక్షాదికారులయ్యారు.

 మూడువారాల్లో 45 మంది లక్షాధికారులయ్యారు, ఎలాగంటే?

మూడువారాల్లో 45 మంది లక్షాధికారులయ్యారు, ఎలాగంటే?

ఈ పేమేంట్ లో లావాదేవీలు చేసిన వారిలో ఎక్కువగా దక్షిణాది నుండి ఎక్కువగా ఉన్నారు. ఆంద్రప్రదేశ్ , మహారాష్ట్ర తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు. ఇక మెగా అవార్డు కింద ఏప్రిల్ 14న, రూ. కోటి 50 లక్షలు, రూ. 25 లక్షలను చెల్లించనున్నారు.

వ్యాపారులకు కూడ ప్రోత్సాహకాలు

వ్యాపారులకు కూడ ప్రోత్సాహకాలు

డిజి ధన యోజన పథకం ద్వారా వారానికి ఓసారి 7 వే మంది వ్యాపారులకు 50 వేల చోప్పున ఐదువేలు, రూ, 2,500 చొప్పున అవార్డులతో పాటు ఏప్రిల్ 14న, వ్యాపారుల కోసం మెగా డ్రాలో 50 లక్షలను, రూ.25 లక్షలు, రూ. 5 లక్షలను చెల్లించనున్నారు. యూనిఫైడ్ పేమేంట్స్ ఇంటర్ ఫేస్ , ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ , రూపే కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసేవారికి ఈ పథకం వర్తించదు. కనీసం 50 రూపాయాలు, గరిష్టంగా 3 వేల చెల్లింపులను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటారు.

English summary
the Centre's announcement of lucky draws to boost electronic payments has already created 45 'lakhpatis', three weeks into its inception. the national payments corporation of indiaan arm of the reserve bank of india (rbi), has been announcing 15 beneficiaries who win Rs 1,00,000 under the initiative every week since december 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X