వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 మంది అధ్యక్షులతో ఢీ: అరవై ఏళ్లుగా అమెరికాకు కునుకు లేకుండా చేసిన క్యాస్ట్రో

ఫిడెల్‌ క్యాస్ట్రో సమకాలీన ప్రపంచంలో ఒక విలక్షణమైన నేత. పేదలు, అన్నార్తులు, పసిపిల్లల బాగు కోసం ఆయన శ్రమించారు. క్యూబాను తన నిత్య శ్రమతో శ్రేయోరాజ్య నమూనాగా మార్చారు.

|
Google Oneindia TeluguNews

క్యూబా: ఫిడెల్‌ క్యాస్ట్రో సమకాలీన ప్రపంచంలో ఒక విలక్షణమైన నేత. పేదలు, అన్నార్తులు బాగు కోసం ఆయన శ్రమించారు. సామ్రాజ్య వాదానికి తలవంచలేదు. క్యాస్ట్రో పైన ఆరు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయి. తనపై హత్యాయత్నాలను లెక్కచేయలేదు.

దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన పాలన సాగించారు. ఈ సందర్భంగా పలు సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలు చరిత్రపుటల్లో నిలిచిపోతాయి. సామాన్యుడి గుండెల్లో వుండిపోతాయి.

ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉంటూ పక్కలో బల్లెంలా సవాల్‌ చేసిన వ్యక్తి ఫిడెల్ కాస్ట్రో. లాటిన అమెరికా దేశాల్లో క్యూబాను కమ్యూనిస్టు దేశంగా నిలిపారు. ఐదు దశాబ్దాల పాటు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించారు. తద్వారా క్యూబాను తలెత్తుకునేలా చేశారు.

ఫిడెల్ క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో స్పెయిన నుంచి వలసవచ్చి క్యూబాలో స్థిరపడిన వ్యవసాయ కుటుంబంలో 1926 ఆగస్టు 13న జన్మించారు. శాంటియాగోలో ప్రాథమిక విద్య పూర్తి చేసి హవానా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం కోర్సులో చేరారు. ఒక సభలో అప్పటి క్యూబా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి పతాక శీర్షికలకు ఎక్కారు.

ఎడ్యురాడో చిబాస్‌ సారథ్యంలోని క్యూబా పీపుల్‌ పార్టీలో చేరారు. ఎన్నికల్లో ఆయన విజయం కోసం శ్రమించారు. చిబాస్‌ పరాజయం పాలయ్యారు. కాస్ట్రోకు వ్యతిరేకంగా ప్రభుత్వం పోలీసుల వేషంలో రౌడీలను క్యాంప్‌సలో దించింది. కాస్ట్రోకు ప్రాణాపాయం ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లాలని మిత్రులు సలహా ఇచ్చారు. కానీ ఆయన ఆ సలహాను తోసిపుచ్చారు. తుపాకి పట్టుకుని, చుట్టూ అంగరక్షకులతోప్రభుత్వానికి సవాల్ విసిరారు.

బటిస్టా ప్రభుత్వం కూల్చివేత

బటిస్టా ప్రభుత్వం కూల్చివేత

క్యాస్ట్రో జైలు నుంచి విడుదలయిన తర్వాత ప్రభుత్వ అణచివేత పెరగడంతో సోదరుడు రౌల్‌ కాస్ట్రోతో కలిసి మెక్సికోకు పారిపోయారు. అక్కడే అర్జెంటీనా పోరాట యోధుడైన చేగువేరాతో పరిచయమైంది. అక్కడి నుంచి వీరు కలిసి ప్రయాణం చేశారు. బటిస్టా ప్రభుత్వ వ్యతిరేకుల్ని కూడగట్టారు.

చేగువేరాతో కలిసి

చేగువేరాతో కలిసి

చేగువేరా సారథ్యంలో వారికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు. 1959లో తిరుగుబాటు చేసి బటిస్టా ప్రభుత్వాన్ని కూలదోశారు. అనంతరం క్యూబా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. చేగువేరా కాస్ట్రో కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమెరికా కంపెనీలను జాతీయం చేశారు.

తమను ధిక్కరించడాన్నే అమెరికా అవమానంగా భావించింది. ఫిడెల్‌ సోవియట్‌ యూనియన్ పక్షాన చేరడంతో మరింత రగిలిపోయింది. క్యూబాపై మోయలేని ఆంక్షలు విధించింది. క్యూబా తమ దేశానికి 90 మైళ్ల దూరంలోనే ఉందని గుర్తుంచుకోవాలి అని అమెరికా నేత ఒకరు హెచ్చరించారు.

అమెరికా అంతే దూరం

అమెరికా అంతే దూరం


అయితే, అమెరికా కూడా మాకు అంతే దూరంలో ఉందని గుర్తుంచుకోవాలి, జాగ్రత్త అని ఫిడెల్ క్యాస్ట్రో ప్రతిస్పందించారు. 1961లో ఆయన క్యూబాను సోషలిస్టు దేశంగా ప్రకటించారు. కాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా అధ్వర్యంలో బే ఆఫ్‌ పిగ్స్‌ తిరుగుబాటు జరిగింది. సమర్థంగా తిప్పికొట్టారు.

అణుయుద్ధంపై ఆందోళన

అణుయుద్ధంపై ఆందోళన

1962లో సోవియట్‌ రష్యా అణుక్షిపణుల్ని క్యూబాలో మోహరించింది. దీంతో అణుయుద్ధం జరుగుతుందనే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ దశలో రష్యా అణ్వాయుధాల్ని ఉపసంహరించుకుంది. రష్యా చర్యను కాస్ట్రో తప్పు పట్టారు. అయినా కాస్ట్రోను రష్యా ఆర్డర్‌ఆఫ్‌ లెనిన్ సత్కారంతో, డాక్టరేట్‌తో సత్కరించింది.

11 మంది అధ్యక్షులతో ఢీ

11 మంది అధ్యక్షులతో ఢీ

ఫ్లోరిడా తీరం నుంచి కేవలం 90 మైళ్ల ప్రాయణం చేస్తే క్యూబా దీపంలోను కొంత భాగం అమెరికా సొంతం. ఇలాంటి చిన్న దేశం అధినేతగా క్యాస్ట్రో 1959 నుంచి అమెరికాకు కునుకు లేకుండా చేశారు. క్యూబా అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాలించిన క్యాస్ట్రో పశ్చిమార్థ గోళంలో తొలి కమ్యూనిస్ట్ రాజ్యానికి బీజం వేశారు. క్యాస్ట్రో తన జీవిత కాలంలో 11మంది అమెరికా అధ్యక్షుల్ని ఎదుర్కొన్నారు.

English summary
Fidel Castro, Cuban Revolutionary Who Defied U.S., Dies at 90.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X