వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త శకం: దీప ఎంట్రీతో.. తమిళ రాజకీయ 'రణం'

దీప రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడున్నంత జోరుగానే మున్ముందు సాగుతుందా లేక.. శశికళ ఎత్తులతో కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదా? అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మరణానంతరం అనేక మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాలు నేటితో మరో కీలక మలుపు తీసుకున్నాయి. అమ్మకు అసలైన వారసురాలిని నేనే అంటూ ఆమె మేనకోడలు దీప రాజకీయ రంగప్రవేశం చేయడంతో.. అమ్మ వారసుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని కొద్దిరోజుల క్రితమే చెప్పిన దీప జయకుమార్.. ఇందుకోసం బాగానే కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మేనత్త జయలలితకు అసలైన వారసురాలిని అనిపించుకోవడంతో పాటు.. అమ్మ రాజకీయ గురువు ఎంజీఆర్ మద్దతుదారులను సైతం తనవైపే నిలుపుకోవాలన్న వ్యూహాలతో దీప తెరమీదకు వచ్చినట్టుగా పరిశీలకులు చెబుతున్నారు.

ఎంజీఆర్ శతజయంతినే ఎంచుకోవడం వెనుక:

ఎంజీఆర్ శతజయంతినే ఎంచుకోవడం వెనుక:

పొలిటికల్ ఎంట్రీపై ఆచీతూచీ నిర్ణయం తీసుకున్న దీప.. ఇందుకోసం ఎంజీఆర్ శతజయంతి రోజునే ఎన్నుకోవడం వెనుక పదునైన వ్యూహాం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంజీఆర్ కు విధేయురాలిగా.. అమ్మ వారసురాలిగా తమిళ ప్రజల మన్ననలు పొందేందుకే దీప మంగళవారం నాడు తన రాజకీయ ఎంట్రీని నిశ్చయం చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.

మెరీనా బీచ్ లో బలప్రదర్శన:

మెరీనా బీచ్ లో బలప్రదర్శన:

అన్నాడీఎంకే చీఫ్ శశికళకు చెక్ పెట్టడమే ప్రధాన ధ్యేయంగా రాజకీయాల వైపు మళ్లిన దీప.. తన ఎంట్రీతోనే శశికళకు వణుకు పుట్టించినంత పనిచేశారు. ఎంజీఆర్ కు నివాళులు అర్పించేందుకు దీప వర్గీయులు, శశికళ వర్గీయులు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో.. తమ తమ మద్దతుదారుల నినాదాలతో బీచ్ అంతా మారుమోగిపోయింది.

దీపకు మద్దతుగా భారీ జనసందోహం తరలిరావడం శశికళకు షాక్ అనే చెప్పాలి. శశికళ మద్దతుదారులు అమెకు మద్దతుగా నినాదాలు చేయగా.. దీప మద్దతుదారులు 'అమ్మకు అసలైన వారసురాలు' అంటూ నినాదాలు చేయడంతో భవిష్యత్తులో వీరిద్దరి మద్య వార్ కు ఇప్పటినుంచే అడుగులు పడ్డట్టయింది.

దీప విద్యాభ్యాసం లండన్ లో:

దీప విద్యాభ్యాసం లండన్ లో:

జయలలిత మేనకోడలు దీపజయకుమార్ లండన్ లో విద్యను అభ్యసించారు. ఆమె చిన్నతనంలో మేనత్త వద్దే పెరిగారు. దీంతో జయలలిత ప్రభావం దీపపై ఉంది. అయితే ఏమైందో ఏమో స్పష్టంగా తెలియదు గానీ కొన్నాళ్లకు జయలలిత దీప కుటుంబాన్ని జయలలిత పక్కనబెట్టేసింది.

అప్పటినుంచి దీప తన మేనత్త జయలలితను అడపాదడపా కలుస్తూనే ఉన్నారు.
అయితే అమ్మ చివరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సమయంలో.. ఆమెను పరామర్శించడానికి వెళ్లిన దీపను అధికారులు లోనికి వెళ్లనివ్వలేదు.

సానుభూతి.. పోలిక.. రెండూ ప్లస్:

సానుభూతి.. పోలిక.. రెండూ ప్లస్:

జయలలిత మేనకోడలు కావడం.. అచ్చు ఆమె పోలికతోనే ఉండటం దీపజయకుమార్ కు ప్లస్ అయింది. అదీగాక, జయలలిత బ్రతికున్న రోజుల్లో ఆమెను కలవడం కోసం దీప పలుమార్లు విఫలయత్నం చేయడం జయపై దీపకు ఉన్న అభిమానాన్ని చాటాయి. ఒకవిధంగా ఇవన్నీ దీప పట్ల సానుభూతిని కలిగించేవిగా మారాయి.

దీంతో పాటు చాలామంది తమిళ ప్రజలు 'అమ్మ' స్థానంలో శశికళను సమర్థించడం లేదు. ఈ వ్యతిరేకత కూడా దీపకు ప్లస్ అయింది. శశికళ వ్యతిరేకులంతా దీప రాజకీయాలకు మున్ముందు అండగా నిలబడే అవకాశం కనిపిస్తోంది.

వారసత్వ పోరులో.. అసలు విజయమెవరిదో?:

వారసత్వ పోరులో.. అసలు విజయమెవరిదో?:

మొత్తానికి తన ఎంట్రీతో భవిష్యత్తులో శశికళకు తానే ప్రధాన పోటీదారుని అని దీప సంకేతాలు పంపించారు. ఇకనుంచి శశికళకు చెక్ పెట్టడమే ప్రధానంగా ఆమె పావులు కదుపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి దీప వ్యూహాలకు చెక్ పెట్టాలంటే శశికళ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేయక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే దీప రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడున్నంత జోరుగానే మున్ముందు సాగుతుందా? లేక.. శశికళ ఎత్తులతో కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదా? అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

English summary
J Jayalalithaa's niece Deepa Jayakumar today laid claim to her political legacy, saying she plans to contest elections and "follow in her footsteps", but saved a bigger announcement for the February 24 birth anniversary of the former Chief Minister who died last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X