• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెరాస రాములు హత్య, ఆ పక్కనే కెసిఆర్!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాంబశివుడి సోదరుడు, నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కొనాపురి రాములు తుపాకీ గుళ్లకు బలైన విషయం తెలిసిందే. ఒక కార్యక్రమం కోసం మిర్యాలగూడ రోడ్‌లోని ఫంక్షన్ హాలుకు వచ్చిన రాములును కొందరు వ్యక్తులు చుట్టుముట్టి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.

అతి సమీపం నుంచి రాములు ముఖంపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆయన అనుచరులు, చుట్టుపక్కల జనం తేరుకునేసరికే అక్కడినుంచి పరారయ్యారు. ఆ సమయంలో తెరాస అగ్రనేతలు కెసిఆర్, హరీశ్ రావు అక్కడకు దగ్గర్లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉండటంతో తెరాస శ్రేణులు నివ్వెరపోయాయి.

మాజీ నక్సల్ నయీం ముఠానే హత్యలకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాములు హంతకులను వెంటనే అరెస్టు చేయాలని కెసిఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నయీం ముఠా నుంచి ప్రాణభయం ఉన్నదని రాములు రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా రోజుల క్రితమే నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయితే, ఆయన హత్యకు ఆగంతకులు నల్గొండనేఎంచుకొన్నారు.

కోనపురి రాములు

కోనపురి రాములు

మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాంబశివుడి సోదరుడు, నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కొనాపురి రాములు తుపాకీ గుళ్లకు బలైన విషయం తెలిసిందే.

కోనపురి రాములు

కోనపురి రాములు

ఒక కార్యక్రమం కోసం మిర్యాలగూడ రోడ్‌లోని ఫంక్షన్ హాలుకు వచ్చిన రాములును కొందరు వ్యక్తులు చుట్టుముట్టి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.

 కోనపురి రాములు

కోనపురి రాములు

అతి సమీపం నుంచి రాములు ముఖంపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆయన అనుచరులు, చుట్టుపక్కల జనం తేరుకునేసరికే అక్కడినుంచి పరారయ్యారు. ఆ సమయంలో తెరాస అగ్రనేతలు కెసిఆర్, హరీశ్ రావు అక్కడకు దగ్గర్లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉండటంతో తెరాస శ్రేణులు నివ్వెరపోయాయి.

కోనపురి రాములు

కోనపురి రాములు

రెండు పెళ్లిళ్లలో పాల్గొనేందుకు రాములు ఆదివారం ఉదయం నల్గొండ పట్టణం వచ్చారు. మిర్యాలగూడ రోడ్‌లోని ఎంఏ బేగ్ ఫంక్షన్‌హాల్‌లో దగ్గరి బంధువు కూతురి వివాహానికి హాజరయ్యారు.

కోనపురి రాములు

కోనపురి రాములు

నూతన దంపతులకు అక్షింతలు వేసి కొద్దిసేపు బంధువులతో గడిపారు. మరో పెళ్లి వద్దకు వెళ్లేందుకు అక్కడ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ పొంచి ఉన్న గుర్తు తెలియని సాయుధులు 11.30 ప్రాంతంలో ఫంక్షన్ హాల్ బయట ఆయనను చుట్టుముట్టారు.

కోనపురి రాములు

కోనపురి రాములు

రాములు గన్‌మెన్లు అప్రమత్తం అయ్యేసరికే వారిపై కారంపొడి చల్లారు. వచ్చిన వారిలో నలుగురు ఇద్దరు గన్‌మెన్లను బంధించారు. మరో నలుగురు రాములు తప్పించుకోకుండా గట్టిగా పట్టుకోగా, మరికొందరు చాలా దగ్గర నుంచి ముఖం మీద, ఇతర శరీర భాగాలపై కాల్పులు జరిపాడు.

కోనపురి రాములు

కోనపురి రాములు

రాములు కుప్పకూలిపోయేదాకా కాల్పులు జరిపాడు. ఆ తరువాత అక్కడే సిద్ధంగా పెట్టుకొన్ని వాహనంలో నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్‌రోడ్‌లో పరారయ్యారు. చుట్టుపక్కల జనం హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి రాములును తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు.

కోనపురి రాములు

కోనపురి రాములు

తాను ఏ జిల్లాకు వెళుతున్నది ముందే చెబితే.. ఆ జిల్లా పోలీసులు రాములుకు ఎస్కార్ట్ కల్పించేవారు. అయితే, ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న విషయం నల్గొండ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

కోనపురి రాములు

కోనపురి రాములు

కూతవేటు దూరంలోని ఫంక్షన్ హాల్‌లో కెసిఆర్, హరీశ్ రావులు ఉన్నట్టు తెలుసుకొని.. వారి వద్దకు బయలుదేరుతుండగానే రాములుపై దాడి జరిగినట్టు సన్నిహితులు చెబుతున్నారు.

కోనపురి రాములు

కోనపురి రాములు

నయీం ముఠానే రాములు హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని, జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో పోస్‌మార్టం ప్రాంతాన్ని డిఐజి శశిధర్‌రెడ్డి సందర్శించారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కోనపురి రాములు

కోనపురి రాములు

పోస్టుమార్టం గది వద్ద పెద్ద ఎత్తున జనం గుమికూడి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. పోస్ట్ మార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం తెరాస జిల్లా కార్యాలయంలో ఉంచారు. అనంతరం స్వగ్రామానికి తరలించారు. సోమవారం పలు ప్రజాసంఘాలు నల్లగొండ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి.

English summary

 Unidentified assailants gunned down TRS leader and former Maoist Konapuri Ramulu (40) inside a function hall here on Sunday. The murder took place minutes after TRS president K Chandrasekhar Rao left the venue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X