వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవికి అందమే శాపమైందా,అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi Passes Away : అందమే శాపమైందా, అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా?

న్యూఢిల్లీ: అందాల నటి శ్రీదేవి హఠాత్తుగా మరణించడానికి కారణాలేమిటనే చర్చ ప్రస్తుతం అందరి మదిని వేదిస్తున్న ప్రశ్నలు. అయితే అందంగా ఉండేందుకు ఆమె చేసుకొన్న సౌందర్య చికిత్సలు, శస్త్రచికిత్సలు పరోక్షంగా కారణమయ్యాయా అనే చర్చ కూడ లేకపోలేదు. ఈ రకమైన శస్త్రచికిత్సలు మృత్యువుకు దగ్గరకు తీసుకెళ్తున్నాయా అనే చర్చ కూడ లేకపోలేదు. సినీ రంగంలో ఉన్నవారంతా తమ అందానికి మెరుగులు దిద్దుకొనేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్నారు.

ప్రముఖ నటి శ్రీదేవి హఠాత్తుగా మరణించడం ఆమె అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే సౌందర్య పరీక్షల కారణంగానే ఆమె మరణించిందా అనే చర్చ కూడ లేకపోలేదు.

ప్లాస్టిక్ సర్జరీలు పరోక్షంగా చావుకు దగ్గరగా తీసుకెళ్తాయనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. తమ అందానికి మెరుగులు దిద్దుకొనేందుకు సినీ రంగంలోని పలువురు సినీ తారలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్నారు.శ్రీదేవి, కరీనా కపూర్‌, అనుష్క లాంటి వారెందరో ఈ తరహ శస్త్రచికిత్సలు చేయించుకొన్నారు.

ప్లాస్టిక్ సర్జరీలే కారణమా

ప్లాస్టిక్ సర్జరీలే కారణమా

అందానికి మెరుగులు దిద్దుకునేందుకు శ్రీదేవి ప్లాస్టిక్‌ సర్జరీలను చేసుకున్నారు. అప్సరసకు మారు రూపుగా కనిపించాలనే ఆరాటంతో తపన పడుతూ వివిధ సౌందర్య సాధనాలు, సౌందర్య ఉత్పత్తులపై సినీ తారలు ఆధారపడుతున్నారు. శ్రీదేవి ముక్కుకు ఆపరేషన్ చేయించుకొందని సినీ పరిశ్రమలో ప్రచారంలో ఉంది. ఆ తర్వాత కూడ తన అందాన్ని కాపాడుకోవడం కోసం శ్రీదేవి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిందంటారు. ఇవే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చాయనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది .

ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొన్న తారలు

ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొన్న తారలు

సన్నగా నాజూగ్గా కనిపించడానికి కరీనా కపూర్‌, దొండపండు లాంటి పెదవుల కోసం అనుష్కశర్మ... ఇలా ఒక్కొక్కరు సినీ పరిశ్రమ అంచనాలను చేరుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకొన్నారు. వీరే కాకుండా ఇంకా అనేక మంది కూడ ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొన్నారని సినీ రంగంలో ప్రచారంలో ఉంది. అమాంతం బరువు తగ్గిపోవడం, అనవసరంగా చికిత్సలు చేయించుకోవడం వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం తలెత్తుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. సైజ్‌ జీరో అంటూ 2009లో కరీనా అందుకున్న పల్లవి మన దేశంలో సంచలనం సృష్టించింది. కరిష్మా కపూర్‌, కంగనా రనౌత్‌, ప్రియాంక ఛోప్రా, శిల్పాశెట్టి, శ్రుతి హాసన్‌ తదితరులు సౌందర్యపరమైన శస్త్రచికిత్సలు చేసుకున్నారని సిని పరిశ్రమలో ప్రచారంలో ఉంది.

ఆహరం విషయంలోనూ శ్రీదేవి జాగ్రత్తలు

ఆహరం విషయంలోనూ శ్రీదేవి జాగ్రత్తలు

ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేది శ్రీదేవి గురించి తెలిసిన ఆమె సన్నిహితులు చెబుతుంటారు. చిరుతిళ్ళకు ఆమె దూరంగా ఉండేవారు. శ్రీదేవి శాకాహారి. ఆమె కూల్‌డ్రింక్‌లకు చాలా దూరంగా ఉండేది. ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేసేదని ఆమె సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. మిఠాయి, ఐస్‌క్రీములంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. అయితే నోటిని అదుపులో ఉంచుకోలేక కొన్ని సందర్భాల్లో ఎక్కువగా వాటిని తింటే లావుగా అయిపోయేది. అయితే లావుగా అయిపోయినట్టుగా గుర్తించిన వెంటనే వాటికి దూరంగా ఉండేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ఆ సమయంలో కేవలం ఉడికించిన ఆహరం మాత్రమే తీసుకోనేదని వారు గుర్తు చేసుకొంటున్నారు.

ఆర్తి ఆగర్వాల్ ఇలానే

ఆర్తి ఆగర్వాల్ ఇలానే

ప్లాస్టిక్ సర్జరీలు లేదా ఇతరత్రా సౌందర్య పోషణకు సంబంధించిన చికిత్సలు చేసుకొన్న తర్వాత కొందరు తారలు హఠాత్తుగా మరణించిన సందర్భాలు గతంలో చోటుచేసుకొన్నాయి. తెలుగు నటి అర్తి అగర్వాల్ ఈ రకమైన ఆపరేషన్ తర్వాతే గుండెపోటుతో మరణించింది. మరో నటి రీమాలాగూ కూడ గుండెపోటుతోనే మరణించింది. శ్రీదేవి కూడ గుండెపోటుతో మరణించింది. శ్రీదేవి కూడ ఈ తరహ శస్త్రచికిత్సలు చేయించుకొన్నారన్న ప్రచారం ఉంది.

గుండెపోటుకు ముందస్తు సంకేతాలు

గుండెపోటుకు ముందస్తు సంకేతాలు

తలతిరగడం, ఉన్నట్టుండి చెప్పలేనంత అలసటగా అనిపించడం ,ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం, గుండె నొప్పిగా అనిపించడం వంటివి ముంచుకురానున్న ముప్పునకు సంకేతాలు. ఒక్కోసారి నాలుగు వారాల కంటే ముందు నుంచీ కూడా శరీరం ఇలాంటి సంకేతాలను పంపుతుంది. వాటిని గుర్తించడం తప్పనిసరి. ఒక రకంగా వికారంగా అనిపించడం, అలసట, వెన్నునొప్పి, మెడ, భుజాల నొప్పులు కూడా రాబోయే గుండెపోటుకు సంకేతాలే కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

English summary
Soon after the death of Sridevi, WhatsApp messages began doing the rounds about whether her death may be linked to the plastic surgeries she underwent to change her appearance. She was only 54 and seemingly fit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X