• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గంగిరెడ్డి: మారిషస్ టు ఏపీ.. మలుపులెన్నో (పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, అలిపిరిలో ఏపీ సీఎం చంద్రబాబు పైన దాడి ఘటనలో నిందితుడు గంగిరెడ్డిని హైదరాబాద్‌కు తీసుకురావడంలో ఎన్నో మలుపులు, ఎడతెగని ఉత్కంఠ. గంగిరెడ్డిని పోలీసులు ఆదివారం నాడు హైదరాబాద్ తీసుకు వచ్చారు. అనంతరం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.

గంగిరెడ్డిని తీసుకు వచ్చేందుకు కోర్టు అనుమతి, మారిషస్‌ చట్టాల ప్రకారం.. చివరకు ఆ దేశ ప్రధానమంత్రి సహకారం.. ఇలా ఎన్నో మలుపులు తిరిగాయి. సుదీర్ఘంగా సాగిన ఈ ప్రక్రియలో ఏపీ పోలీసులు ఎనిమిది నెలల అనంతరం అతనిని తీసుకు వచ్చారు. వివరాల ప్రకారం...

ఏపీ సీఐడీ అధినేత ద్వారకా తిరుమలరావు నేతృత్వంలో మారిషస్‌ పోలీసు అధికారులతో కూడిన బృందం గంగిరెడ్డిని హైదరాబాద్‌ తీసుకు వచ్చింది. కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి నేరచరిత్ర 1987లో మరో 58 మంది సహచరులతో కలిసి బాంబులు, మారణాయుధాలతో ప్రత్యర్థులపై దాడులు చేయడంతో మొదలైంది.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

అతడిపై ఏపీలో 28 కేసులు ఉన్నాయి. వీటిలో ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నం కేసు కూడా ఉంది. ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగిన అతడు దేశ విదేశాల్లో అనుచరులను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా సంపాదించాడు. ఆస్తి రూ.400 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

గంగిరెడ్డి

గంగిరెడ్డి

చివరగా 2014 ఏప్రిల్‌ 5న కర్నూలు జిల్లా డోన్‌లో అరెస్టయ్యాడు. మే 16న బెయిల్‌పై బయటకు వచ్చిన గంగిరెడ్డి దుబాయ్‌ పారిపోయాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంగిరెడ్డిపై దృష్టి సారించారు.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఫిబ్రవరి 22న ఇంటర్ పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు ఆధారంగా మారిషస్‌ పోలీసులు గంగిరెడ్డిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ అతడిని ఇక్కడకు రప్పించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సీబీఐ, భారత విదేశాంగ శాఖ, ఇంటర్ పోల్‌, మారిషస్‌లో భారత రాయబారి, ఆదేశ న్యాయశాఖల సహకారం తీసుకున్నారు. మొదట నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం ప్రకారం గంగిరెడ్డిని రప్పించేందుకు ప్రయత్నించారు.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

దీనిలో భాగంగానే పోర్టలూయిస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గంగిరెడ్డిపై ఉన్న కేసుల గురించి వివరిస్తూ వీటిపై తమ దేశంలో న్యాయవిచారణ జరగాల్సి ఉందని, కాబట్టి తమకు అప్పగించాలని పేర్కొన్నారు. దీనిపై వాదనలు మొదలయ్యాయి. వాస్తవానికి మారిషస్‌కు మన దేశానికి మధ్య నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం లేదు. అయినప్పటికీ కోర్టు ద్వారా గంగిరెడ్డిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నించారు.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

కాని కేసు వాయిదాలు పడుతూ వస్తోంది. కోర్టు ద్వారా రప్పించడం ఇప్పట్లో సాధ్యంకాదన్న విషయం పోలీసులకు అర్థమైంది. దాంతో ఇతర మార్గాలు అన్వేషించడం మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే గంగిరెడ్డి పాస్‌పోర్టు రద్దు చేయించారు. అతడు గత ఏడాది మేలో విదేశాలకు పారిపోయాడు. తప్పుడు సమాచారంతో పాస్‌పోర్టు పొందాడు కాబట్టి దాన్ని రద్దు చేయాలని పోలీసులు భారత పాస్‌పోర్టు అధికారులను కోరారు.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

వీరి విజ్ఞప్తి మేరకు వారు రద్దు చేశారు. ఈ విషయాన్ని మారిషస్‌ ప్రభుత్వానికి తెలిపారు. పాస్‌పోర్టు రద్దయిందంటే సదరు వ్యక్తి అక్రమంగా నివసిస్తున్నట్లే. ఈ నేపథ్యంలో గంగిరెడ్డిపై ఉన్న నేర చరిత్ర, పాస్‌పోర్టు రద్దు అయినందున అక్కడ ఉండే అర్హత అతనికి లేదు కాబట్టి తమకు అప్పగించాలని కోరుతూ భారత ప్రభుత్వం తరఫున ఏపీ పోలీసులు మారిషస్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు.

గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఈ లేఖను పరిశీలించిన మారిషస్‌ ప్రధానమంత్రి జైల్లో ఉన్న గంగిరెడ్డికి శనివారం నోటీసులు జారీ చేశారు. 24 గంటలు గడిచినా గంగిరెడ్డి నుంచి సమాధానం రాలేదు. దాంతో గంగిరెడ్డిన దేశం నుంచి బహిష్కరించారు. మారిషస్‌ చట్టాల ప్రకారం దీనిపై కోర్టును ఆశ్రయించే అవకాశం గంగిరెడ్డికి ఉంది. కాని ఆదివారం కావడంతో న్యాయస్థానానికి వెళ్ళే వీలులేకుండా పోయింది.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

మారిషస్‌ ప్రధానమంత్రి సంతకం చేసిన లేఖను ఆంధ్రప్రదేశ్‌ పోలీసు బృందం జైలు అధికారులకు చూపించింది. దాని ఆధారంగా గంగిరెడ్డిని తమ అదుపులోకి తీసుకుంది. వీరితోపాటు ఇద్దరు మారిషస్‌ అధికారులు కూడా భారత్‌ బయలుదేరారు. ఈ పరిణామాల్ని ఊహించని గంగిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఏపీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గంగిరెడ్డి చేసిన పోరాటం చూసి అధికారులే అవాక్కయ్యారు. డబ్బుకు కొదవలేకపోవడంతో భారత్ నుంచి పేరుపొందిన లాయర్లే కాదు మారిషస్‌లో పెద్దపెద్ద న్యాయవాదులను నియమించుకున్నాడు. భారత సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదితోపాటు కర్నూలుకు చెందిన న్యాయవాది కూడా గంగిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

మారిషస్‌ ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ, అక్కడ ప్రముఖ న్యాయవాది రవిరత్నే, మరో ప్రముఖ న్యాయవాది తిలక్‌ధారి వంటివారు కూడా గంగిరెడ్డి తరఫున వాదించారు. న్యాయవాదులకు రూ.కోట్లు ఖర్చుపెట్టేందుకు గంగిరెడ్డి వెనుకాడలేదు.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

మారిషస్‌ పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డిని స్వదేశానికి తీసుకొని రావాలంటే ఆ దేశంలో చట్టాల గురించి మన పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలి. ఒక్కసారి అక్కడి కోర్టు గంగిరెడ్డిని అప్పగించేందుకు తిరస్కరిస్తే దారులన్నీ మూసుకొని పోయినట్లే. అందుకే తిరుమలరావు నేతృత్వంలోని పోలీసు బృందం మారిషస్‌ చట్టాలను చదివింది.

గంగిరెడ్డి

గంగిరెడ్డి

అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను ప్రధానమంత్రి ఆమోదంతో మాతృదేశానికి పంపవచ్చన్న విషయం తెలుసుకుంది. ఇందులోనూ కొన్ని లొసుగులు ఉన్నాయి. ప్రధానమంత్రి ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయించే అధికారం మారిషస్‌ చట్టాల ప్రకారం నిందితునికి ఉంది. ఒకవేళ ఇదే జరిగి ప్రధానమంత్రి ఆదేశాలపై గంగిరెడ్డి కోర్టుకు వెళితే పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది.

 గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఆ పరిస్థితి రాకుండా శుక్రవారం ప్రధానికి లేఖ రాసి, శనివారం గంగిరెడ్డికి నోటీసులు జారీ అయ్యేలా చూడటంలో ఏపీ పోలీసులు కృతకృత్యులయ్యారు. ప్రధాని దేశ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. మర్నాడు ఆదివారం కావడంతో దీనిపై కోర్టును ఆశ్రయించే అవకాశం గంగిరెడ్డికి లేకుండా పోయింది.

 గంగిరెడ్డికి సహకరించిందెవరు?

గంగిరెడ్డికి సహకరించిందెవరు?

గంగిరెడ్డి దొరికినప్పటికీ ఇంతకాలం అతనికి సహకరించిందెవరు అన్నదానిపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ దృష్టి సారించింది. ఇంతకాలం విదేశాల్లో ఉండటమే కాదు మారిషస్‌లో న్యాయస్థానంలో తన వాదనలు వినిపించేందుకు రూ.కోట్లు ఖర్చుపెట్టాడు. దుబాయ్‌తోపాటు ఇతర దేశాల్లో తలదాచుకున్న గంగిరెడ్డి ఆఫ్రికా దేశమైన ఘనా, మడ్‌గస్కర్‌లలో కూడా కొంతకాలం ఉన్నాడు. చివరగా మారిషస్‌ వచ్చి దొరికిపోయాడు.

 గంగిరెడ్డికి సహకరించిందెవరు?

గంగిరెడ్డికి సహకరించిందెవరు?

ఇంతకాలం విదేశాల్లో ఉండటం మామూలు వ్యవహారం కాదు. దాంతో అతనికి ఎవరు సహకరించారు, డబ్బు ఎలా సమకూర్చుకున్నాడు తదితర అంశాల్లో దర్యాప్తు జరుపుతామని డీజీపీ స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న ఓ ముఖ్యనేతతో గంగిరెడ్డికి దగ్గర సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ నేత గంగిరెడ్డి ఇంటికెళ్లి అతని కుటుంబసభ్యులను కలిశారట.

English summary
"My luck has run out and I am caught" -- was how the 'most wanted' red sanders smuggler Kollam Gangi Reddy reacted when he spoke to the media here on Sunday, hours after his extradition from Mauritius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X