వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందల కిలోల బంగారం: ఎవరీ అయూబ్ ఖాన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విదేశాల నుంచి హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయానికి అక్రమంగా తరలిస్తున్న బంగారం తీరు చూస్తుంటే గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా, శనివారంనాడు కస్టమ్స్ అధికారులు నాలుగు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఆగంతకుడు కస్టమ్స్ అధికారులకు భయపడి విమానం సీట్లోనే బంగారాన్ని వదిలేసి పారిపోయాడు.

మస్కట్ నుంచి హైదరాబాదు వచ్చిన విమానంలో ఈ బంగారం బయటపడింది. నిందితుడి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఎంత మందిని పట్టుకున్నా ఈ బంగారం స్మగ్లింగ్ మాత్రం అగడం లేదు. బంగారం ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నట్లు అనుమామానిస్తున్నారు. ఇలా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న అక్రమ బంగారం వెనుక పాతబస్తీ రౌడీషీటర్ అయూబ్‌ఖాన్ పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో, దుబాయ్ నుంచి అక్రమ బంగారాన్ని తరలించిన నగరవాసులను కస్టమ్స్, డీఆర్‌ఐ సిబ్బంది పట్టుకున్నారు. వీరిని విచారించిన అధికారులు బంగారం రవాణా అంతా అయూబ్‌ఖాన్ కనుసన్నుల్లోనే జరుగుతున్నట్టు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ స్మగ్లర్లతో జతకట్టిన అయూబ్‌ఖాన్ బంగారం స్మగ్లింగ్‌కు హైదరాబాద్‌లోని తన నెట్‌వర్క్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది.

Gold smuggling: Key person Ayub Khan?

నమస్తే తెలంగాణ వార్తాకథనం ప్రకారం - అయూబ్ ఎంట్రీ అయిన తర్వాత గత ఏడెనిమిది నెలల్లో వందల కిలోల అక్రమ బంగారం నగరానికి చేరినట్లు పోలీసులు సేకరించిన ఆధారాలు వెల్లడిస్తున్నాయి. దుబాయ్‌లో స్థిరపడ్డ అయూబ్‌ఖాన్ గోల్డ్ స్మగ్లింగ్ చేసే ముఠాలతో చేరి హైదరాబాద్‌తో పాటు, ముంబై, కేరళ, కర్నాటక తదితర ప్రాంతాలకు అక్రమ బంగారం తరలించేందుకు ఏజెంట్‌లను సరఫరా చేస్తున్నాడని తాజా దర్యాప్తులో వెల్లడైంది.

గోల్డ్ స్మగ్లింగ్‌కు నగరం నుంచి వెళుతున్న యువకులు, మహిళలపై అయూబ్‌ఖాన్ 50 వేల నుంచి లక్ష రుపాయాల వరకు ఖర్చు చేస్తున్నట్లు నిందితులిచ్చిన వాంగ్మూలం ద్వారా తెలిసింది. వారికి దుబాయ్‌కు వెళ్లొచ్చేందుకు ఫ్లయిట్ టిక్కెట్‌లు, రెండు రోజుల విడిది, షాపింగ్, సైట్ సీయింగ్‌లతో పాటు కొంత నగదును ఇస్తున్నాడు. ఆ తర్వాత వారితో కిలో నుంచి రెండు కిలోల బంగారాన్ని పంపిస్తున్నాడు.

రౌడీషీటర్ అయూబ్‌ఖాన్‌పై 30కి పైగా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద విడుదలైన అయూబ్ కొన్ని రోజులు నగరంలోనే ఉండి సెటిల్మెంట్లు ప్రారంభించాడు. పీడీయాక్ట్ నమోదైతే ఏడాది వరకు జైలులో గడపాల్సి వస్తుందని భావించిన అయూబ్ పోలీసుల కళ్లుగప్పి దుబాయ్ పారిపోయినట్టు తెలిసింది. పీడీ యాక్ట్ ప్రయోగానికి సంబంధించి పోలీసులే అతనికి ముందుగా ఉప్పందించినట్టు సమాచారం.

అతని పాసుపోర్టును నగర పోలీసులు సీజ్ చేసినప్పటికి అయూబ్‌ఖాన్ తప్పుడు పేరుతో మరో పాసుపోర్టు తీసుకుని రోడ్డు మార్గం ద్వారా పాకిస్థాన్‌కు చేరుకుని అక్కడి నుంచి దుబాయ్‌కు వెళ్ళినట్లు తెలిసింది. దుబాయ్‌లో ఉన్న అయూబ్‌ఖాన్‌ను ఇంటర్‌పోల్ సహాయంతో నగరానికి తీసుకువచ్చేందుకు సిటి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అయూబ్ కోసం ఏప్రీల్ నెలలోనే లుక్‌ఔట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు.

English summary
According to media reports - Ayub Khan may be the key person behind the smuggling of gold from Gulf Countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X