• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్లాక్‌మనీలో వీళ్లు.., కలకలం: చిట్టా తెలిసినా చిక్కులు

By Srinivas
|

హైదరాబాద్: 'పనామా పేపర్స్' దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మొసాక్ ఫొనెక్సా నుంచి బహిర్గతమైన 1.15 కోట్ల పత్రాలు పలు ఆందోళనకర విషయాలను బయటపెట్టాయి. అక్రమ నగదు చెలామణి, ఆయుధాలు, మత్తు మందుల వ్యాపారాలు, పన్నులు ఎగ్గొట్టడం కోసం కొందరు కొన్ని విదేశీ కంపెనీలను వినియోగించుకుంటున్నట్లు తేల్చింది.

అక్రమార్కుల గుట్టును బయటపెట్టడం ద్వారా ఐసీఐజే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిని 1997లో ఏర్పాటు చేశారు. ఇది తాజాగా మొసాక్ ఫోన్సెకా కంపెనీకి సంబంధించిన వివరాలను 76 దేశాలకు చెందిన 370 మంది పాత్రికేయులు విశ్లేషించారు. ఇందులో భారత్ నుంచి ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విలేకరులు ఉన్నారు.

కాగా, బ్లాక్ మనీ చిట్టా వెలుగు చూడటం, అందులో వివిధ దేశాధినేతలు, ప్రముఖులు ఉండడం సంచలనంగా మారింది. ఇంత భారీ స్థాయిలో ప్రముఖుల నల్లధన వ్యవహారాల గుట్లన్నీ రట్టవడం ఇదే తొలిసారి. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియస్‌ అసాంజె కూడా ఇంతకుముందు నల్లధనవంతుల జాబితాలను విడుదల చేశారు. అనంతరం స్విట్జర్లాండ్‌లోని హెచ్‌సీబీసీలో ఉన్న వందలాది ఖాతాల వివరాలూ వెలుగుచూశాయి.

Government team to probe Indians named in Panama papers leak

అయితే, ఇంతవరకు నల్లధనం పోగేసుకున్న వారి పైన తీసుకున్న చర్యలు మాత్రం ఏం లేవని చెప్పవచ్చు. 2011 జూన్‌లో ఫ్రాన్స్‌ సుమారు 700 పేర్లతో ఒక జాబితాను భారత్‌కు అందించింది. హెచ్‌ఎస్‌బీసీ మాజీ ఉద్యోగి ఒకరు 2006లో ఆ బ్యాంకు నుంచి దొంగిలించిన సమాచారం ఆధారంగా ఫ్రాన్స్‌ దాన్ని భారత్‌కు అందించింది.

అందులో వారి పేర్లు, ఆడ్రస్‌లు, జెనీవాలోని బ్యాంకు ఖాతా సంఖ్యలు, అందులో ఉన్న ధనం వంటి సమగ్ర వివరాలున్నాయి. ఆ పేర్లను ప్రభుత్వం బయటపెట్ట లేదు. 2014 అక్టోబరులో భారత ప్రభుత్వం కూడా ముగ్గురు భారతీయ నల్ల కుబేరుల పేర్లను వెల్లడించింది. సుప్రీం కోర్టుకు సమర్పించిన ఆ జాబితాలో ఉన్నవారంతా బిజినెస్‌దారులే.

2014లో వికీలీక్స్‌ ప్రకటించిన జాబితా ఒకటి 20 మంది భారత రాజకీయ ప్రముఖుల పేర్లతో ప్రచారంలోకి వచ్చింది. 2011లోను వికీలీక్స్ బ్లాక్ మనీ వారి జాబితాను బయటపెట్టింది. అందులోను భారతీయుల పేర్లు ఉన్నాయి. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎంతెంత డబ్బును విదేశాల్లో దాచారు, ఏఏ బ్యాంకుల్లో దాచారన్న వివరాలూ వికీలీక్స్‌ వెబ్‌సైట్లో ఉంచారు.

2015 ఫిబ్రవరిలో జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ శాఖ నుంచి అక్కడ డబ్బు దాచిన కొందరి వివరాలు బయటకు వచ్చాయి. 2006-07కి సంబంధించి ఆ ఖాతాల్లో ఉన్న డబ్బు వివరాలు వెల్లడైంది. అనంతరం 1,195 మంది భారతీయుల పేర్లు బయటపడ్డాయి.

నల్లధనం ఉన్న వారి వివరాలు

ఐసిఐజె (ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్) నల్లధనం దాచుకున్న వారి వివరాలను బయటపెట్టింది. వారిలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. పనామా పత్రాల్లో 500 మందికిపైగా భారతీయుల పేర్లున్నాయి. అమితాబ్ బచ్చన్‌, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్‌ల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటం వారి అభిమానుల్ని ఆవేదనకు గురిచేసింది.

వీరితోపాటు స్థిరాస్తి వ్యాపార రంగంలో దిగ్గజాలుగా పేరున్న డీఎల్‌ఎఫ్‌ అధిపతి పీకే సింగ్‌, ఇండియాబుల్స్‌ అధిపతి సమీర్‌ గెహ్లాట్‌, అపోలో టైర్స్‌ ఛైర్మన్‌ ఓంకార్‌ కన్వర్‌ తదితరులు ఉన్నారు.

పన్ను అనుకూల బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, బహమాస్‌ తదితర దేశాల్లో వీరు ఏర్పాటుచేసిన కంపెనీలు, వాటిల్లో నిర్వహించిన లావాదేవీలు, పరోక్షంగా భారీఎత్తున జరిగిన లావాదేవీల వివరాలు వెల్లడయ్యాయి. అయితే తామంతా ఆర్‌బీఐ నిబంధనల మేరకే విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆయా ప్రముఖులు పేర్కొన్నారు.

నల్లధనం జాబితాలో...

దేశాధినేతలు - మౌరికో మాక్రి (అర్జెంటీనా అధ్యక్షుడు), సిగ్ముందర్ డేవియో గునాల్గుసన్ (ఐస్‌ల్యాండ్ ప్రధాని),

సల్మాన్ (సౌదీ అరేబియా రాజు), ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు),

పెట్రో పోరోషన్కో (ఉక్రెయిన్ అధ్యక్షుడు)

మాజీ దేశాధినేతలు - బిద్ జినా ఇవానిష్ విలీ (జార్జియా మాజీ ప్రధాన మంత్రి), అయద్ అలావీ (ఇరాక్ తాత్కాలిక ప్రధాని), ఆలీ అబూ అల్ రహేబ్ (జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి), హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (ఖతార్ మాజీ ఎమిర్), హమద్ బిన్ జాసిమ్ బిన్ జాబెర్ అల్ థానీ ( ఖతార్ మాజీ ప్రధాని)

అహ్మద్ అల్ మిర్గానీ (సూడాన్ మాజీ అధ్యక్షుడు), పావ్ లో లాజరెంకో (ఉక్రెయిన్ మాజీ ప్రధానమంత్రి)

మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు -

అల్జీరియా: అబ్దెస్లామ్ బౌచోరెబ్, ఇండస్ట్రీ, గనుల మంత్రి

అంగోలా: జోస్ మరియా బొతెల్హో డి వాస్కోనెసిలస్, పెట్రోలియం మంత్రి.

అర్జెంటీనా: నెస్టర్ గ్రిండెటే, లానుస్ నగర మేయర్.

బోత్స్వానా: ఇయాన్ కిర్బీ, బోత్వ్యానా మాజీ అటార్నీ జనరల్

బ్రెజిల్: జోవా లైరా, డిప్యూటీస్ చాంబర్ సభ్యుడు

కంబోడియా: జస్టిస్ ఆంగ్ వాంగ్ వతానా, న్యాయ శాఖా మంత్రి

చిలీ: ఆల్ఫ్రెడో ఓవల్లే రోడ్రిగెజ్, ఇంటెలిజెన్స్ ఏజన్సీ సభ్యుడు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో: జైనెట్ కాబిలా, నేషనల్ అసెంబ్లీ సభ్యుడు.

కాంగో రిపబ్లిక్: బ్రూనో ఇటోవా, సైంటిఫిక్, పరిశోధనా శాఖా మంత్రి.

ఈక్వడార్: గాలో చిరిబోగా, అటార్నీ జనరల్.

పెడ్రో డెల్గాడో, సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్.

ఫ్రాన్స్: జెరోమీ చుహుజక్, ఆర్థిక శాఖ మాజీ మంత్రి.

గ్రీస్: స్టావ్రోస్ పాపాస్టావ్ రోవ్, మాజీ ప్రధానులకు సలహాదారు.

హంగేరి: జోల్ట్ హోర్వత్, నేషనల్ అసెంబ్లీ మాజీ సభ్యుడు.

ఐస్‌ల్యాండ్: బిజర్నీ బెనడిక్ట్ సన్, ఆర్థిక మంత్రి.

ఓల్ఫ్ నార్డాల్, అంతర్గత వ్యవహారాల మంత్రి.

భారత్: అనురాగ్ కేజ్రీవాల్, లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ మాజీ చీఫ్

కెన్యా: కల్పనా రావల్, సుప్రీం కోర్టు డిప్యూటీ చీఫ్ జస్టిస్

మాల్టా: కొన్రాడ్ మిజ్జీ, ఇంధన, ఆరోగ్య శాఖా మంత్రి.

నైజీరియా: జేమ్స్ ఐబోరి, డెల్టా రాష్ట్ర మాజీ గవర్నర్.

పాలస్తీనా: ముహమ్మద్ ముస్తఫా, నేషనల్ ఎకానమీ శాఖ మాజీ మంత్రి.

పనామా: రికార్డో ఫ్రాంకోలినీ, సేవింగ్స్ బ్యాంక్ మాజీ చైర్మన్

పెరు: సీసర్ అల్మేదా, నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ డైరెక్టర్.

పోలాండ్: పావెల్ పిస్కోర్క్సీ, వార్సా నగర మాజీ మేయర్.

రువాండా: ఇమ్మానుయేల్ నదాహిరో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బ్రిగేడియర్ జనరల్, మాజీ ముఖ్యమంత్రి.

సౌదీ అరేబియా: ముహమ్మద్ బిన్ నాయెఫ్, సౌదీ యువరాజు, అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి

యునైటెడ్ కింగ్ డమ్: మైఖేల్ అష్ క్రాఫ్ట్, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు.

మైఖేల్ మేట్స్, హౌస్ ఆఫ్ కామన్స్ మాజీ సభ్యురాలు.

పమేలా షార్ప్ లెస్, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు.

వెనిజులా: విక్టర్ క్రజ్ వెఫర్, ఆర్మీ మాజీ కమాండర్-ఇన్-చీఫ్.

జీసస్ విల్లాన్యూవా, పీడీవీఎస్ఏ మాజీ డైరెక్టర్.

జాంబియా: అటాన్ షాన్సోంగా, అమెరికాకు మాజీ రాయబారి.

వీరితో పాటు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కాగా, విదేశాల్లో అక్రమ ఖాతాలున్న వారి పైన కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. అలాంటి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కాగా, పనామా పేపర్ల పైన దర్యాఫ్తు జరపనున్నారని తెలుస్తోంది.

English summary
Government team to probe Indians named in Panama papers leak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X