వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్‌సెన్స్: గుజరాత్‌లో బీజేపీ గెలుపుపై జిగ్నేష్, అందుకే బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

యువత కాంగ్రెస్ కు పట్టం కట్టిందా ?

అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ నేత ఒకరు తమ పార్టీ గుజరాత్‌లో ఓడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంత మెజార్టీ రాదని చెప్పారు.

గుజరాత్‌లో మా పార్టీ ఓడిపోతుంది: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుగుజరాత్‌లో మా పార్టీ ఓడిపోతుంది: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

తాజాగా, జిగ్నేష్ మేవానీ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంతా నాన్‌సెన్స్ అని, బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. జిగ్నేష్ వాడ్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

జిగ్నేష్ మేవానీ వ్యాఖ్య అదే

జిగ్నేష్ మేవానీ వ్యాఖ్య అదే

బీజేపీకి ఎంతో కీలకమైన గుజరాత్‌లో ఆ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని జిగ్నేష్ మేవానీ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంతా నాన్సెన్స్ అన్నారు. వాడ్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అది మేవానీకి మద్దతు ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జిగ్నేష్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు.

కాంగ్రెస్ మెజార్టీ మార్క్ సాధిస్తుందని

కాంగ్రెస్ మెజార్టీ మార్క్ సాధిస్తుందని

బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్‌ కకడే తమ పార్టీ ఓడిపోతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంతటి మెజారిటీని సాధించలేదని జోస్యం చెప్పారు. గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించలేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి మెజారిటీ కూడా దక్కదని, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం మెజారిటీ మార్కును సాధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఆరుగురు సభ్యుల బృందం సర్వేలో తేలింది

ఆరుగురు సభ్యుల బృందం సర్వేలో తేలింది

ఒకవేళ గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అది కేవలం ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే అని వ్యాఖ్యానించారు. ఆరుగురు వ్యక్తులు ఉన్న ఓ బృందాన్ని నేను గుజరాత్‌లో సర్వే చేయమని పంపించానని, వాళ్లంతా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా సర్వే చేశారని సంజయ్ తెలిపారు.

విమర్శలే పనిగా పెట్టుకున్నారు

విమర్శలే పనిగా పెట్టుకున్నారు

వాళ్లు రైతులు, డ్రైవర్లు, కార్మికులను ఎక్కువగా కలుసుకున్నారని సంజయ్ చెప్పారు. ఆ సర్వే ప్రకారమే చెబుతున్నానని, బీజేపీ మెజార్టీ సాధించలేదన్నారు. ఎందుకంటే మలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలెవరూ అభివృద్ధి గురించి ప్రస్తావించలేదని, గుజరాత్‌లో ఉపాధి కల్పన గురించి మాట్లాడలేదని, ఈ మూడేళ్లలో ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాలు వాటి ప్రభావం గురించి ఏ మాత్రం మాట్లాడలేదని చెప్పారు. కేవలం ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఓటర్లును బీజేపీకే ఓటు వేయాల్సిందిగా వేడుకున్నారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

English summary
A day before the D-day, Dalit activist and leader Jignesh Mevani, who is contesting from Vadgam constituency as an independent candidate in the Gujarat Assembly elections, said he was confident the Bharatiya Janata Party would lose in the crucial state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X