వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ లాహోర్ పర్యటన: కీలక పాత్ర వీరిదే!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్ పర్యటన వెనుక పాకిస్థాన్, భారత్ అధికార, దౌత్యవర్గాల కంటే ప్రైవేట్ వ్యక్తులు కీలక పాత్ పోషించారని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. గల్ఫ్ దేశాల్లోని భారత్, పాక్‌కు చెందిన వ్యాపారస్తులే ప్రధాని పర్యటనలో ముఖ్యభూమిక పోషించారు.

పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ కుటుంబానికి గల్ఫ్ దేశాల్లో ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. భారత్‌కు చెందిన జిందాల్ గ్రూప్‌నకు కూడా స్టీల్ పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిందాల్ గ్రూప్‌కు చెందిన సజ్జన్ జిందాల్‌కు పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమారుడు హుసేన్‌ షరి‌ఫ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

గల్ఫ్ కేంద్రంగా వీరిద్దరి మధ్య తరచుగా సమావేశాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా ఈ ఇద్దరు, ఇరు దేశాల ప్రధానుల భీటీలో కీలకపాత్ర పోషించారని సమాచారం. ప్రధాని మోడీ లాహోర్‌కు చేరుకునే సమయానికే సజ్జన్‌ జిందాల్‌ మాత్రం ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇంట్లో ఉండడం గమనార్హం.

Gulf business man behind PM Modi lahore surprise visit

కాగా, ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి న్యూఢిల్లీకి వచ్చిన నవాజ్‌ షరీఫ్‌, సజ్జన్‌ జిందాల్‌ ఇంట్లో తేనేటీ విందుకు హాజరయ్యారు. అంతేకాదు గతేడాది ఖాట్మాండులో జరిగిన సార్క్‌ శిఖరాగ్ర సదస్సులో ఇద్దరు ప్రధానుల మధ్య కీలకమైన భేటీ ఏర్పాటు చేయడంలో సజ్జన్‌ జిందాల్‌ కీలకపాత్ర పోషించారు.

ప్రధాని మోడీ లాహోర్ పర్యటన 'సౌహార్ద పర్యటన' మాత్రమేనని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ చౌదరి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించినా... నవాజ్‌ షరీఫ్‌ మనువరాలికి పెళ్లి కూతురు దుస్తుల కానుక మాత్రం అకస్మాత్తుగా తీసుకోరాలేరూ కదా? అని మరికొందరు అంటున్నారు.

నిజానికి ప్రధాని లాహోర్ పర్యటన గురించి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు సమాచారం లేకున్నా ఆకస్మిక పర్యటన ద్వారా మోడీ రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని సుష్మాస్వరాజ్ కొనియాడారు. అమెరికా సైతం మోడీ ఆకస్మిక పర్యటనను స్వాగతించింది.

మోడీ శుక్రవారం లాహోర్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్‌ను కలిసి చర్చలు జరపడాన్ని స్వాగతిస్తున్నామని, రెండు దేశాల మధ్య సంబంధాలు ఆసియాకే మేలు చేస్తాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

మరోవైపు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ ప్రధాని మోడీ పాక్ పర్యటనను స్వాగతించారు. సుదీర్ఘ కాలం తర్వాత ఇరు దేశ ప్రధానులు కలవడాన్ని ఆయన అభినందించారు. ఈ చర్చలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని ఆసిస్తున్నట్లు తెలిపారు.

తెలుగు వన్ఇండియా

English summary
Gulf business man behind PM Modi lahore surprise visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X