హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెలరోజుల కేసీఆర్ హీరో: కార్నర్ చేసిన బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో ఆయన పాలనలో దూకుడుగా వ్యవహరించారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎదురవుతున్న సమస్యలు, విద్యుత్, నీరు, ప్రాజెక్టు.. తదితర సమస్యల పైన ఆయన ధీటుగా స్పందించారు. దాంతో పాటు పాలనలోను తన మార్క్ చూపిస్తున్నారు. మెట్రో, గురుకుల్ ట్రస్ట్ భూములపై ఆయన గట్టి పట్టు పడుతున్నారు. గురుకుల్ వ్యవహారంలో ఆయన ఏకంగా హీరో అయిపోయారు.

తెలంగాణ ఉద్యమం నడిపిన తరహాలోనే పరిపాలనలోనూ కేసీఆర్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వరుసగా, శాఖల వారీగా ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏ నిర్ణయమైనా, ఏ విధానమైనా, ఏ పనైనా తెలంగాణ ప్రయోజనాలే తన అంతిమ లక్ష్యమంటూ ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గడంలేదు.

ఫీజుల రీ ఇంబర్స్‌మెంట్ ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ. తెలంగాణలో పుట్టి పెరిగిన పిల్లలు అందరికీ ఫీజు రీఎంబర్స్‌మెంట్ అమలు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నా... కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి పైసా వ్యయం 'తెలంగాణ బిడ్డల'కే దక్కాలనే ధోరణితోనే ముందుకు సాగుతున్నారు. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకే ఫీజు రీఎంబర్స్ అనే నిబంధన పెడుతున్నారు.

గురుకుల్ ట్రస్ట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత, ల్యాంకో హిల్స్ ప్రాజెక్టులపై నజర్, మెట్రో రైల్ మార్గంలో మార్పులు తదితర అంశాలపై కేసీఆర్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ నెల రోజుల్లో కేసీఆర్ చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఉండాలన్నది అందులో ముఖ్యమైనది. ఆగస్టు 15న భూ పంపిణీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర గుర్తుతో కొత్త కార్డుల మంజూరు చేస్తామన్నారు. పోలీసు సంస్కరణలపై భారీ స్థాయిలో చర్చలు జరిపారు. హైదరాబాద్-సైబరాబాద్ పరిధిలో కొత్త యూనిఫామ్, న్యూయార్క్ తరహా పోలీసింగ్‌పై ఆలోచనలు చేశారు.

పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందికి వారాంతపు సెలవు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. పోలవరం ప్రాజె క్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయడం కీలకమైన పరిణామం. దీంతో పాటు తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఉభయ సభల్లో తీర్మానాన్ని ఆమోదించారు.

రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో టాటా సంస్థ డార్నియర్ విమాన విడిపరికరాల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేయటం కొత్త రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దిశగా పడిన మంచి అడుగు. ప్రస్తుతం తెలంగాణను విద్యుత్తు సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. ఖర్చు ఎంతైనా, ఎక్కడి నుంచైనా విద్యుత్తు కొనుగోలు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరెంటు కోసం స్వయంగా ఛత్తీస్‌గఢ్ సీఎంతో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు.

కేసిఆర్

కేసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు అవుతోంది. ఆయన పాలనలో దూకుడుగా వెళ్తున్నారు.

గురుకుల్ ట్రస్ట్ భూములు

గురుకుల్ ట్రస్ట్ భూములు

గురుకుల్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లర చంద్రశేఖర రావు ఏకంగా హీరో అయిపోయారు. ఆయనను అభినందిస్తూ మాజీ మంత్రి శంకర రావు లేఖ రాశారు.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా వదలలేదు. తమ్మిడి కుంట చెరువును ఆక్రమించుకొని కట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు నిర్ధారించారు.

 నాగార్జున

నాగార్జున

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా వదలలేదు. తమ్మిడి కుంట చెరువును ఆక్రమించుకొని కట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు నిర్ధారించారు.

మెట్రో

మెట్రో

రాజధాని హైదరాబాదులోని మెట్రో రైలు నిర్మాణ మార్గం మార్చాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెబుతున్నారు.

 రుణమాఫీ

రుణమాఫీ

రుణమాఫీ విషయంలో పరిమితి నేపథ్యంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ప్రకటించడం, ఉద్యోగుల విరమణ వయస్సును 60కి పెంచడం వంటి చంద్రబాబు నిర్ణయాలు కేసిఆర్‌ను కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పలు సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దూకుడుగా వెళ్తున్నారు.

 ఏడు మండలాలు

ఏడు మండలాలు

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ తేవడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్రంగా వ్యతిరేకించారు.

English summary
A month since he took charge, it seems that Telangana Chief Minister K Chandrasekhar Rao can do no wrong at this point of time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X