వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలాల్‌కు షాక్: జైలు నుండి విడుదలకు $6 బిలియన్ చెల్లించాలి

By Narsimha
|
Google Oneindia TeluguNews

రియాద్:ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఓకడుగా పేరొందిన అల్ వాలీద్ బిన్ తలాల్‌ను విడిపించేందుకు సౌదీ ప్రభుత్వం 6 బిలియన్ డాలర్లను కోరుతోంది. ప్రపంచంలోని పలు దేశాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న తలాల్ ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు.

ఈ ఏడాది నవంబర్ 5న అల్ వాలిద్ బిన్ తలాల్ అరెస్ట్ అయ్యారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. అవినీతి నిర్మూలనను కారణంగా చూపుతూ వాలిద్ బిన్ తలాల్‌తో పాటు సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్ అరెస్ట్ చేయించారు.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న తలాల్ మాత్రం జైలు నుండి బయట పడేందుకు ప్రభుత్వం విధించిన జరిమానాను చెల్లించడమే మార్గంగా ఉంది. ఈ జరిమానాను చెల్లిస్తేనే ఆయనను జైలు నుండి విడుదల చేస్తారు.

జైలు నుండి విడుదల కావాలంటే

జైలు నుండి విడుదల కావాలంటే

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడుగా అల్ వాలీద్ బిన్ తలాల్‌ కు పేరుంది. అయితే ఆయన ప్రస్తుతం సౌదీ జైల్లో మగ్గుతున్నాడు. ఆయనను జైలు నుండి విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. అయితే సుమారు 6 బిలియన్ డాలర్ల జరిమానాను చెల్లిస్తేనే జైలు నుండి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టు ఆ పత్రిక ప్రకటించింది.

పలు దేశాలతో తలాల్ కు సంబంధాలు

పలు దేశాలతో తలాల్ కు సంబంధాలు


ప్రపంచంలోని పలు దేశాల్లో తలాల్‌కు వ్యాపారాలున్నాయి. అంతేకాదు పలు దేశాల ప్రభుత్వాలతో కూడ ఆయనకు సత్సంబంధాలున్నాయి. అయితే సౌదీ ప్రభుత్వం తలాల్ ను అరెస్ట్ చేసినప్పటీ ఈ పలుకుబడి ఏ మాత్రం ఉపయోగపడలేదు. సౌదీ ప్రభుత్వం చెప్పినట్టుగా జరిమానాను చెల్లిస్తేనే ఆయన జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది.

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడు

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడు

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో అల్ వాలీద్ బిన్ తలాల్‌ ఒకరు. ఆయన ఆస్తి సుమారు 16 బిలియన్ డాలర్లు. ఇండియా కరెన్సీలో లక్ష కోట్లకు పైగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో తలాల్ వ్యాపార సామ్యాజ్యం విస్తరించింది.

యువరాజుల విడుదల కోసం భారీగా జరిమానా చెల్లింపు

యువరాజుల విడుదల కోసం భారీగా జరిమానా చెల్లింపు


అనేకమంది యువరాజులను విడుదల చేయించేందుకు భారీ జరిమానాలను చెల్లించారు. కానీ తలాల్‌ను విడిపించేందుకు ఎవరూ ముందుకురాలేదు. తలాల్‌ను విడిపించాలంటే పెద్ద మొత్తంలో జరిమానాను చెల్లించాల్సి రావడమే కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ కథనంలో తెలిపింది.

English summary
hollywood techonolgy investor prince al weleed bin talal arrest, talal needs $6 billion dollors for freedaom, saudi government arrested talal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X