వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేష్-స్వాతి మృతిలో ట్విస్ట్: అలా చేస్తే కేసు మొత్తం తారుమారు!

నరేష్ - స్వాతిల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు దొరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొరికిపోయాడు.

|
Google Oneindia TeluguNews

భువనగిరి: నరేష్ - స్వాతిల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు దొరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొరికిపోయాడు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో నరేష్ - స్వాతిల మృతిలో ఎన్నో ట్విస్టులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. చివరకు స్వాతి తండ్రినే పోలీసులు నిందితులుగా తేల్చారు.

'అలా బతికేవారు': అదే పట్టించింది, నరేష్-స్వాతి మధ్య విభేదాలనే....'అలా బతికేవారు': అదే పట్టించింది, నరేష్-స్వాతి మధ్య విభేదాలనే....

ముంబైలో డబ్బావాలాగా పని చేసే వ్యక్తి కొడుకు నరేష్ - స్వాతి కేసులో పోలీసులు శ్రీనివాస్ రెడ్డితో పాటు సత్తిరెడ్డిని శనివారం అరెస్టు చేశారు.

తొలుత స్వాతి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఇటీవలే నరేష్ మృతదేహం కనిపించింది.

సెల్‌ఫోన్ రికార్డుల పరిశీలన

సెల్‌ఫోన్ రికార్డుల పరిశీలన

దీంతో పోలీసులు నరేష్ సెల్ ఫోన్ రికార్డును పరిశీలించారు. ఆయన అదృశ్యమైన మే 2న రాత్రి ఎనిమిది గంటలకు నరేష్ ఫోన్ టవర్ లొకేషన్ భువనగిరి బస్టాండ్ వద్ద గుర్తించారు. అప్పుడు స్వాతి, నరేష్‌లు ముంబై నుంచి భువనగిరి వచ్చారు. ఆ తర్వాత స్వాతి తండ్రితో వెళ్లిపోయింది.

ఫోన్ సిగ్నల్స్ ఇలా..

ఫోన్ సిగ్నల్స్ ఇలా..

ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో నరేష్ ఫోన్ టవర్ నెట్ వర్క్ తుర్కపల్లి వద్ద గుర్తించారు. స్వాతి స్వగ్రామం లింగరాజుపల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తుర్కపల్లి ఉంటుంది. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. మే 3వ తేదీన సాయంత్రం అయిదు గంటలకు మౌలాలీ స్టేషన్ వద్ద సెల్ ఫోన్ సిగ్నల్ ఉంది. దీంతో నరేష్ ముంబైకి తిరుగు పయనం అయినట్లుగా పోలీసులు భావించారు.

ఆ తర్వాత పోలీసులు మే 2వ తేదీన నరేష్‌కు ఎవరెవరి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయో వారిని విచారించారు. అలాగే నరేష్ కుటుంబ సభ్యులను విచారించారు.

విచారణ సమయంలో శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డిలు పోలీసులకు ఓ విషయం చెప్పారు. నరేష్‌ను మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

ఐరన్ రాడ్డు స్వాధీనం

ఐరన్ రాడ్డు స్వాధీనం

అయితే, నరేష్‌ను, ఆతనితో పాటు ఉన్న వ్యక్తిని శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డిలు వెంబడించారు. నరేష్ వారికి దొరికాడు. నరేష్‌తో పాటు ఉన్న వ్యక్తి మాత్రం తప్పించుకుపోయాడు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి.. నరేష్‌ను చంపేసినట్లు పోలీసులు గుర్తించారు.

నరేష్‌ను చంపడానికి ఉపయోగించిన ఐరన్ రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ దానికి ఎలాంటి రక్తపు మరకలు లేవు.

మెడపై బలంగా కొట్టడంతో..

మెడపై బలంగా కొట్టడంతో..

నరేష్ మెడ పైన రాడ్డుతో శ్రీనివాస్ రెడ్డి కొట్టాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడని తెలుస్తోంది. నరేష్ స్పాట్‌లోనే చనిపోయాడని, కొట్టినప్పుడు ఎలాంటి రక్తం రాలేదని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడని తెలుస్తోంది. బాడీని కాల్చేసిన తర్వాత అక్కడి ప్రాంతాన్ని శుభ్రం చేసినట్లు చెప్పాడని తెలుస్తోంది. అనంతరం బొక్కలను మూసీలో కలిపేసినట్లు తెలిపాడు.

ఎముకల కోసం గాలింపు

ఎముకల కోసం గాలింపు

ఎముకలను మూసీలో కలపడంతో వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, స్థానికులు మాత్రం.. ఇందులో ఇక్కడే చనిపోయిన చాలామంది బొక్కలను కలిపినట్లు పోలీసులకు తెలిపారు. ఇది పోలీసులకు చిక్కుగానే మారింది.

ఇక్కడే చిక్కు

ఇక్కడే చిక్కు

మూసీలో చాలామంది బొక్కలు కలిపారు. ఒకవేళ మూసీ నుంచి బొక్కలు సేకరించి తాము వేరే వారివి పంపిస్తే నెగిటివ్ రిపోర్ట్ వస్తుందని, అప్పుడు కోర్టులో కేసు అంతా తారుమారు అవుతుందని, కాబట్టి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీసులు తెలిపారు.

శ్రీనివాస్ రెడ్డికిచెందిన హీరో మాస్టరో స్కూటర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ బైక్ పైనే బొక్కలను తీసుకు వెళ్లి మూసీలో కలిపారు. కానీ ఆ తర్వాత అదే బండిని పలుమార్లు శుభ్రంగా కడిగారు. కాగా, నరేష్‌తో పాటు ఉన్న వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
With no clinching material evidence, Rachakonda police have a tough task on hand to prove the role of T Srinivas Reddy and Sathi Reddy in the gruesome murder of Bhongir youth A Naresh at Lingarajupalli in Yadadri district. The youngster was apparently eliminated on May 2 in an honour killing for marrying an upper caste girl against the wishes of her family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X