వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియోలో భారత్‌కు కాంస్యం: ఎవరీ సాక్షి మాలిక్?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

రియో డీ జనీరో: ఎట్టకేలకు రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతాను తెరిచింది. ఒక్క పతకం కోసం కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురవుతున్న వేళ మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.

ఒలింపిక్స్‌లో ఓ మహిళా రెజ్లర్ పతకం సాధించడం ఇదే తొలిసారి. గత 12 రోజులుగా భారత్‌కు పతకం వస్తుందా లేదా అన్న ఆశతో ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెర దించింది. హర్యానాలోని రోహ్‌తక్ సమీపంలోని మోఖ్రా సాక్షి మాలిక్ స్వస్థలం.

రియోలో భారత్‌కు తొలి పతకం: సాక్షి మాలిక్ అసాధారణ పోరాటం

చిన్నప్పటి నుంచీ క్రీడలంటే ఆసక్తి. పదకొండేళ్ల వరకు తన చదువుని కొనసాగించిన సాక్షి మాలిక్ ఆ తర్వాత కుస్తీ వైపే మొగ్గు చూపింది. పన్నెండేళ్ల వయసులో గురువు ఈశ్వర్‌ దహియా వద్ద శిక్షణకు చేరింది సాక్షి. రోహ్‌తక్ ప్రాంతంలో కుస్తీ క్రీడలో ఎక్కువగా అబ్బాయిలు మాత్రమే ఆడేవారు.

ఈ క్రమంలో కుస్తీని ఆడేందుకు ఇష్టపడిన సాక్షికి మొదట్లో విమర్శలు ఎదురయ్యాయి. కుస్తీ ఆటలో ఆటను సాధన చేయాలన్నా.. సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలన్నా అబ్బాయిలతో పోటీ పడాల్సిందే. అలా తర్ఫీదు పొందుతున్న ఆమెకు స్థానికులతో పాటు బంధువుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

India's history-maker at Rio Olympics 2016: Who is Sakshi Malik?

అంతేకాదు అమ్మాయికి ఈ కుస్తీ పోటీలెందుకు? అని చాలామంది నిలదీశారు. ఆ సమయంలో కోచ్‌ ఈశ్వర్‌ భుజం తట్టి ఆమెకు అండగా నిలిచారు. స్థానిక పోటీల్లో విజయాలు సాధించడం మొదలుపెట్టింది. ఆనాటి నుంచి నేటి ఒలింపిక్ పతకం సాధించే వరకు సాక్షి వెనుదిరిగి చూడలేదు.

బుధవారం అర్ధరాత్రి దాటాక 2.51 నిమిషంలో జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5 తేడాతో ఐసులు తినిబెకోవా(కిర్గిజిస్తాన్)పై విజయం సాధించింది. మొత్తంగా చూస్తే ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాల్గవ భారతీయ మహిళగా సాక్షి మాలిక్ చరిత్ర సృష్టించింది.

కరణం మల్లీశ్వరి (సిడ్నీ 2000 ఒలింపిక్స్‌, వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం), మేరీ కోమ్ (2012 లండన్ ఒలింపిక్స్‌, బాక్సింగ్‌లో కాంస్య పతకం), సైనా నెహ్వాల్ (2012 లండన్ ఒలింపిక్స్, బ్యాట్మింటన్‌లో కాంస్య పతకం) సాధించారు.

పన్నెండేళ్ల కష్టానికి ఫలితం: కంటతడి పెట్టిన సాక్షి మాలిక్

ఒలింపిక్స్‌ రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాజిక్ సాధించిన పతకం ఐదోవది కావడం విశేషం. కేడీ జాదావ్ (1952 హెల్సంకీ, కాంస్య పతకం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్‌లో కాంస్య పతకం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం), యోగీశ్వర్ దత్ (2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం) పతకాలను సాధించారు.

పతకం సాధించిన అనంతరం
పతకం సాధించిన అనంతరం సాక్షి మాలిక్ మాట్లాడుతూ తాను భారత్ కు ఒలింపిక్స్ తొలి పతకం అందించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఏదో ఒక పతకం సాధిస్తాననే నమ్మకం తనకు ఉండేదని చెప్పింది. భారత్ కు పతకాలు రాకపోవడంపై కొంత బాధపడ్డానని, అది తన వల్లే తీరడంతో ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది.

India's history-maker at Rio Olympics 2016: Who is Sakshi Malik?

మరికొంతమంది క్రీడాకారులు కూడా భారత్ కు పతకాలను అందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కాగా, సాక్షి కాంస్యం సాధించిన మరుక్షణం నుంచే ఆమె ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. పటాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ కుటుంబసభ్యులు సంతోషాన్ని పంచుకున్నారు. భారత్‌కు సాక్షి తొలి పతకం అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

సాక్షి గురించి:
* జననం - సెప్టెంబర్ 3, 1992. రౌహ్‌తక్, హర్యానా
* ఎత్తు - 5 అడుగుల 3 ఇంచెలు
* ఫ్రీస్టయిల్ రెజ్లింగ్
* 2002లో కెరీర్ ప్రారంభం
* బ్రెజిల్‌లోని రియో ఒలింపిక్స్‌కు ప్రవేశం
* రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఈ ఏడాది మేలో ఇస్తాంబుల్‌లో జరిగిన ఒలింపిక్ వరల్డ్ టోర్నమెంట్‌లో విజయం సాధించి అర్హత సాధించింది. వినేష్ ఫోగాట్ తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో మహిళ సాక్షి మాలిక్.

సాక్షి సాధించిన విజయాలు:
* రియో ఒలింపిక్స్ 2016లో కాంస్య పతకం
* 2015 ఆసియా రెజ్లింగ్‌ పోటీల్లో కాంస్యం
* 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం
* 2014 డేవ్‌ షుల్జ్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో స్వర్ణం
* 2010 జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌

English summary
India's Sakshi Malik wrestled her way into history books as she claimed a bronze medal at Rio Olympics 2016 here on Wednesday (August 17).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X