వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరాట్ కోహ్లీ దండం: ఎవరీ సర్ఫరాజ్ ఖాన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐపియల్ సీజన్‌లో ఒక్కసారిగా సర్పరాజ్ ఖాన్ అనే కుర్రాడు తెరపైకి వచ్చాడు. బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో దండం పెట్టించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచులో సర్ఫరాజ్ ఖాన్ అనే కుర్రాడు అదరగొట్టాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన బొద్దు కుర్రాడు సర్ఫరాజ్ జట్టును ఆదుకోవడమే కాదు, అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటికీ దాని గురించి మాట్లాడుకునేట్లు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేయడానికి అతనే మూలకారకుడయ్యాడు.

మాజీ క్రికెటర్ల నుంచి వ్యాఖ్యాతల వరకు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. అతన్ని ఒక్కొక్కరు ఒక్కో తీరులో కొనియాడారు. ఒకరు పాకిస్తాన్ వెటరన్ జావెద్ మియాందాద్‌తో పోలిస్తే, మరొకరు శ్రీలంక వెటరన్ రణతుంగతో, ఇంకొకరు అరవింద డిసిల్వాతో పోల్చారు.

IPL 8: Who is sarfraz Khan?

వారం రోజుల క్రితం ఐపియల్‌లో అడుగు పెట్టిన అతి చిన్న వయస్కుడిగా (17 ఏళ్ల 177 రోజులు) సర్ఫరాజ్ రికార్డు దక్కించుకున్నాడు. 2009లో ప్రసిద్ధమైన ముంబై స్కూల్ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌లో 439 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించాడు. దాంతోనే అతను వెలుగులోకి వచ్చాడు.

ఆ తర్వాత ముంబై అండర్ - 19 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అనంతరం కొద్ది రోజులకే భారత్ అండర్ - 19 జట్టుకు ఎంపికయ్యాడు. 15 ఏళ్ల వయస్సులో దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో 101 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత అండర్ - 19 ప్రపంచ కప్ కూడా ఆడాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీని కూడా నిరుడు ఆడాడు. వయస్సు గురించి మధ్యలో కాస్తా వివాదం చెలరేగినా సర్ఫరాజ్ ఖాన్ వెనకడుగు వేయలేదు.

సర్ఫరాజ్ ఖాన్‌ను బెంగుళూర్ ఫ్రాంచైజ్ 50 లక్షల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసుకుంది. ప్రస్తుత టోర్నమెంటులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్పతో అతను కాస్తా గొడవ కూడా పడ్డాడు.సర్ఫరాజ్‌ది మధ్య తరగతి కుటుంబం. అతని తండ్రి నౌషద్‌ క్రికెట్‌ కోచ్‌. అతని ఫ్యామిలీ ముంబైలోని కుర్లాలో నివాసం ఉంటోంది. ప్రతి రోజు నౌషద్‌ తన ఇద్దరు కొడుకులు సర్ఫరాజ్‌, ముషీర్‌లను కుర్లా నుంచి మోటార్‌ సైకిల్‌పై అజాద్‌ మైదాన్‌కు ప్రాక్టీస్‌ సెషన్‌కు తీసుకొచ్చేవాడు. రెండు క్రికెట్‌ కిట్లతో అతను ప్రమాదకరమైన ప్రయాణం చేసేవాడు. కాగా 2010లో రోడ్డు ప్రమాదం జరగ్గా నౌషద్‌ కుడిచెయ్యికి, మోకాళ్లకు బలమైన గాయాలయ్యాయి.

తండ్రికి కారు: వేలంలో వచ్చిన డబ్బుతో తన తండ్రికి కారును బహుమతిగా అందించాలనే ఆలోచనలో సర్ఫరాజ్‌ ఉన్నాడు. దీంతో తన తండ్రికి కొంతైనా కష్టం తీరుతుందేమోనని అన్నాడు.

English summary
On Wednesday night, at the M Chinnaswamy Stadium, a 17-year-old batting talent emerged in the Indian Premier League 2015 (IPL 8).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X