• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐటీ జీవులకు మరో గండం: వచ్చే ఆర్నెళ్లు సంక్లిష్టం.. సర్వేలో తేలిన నిజాలు!

|
  ఐటీ జీవులకు మరో గండం: వచ్చే ఆర్నెళ్లు సంక్లిష్టం.. సర్వేలో తేలిన నిజాలు! | Oneindia Telugu

  న్యూఢిల్లీ: గత వైభవాన్ని కోల్పోయిన ఐటీకి భవిష్యత్తులోను గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. ఎక్స్‌పెరిస్‌ ఐటి, మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వేలో మున్ముందు ఐటీ రంగం మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు తేలడం గమనార్హం.

  ఐటీ ఉద్యోగులకు కష్టకాలం: డిమాండ్ కొత్త టెక్నాలజీకే.. నేర్చుకోవాలంటే లక్షల్లో ఫీజులు

  ఆటోమేషన్‌, డిజిటైజేషన్‌ ప్రభావం వల్ల సాంప్రదాయిక ఉద్యోగాలకు భవిష్యత్తు అవకాశాలు కష్టమేనని సర్వే చెబుతోంది. భారత ఐటి కంపెనీల్లో వచ్చే రెండు త్రైమాసికాల్లోనూ ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఈసారి భారీగా ఉద్యోగాల కోత తప్పదని హెచ్చరిస్తోంది.

  ఐటీకి ఏమైంది?: కెరీర్‌పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..

   కొత్త ఉద్యోగాలు కష్టమే:

  కొత్త ఉద్యోగాలు కష్టమే:

  2017 అక్టోబరు నుంచి 2018 మార్చి వ్యవధిలో కొత్త ఉద్యోగాల కల్పన తీవ్రంగా మందగిస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఉన్న ఉద్యోగుల్లోనే ప్రతిభావంతమైన, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఐటీ పరిశ్రమ సద్దుబాటు చేసుకుంటోందని పేర్కొంది.

   కనివిని ఎరుగుని రీతిలో లేఆఫ్‌లు:

  కనివిని ఎరుగుని రీతిలో లేఆఫ్‌లు:

  సీనియర్ స్థాయి ఉద్యోగులను లేఆఫ్ ల ద్వారా సాగనంపి, జూనియర్, మధ్య స్థాయిలో కొత్త నియమాకాలను చేపట్టే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. దేశంలోని అగ్రగామి ఐటి కంపెనీలన్నింటిలోను ఇంతకుముందెన్నడూ లేని రీతిలో.. కనివినీ ఎరుగని స్థాయిలో లేఆఫ్ లు ఉండవచ్చునని తెలిపింది. వచ్చే 6 నుంచి 12 నెలల కాలం కొత్త నియామకాలు మరింతగా క్షీణిస్తాయని తెలిపింది.

   వీటికే డిమాండ్:

  వీటికే డిమాండ్:

  వేగంగా మారుతున్న టెక్నాలజీని ఎవరైతే అందిపుచ్చుకోగలుగుతారో.. భవిష్యత్తులో వారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని సర్వే తెలిపింది. కాబట్టి వచ్చే 12 నెలల కాలంలో ఐటి రంగంలోని నిపుణులందరూ డిమాండు అధికంగా ఉన్న కొత్త టెక్నాలజీలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించింది.

  సర్వీసుగా సాఫ్ట్‌వేర్‌ (సాస్‌), క్లౌడ్‌, ఇఆర్‌పి సాఫ్ట్‌వేర్‌, కృత్రిమ మేదస్సు వంటి విభాగాల్లో ఐటీ ఉద్యోగులకు మంచి అవకాశాలున్నాయని ఎక్స్‌పెరిస్‌ ప్రెసిడెంట్‌ మన్‌మీత్‌ సింగ్‌ తెలిపారు. అమిత వేగం, నూరు శాతం విశ్వసనీయత, తక్కువ ధరలకు అందుబాటులో ఉండే టెక్నాలజీకే భవిష్యత్తు అని ఆయన అన్నారు.

   స్కిల్స్ పెంచుకుంటేనే:

  స్కిల్స్ పెంచుకుంటేనే:

  ఐటి రంగంలో క్రమంగా వస్తున్న మార్పులు.. దాని తాలుకు సాంకేతిక పరిజ్ఞానాలు సంక్లిష్టంగా ఉంటాయంటున్నారు మన్‌మీత్‌ సింగ్‌. తమ ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే యంగ్ ప్రొఫెషనల్స్ కు ఇవి మంచి అవకాశాలను కల్పిస్తాయన్నారు.

  ఐటి రంగంలో స్థూలంగా నియామకాల వాతావరణం సానుకూలంగానే ఉన్నప్పటికీ.. నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం, కొత్త నైపుణ్యాలను నేర్పించడం పైనే ఆ రంగంలోని సంస్థలు దృష్టి పెడతాయని ఆయన అన్నారు.

  సుశిక్షితులకే అవకాశాలు:

  సుశిక్షితులకే అవకాశాలు:

  చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే ఆలోచనలో లేవన్నారు మన్‌మీత్‌ సింగ్‌. సుశిక్షితులైన కొత్త వారినే కంపెనీలు ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. సమయం, ఖర్చు రీత్యా పాత ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించే రిస్క్ ను కంపెనీలు ఎదుర్కొవడానికి సిద్దంగా లేవన్నారు.

  ట్రైనింగ్ పీరియడ్ తగ్గించడం కోసం ప్రొబేషన్‌ కాలపరిమితిని ముందుకు జరపడం కూడా ఐటి రంగంలో కొత్త సాంప్రదాయం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

  English summary
  If you are looking for a technology job, this may not be the best of times. Fewer information technology (IT) companies are looking to hire in the next six months, results of a survey showed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X