హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరికృష్ణతో జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ వ్యాఖ్య, అదే నిజమైతే నిరాశే!

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం జై లవకుశ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

జూ ఎన్టీఆర్ పొలిటికల్ యాంగిల్ : హరికృష్ణతో జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ వ్యాఖ్య, అదే నిజమైతే నిరాశే!|Oneindia

హైదరాబాద్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం జై లవకుశ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాన్నా ఇంకో జన్మంటూ ఉంటే మీ రుణం తీర్చుకుంటాను... ఈ జన్మలో మాత్రం అభిమానులతో ఉండిపోతాను అని ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు.

కూతురు కోసం లండన్‌కు జగన్: బాధ్యతలు సాయికి, నేతల్లో ఆందోళనకూతురు కోసం లండన్‌కు జగన్: బాధ్యతలు సాయికి, నేతల్లో ఆందోళన

ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబరు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జూ ఎన్టీఆర్ భావోద్వేగం

జూ ఎన్టీఆర్ భావోద్వేగం

ఆదివారం ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా సినిమా ట్రయలర్ విడుదల చేశారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'నాన్నా.. ఈ జన్మకు అభిమానులతో ఉండిపోతాను. మరో జన్మలో మీ రుణం తీర్చుకుంటాను' అని హరికృష్ణను ఉద్దేశించి అన్నారు.

మరో జన్మలో నాన్న రుణం తీర్చుకుంటాను అంటే..

మరో జన్మలో నాన్న రుణం తీర్చుకుంటాను అంటే..

నేను మరో జన్మ ఉంటే తన తండ్రి రుణం తీర్చుకుంటానని జూ ఎన్టీఆర్ చెప్పడం ఆసక్తిని రేపుతోందని అంటున్నారు. ఆందులో కొందరు పొలిటికలా యాంగిల్ కూడా చూస్తున్నారు. చంద్రబాబు తర్వాత టిడిపిని తమ వారసులు నడపాలని హరికృష్ణ ఆశించారు. లోకేష్ - జూఎన్టీఆర్ మధ్య వారసత్వ పోరు కూడా నడిచింది. కానీ ఆ తర్వాత నుంచి జూనియర్ టిడిపికి దూరంగా ఉంటున్నారు.

అంటే రాజకీయాలకు జూనియర్ దూరమేనా, చెప్పకనే చెప్పారా?

అంటే రాజకీయాలకు జూనియర్ దూరమేనా, చెప్పకనే చెప్పారా?

మరో జన్మలో తన తండ్రి హరికృష్ణ రుణం తీర్చుకుంటానని చెప్పారు. హరికృష్ణ ఆశించేది.. ఎన్టీఆర్ వారసులు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పగ్గాలు చేపట్టాలని అనుకున్నారు. తండ్రి రుణం అన్న జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉండి ఉండవచ్చునని అంటున్నారు. తద్వారా ఇక తాను రాజకీయాలకు దూరం అని చెప్పకనే చెప్పారా అనే చర్చ సాగుతోంది.

ఎన్టీఆర్ ఇలా...

ఎన్టీఆర్ ఇలా...

'అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో మీ అందరి ప్రేమ, ఆప్యాయత దక్కింది. మీ అభిమానం దక్కింది. మీ అందరి ముఖంగా మా అమ్మానాన్నలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రుల ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న.. ఇంకో జన్మంటూ ఉంటే మీ ఋణం తీర్చుకుంటాను. ఈ జన్మలో మాత్రం వీళ్ళతో ఉండిపోతాను నాన్న. మీ అందరి రూపంలో నాకు ఇంత గొప్ప కుటుంబం దొరికింది. రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే నాకు ముఖ్యం. మంచి చిత్రాలు తీసి మీ ఋణం తీర్చుకుంటా.' అని ఎన్టీఆర్ అన్నారు.

సినిమాలకే పరిమితం అని చెప్పారా?

సినిమాలకే పరిమితం అని చెప్పారా?

ఈ జన్మలో అభిమానులతో ఉంటానని చెప్పడం ద్వారా తాను సినిమాలకే పరిమితం అని జూనియర్ చూచాయగా చెప్పారని అంటున్నారు. ఇప్పటికే టిడిపికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక రాజకీయాలకు కూడా దూరంగానే ఉండవచ్చునని భావిస్తున్నారు.

అదే నిజమైతే నిరాశ!

అదే నిజమైతే నిరాశ!

జూ. ఎన్టీఆర్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తారని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ కొంతమంది ఆయన రాజకీయాల్లోకి వస్తారనుకుంటున్నారు. ఇప్పుడు జూ. ఎన్టీఆర్ ఆ వ్యాఖ్యలు పొలిటికల్ కోణంలోనే అని ఉంటే మాత్రం అది చాలామందికి నిరాశే అంటున్నారు. ఇప్పుడు కాకపోయినా ముందు ముందు జూనియర్‌తో చంద్రబాబు కుటుంబానికి చెక్ చెప్పాలనుకున్న వారికి కూడా నిరాశే అంటున్నారు.

English summary
After releasing three teasers introducing all three characters played by Tollywood star Jr NTR, the filmmakers on Sunday unveiled the first extensive theatrical trailer of the much-awaited Jai Lava Kusa. If the trailer is anything to go by, the forthcoming drama looks to be made with a sole purpose of setting the box office on fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X