వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసులో ఆ మైనర్ నిందితుడు ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నాడంటే?

శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఆరుగురిలో నలుగురికి మరణశిక్ష అమలు కానుంది. ఈ కేసులో రామ్ సింగ్ జైలులోనే ఆత్మహత్య చేసుకోగా,

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఆరుగురిలో నలుగురికి మరణశిక్ష అమలు కానుంది. ఈ కేసులో రామ్ సింగ్ జైలులోనే ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. కాగా, ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని చాలా మందికి తెలియకపోచ్చు.

పూర్వపరాలు: నిర్భయపై ఆరోజు రాత్రి ఘోరం జరిగిందిలా..పూర్వపరాలు: నిర్భయపై ఆరోజు రాత్రి ఘోరం జరిగిందిలా..

వంటగాడిగా..

వంటగాడిగా..

ఆ మైనర్ నిందితుడికి ఇప్పుడు 23 ఏళ్ల వయసు. తన సొంత ప్రాంతానికి దూరంగా.. దక్షిణాదిన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియకుండా ఒక దాబాలో వంటవాడిగా పని చేసుకుంటున్నాడు. సాధారణంగా ఈ తీర్పు రాగానే మరోసారి టీవీ ఛానళ్ల కళ్లన్నీ అతడిమీదే పడతాయి కాబట్టి, అతడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ చెప్పడం లేదు.

రహస్యంగానే..

రహస్యంగానే..

చివరకు అతడు పనిచేసే దాబా యజమానికి కూడా అతడు ఫలానా అని తెలియదు. ఆ బాల నేరస్తుడి పునరావాసం బాధ్యతలు చూస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మాత్రమే ఈ విషయాలన్నీ తెలుసు తప్ప.. వేరెవ్వరికీ అతడెవరో కూడా తెలిసే అవకాశం ఏమాత్రం లేదు.

బాధ్యత తీసుకున్న స్వచ్ఛంద సంస్థ..

బాధ్యత తీసుకున్న స్వచ్ఛంద సంస్థ..

జైలు నుంచి విడుదలైన ఏడాది తర్వాత అతడిని దక్షిణాదిన ఒక దాబాలో వంటవాడిగా చేర్చినట్లు మాత్రం తెలిపారు.కాగా, 2015 డిసెంబర్ 20వ తేదీన అతడు విడుదలయ్యాడు. కొన్నాళ్ల పాటు ఒక స్వచ్ఛంద సంస్థ వద్ద ఉన్నాడు. ఆ తర్వాత వంటవాడిగా వచ్చేశాడు.

11ఏళ్ల వయస్సులోనే ఇంట్లోంచి..

11ఏళ్ల వయస్సులోనే ఇంట్లోంచి..

ఢిల్లీకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి నుంచి 11 ఏళ్ల వయసులో అతడు పారిపోయి వచ్చేశాడు. అతడి తల్లి, తండ్రి ఇద్దరూ అనారోగ్యంతో మంచం పట్టగా, మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులను అతడి అక్కే పోషిస్తోంది. అతడు ఢిల్లీ వచ్చిన తర్వాత నిర్భయ కేసులో మరో నిందితుడైన రామ్‌సింగ్‌ పంచన చేరాడు. అతడి దగ్గర బస్సు క్లీనర్‌ పనిలో కుదురుకున్నాడు.

భక్తి మార్గం వైపు..

భక్తి మార్గం వైపు..

బోస్టన్ స్కూల్లో ఉన్నప్పుడు అతడు చాలా క్రమశిక్షణతో ఉండేవాడని అంటున్నారు. అక్కడినుంచి బయటకు వచ్చిన తర్వాత భక్తిమార్గంలోకి వెళ్లిపోయాడు. గెడ్డం పెంచుకుని రోజుకు 5 సార్లు నమాజ్ చేసేవాడు. మొదట్లో అతడిని ఒంటరిగా ఉంచేవారు. కానీ, తర్వాత హైకోర్టు పేలుడు కేసు నిందితుడితో కలిసి ఒక డార్మిటరీలో ఉంచారు.

దాబాలోనే..

దాబాలోనే..

వంట అంటే అతడికి చాలా ఇష్టం. దీంతో అక్కడ సిబ్బంది చేసే వంటల్లో కూడా సాయం చేసేవాడు. తరచూ మిగిలిన వాళ్లు కూడా అతడి వంటల కోసం అడిగేవారట. బయటకు వచ్చిన తర్వాత కూడా తనకు వచ్చిన వంట పనిలోనే కుదురుకున్నాడు. ప్రస్తుతం ఆ దాబాలోనే తన జీవితాన్ని గడుపుతున్నాడు.

నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ బ్యూరో

నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ బ్యూరో

అయితే, పాత నేరచరిత్ర దృష్ట్యా ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రం అతడి మీద ఓ కన్నేసి ఉంచింది. 2012, డిసెంబర్ 16న నిర్భయ స్నేహితుడిపై దాడి చేసి, ఆ తర్వాత నిర్భయను కదులుతున్న బస్సులోనే ఆరుగురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను రాడ్లతో కొట్టి, శరీరంలోకి దూర్చి చిత్రహింసలకు గురిచేశారు. కాగా, శుక్రవారం నిర్భయ కేసులో నలుగురు నిందితులకు సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

English summary
Away from the limelight on the verdict in the December 16 gang-rape and murder, the ‘juvenile’ convicted in the case, who was found guilty of raping and killing the 23-year-old physiotherapist on December 16, 2012 — has settled well in his new life. He is cooking at a prominent restaurant. The minor has turned 23 years old now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X