• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆన్‌లైన్‌లో కెసిఆర్ హవా: అమీర్, షా, నాదెళ్ల వెనక్కి

|

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆన్‌లైన్‌లో మరో రికార్డు సాధన దిశగా దూసుకుపోతున్నారు. ఇటీవలే గత దశాబ్దంలో గూగుల్‌సెర్చ్‌లో అత్యధికులు అన్వేషించిన నాయకుడుగా ఎంపికైన కెసిఆర్ తాజాగా సీఎన్‌ఎన్-ఐబీఎన్ చేపట్టిన ఇండియన్ ఆఫ్‌ది ఇయర్-2014 కంటెస్ట్‌లో శుక్రవారం సాయంత్రం నాటికి 24 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు.

ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఓటు వేసే అవకాశం ఉన్న ఈ పోటీలో కేసీఆర్ చాలా వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మొదటి స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారి విజయన్‌ను సైతం వెనుకకు నెట్టి కేసీఆర్ ప్రథమ స్థానానికి చేరుకున్నారు.

14 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమనేతగా దేశప్రజలందరికీ సుపరిచితుడయ్యారు కెసిఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు కూడా దేశంలో చర్చనీయాంశాలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎన్‌ఎన్-ఐబీఎన్ కేసీఆర్‌ను 2014లో ప్రముఖ భారతీయుడు పోటీకి ఎంపిక చేసింది. రాజకీయం, క్రీడలు, వినోదరంగం, విజ్ఞానరంగం తదితర అనేక రంగాలనుంచి 35 ప్రముఖులను ఎంపిక చేసి వారిలో నచ్చినవారికి ఓటు ఇచ్చే అవకాశం నెటిజన్లకు కల్పించింది.

KCR ahead of Aamir, Shah for ‘Indian of the Year’ award

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పశ్చిమ బెంగాల్ సిఎం మమత, ఒరిస్సా సిఎం నవీన్ పట్నాయక్ వంటి రాజకీయ ఉద్దండులతో పాటు సినీ ప్రముఖులు అమీర్‌ఖాన్, సల్మాన్, షారూక్ వంటి వారినీ, మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల తోపాటు చేతన్ భగత్, చందా కొచ్చర్, సానియా మీర్జా వంటి వివిధ రంగాల ప్రముఖులు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. కాగా, వారందర్నీ వెనక్కినెట్టిన కెసిఆర్ అగ్రస్థానంలో ఉన్నారు.

ఇండియన్ ఆఫ్‌ది ఇయర్ -2014 పోటీలో కేసీఆర్ 24శాతం ఓట్లతో అందరి కంటే ముందు వరుసలో నిలిచారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మొదటి స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారి విజయన్‌ను వెనక్కి నెట్టి శుక్రవారం సాయంత్రానికి కెసిఆర్ ప్రథమ స్థానానికి చేరుకున్నారు.

కాగా, ప్రస్తుతం విజయన్ 20శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలువగా, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కేవలం 8 శాతం ఓట్లతో మూడవ స్థానంలో, కాశ్మీర్ వరదల సందర్భంగా సహాయక చర్యల్లో అత్యంత తెగువను చూపిన ఇండియన్ ఆర్మీ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం 6శాతం ఓట్లతో నాలుగవ స్థానంలో, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 5శాతం ఓట్లతో ఐదవ స్థానంలో నిలిచారు.

http://www.indianoftheyear.com/vote.php లేదా www.facebook.com/indianoftheyear ద్వారా ఈ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్‌ది ఇయర్ పోటీ చేపట్టడం ఇది తొమ్మిదోసారి. ఈ పోటీ జనవరి నెలాఖరుతో ముగుస్తుంది. అవార్డుల ప్రదానోత్సవం నెలాఖరులోనే నిర్వహిస్తారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guess who is in serious reckoning for the “Indian of the Year - 2014” award annually given away by a national television channel? It’s Telangana chief minister K Chandrasekhar Rao, who has sprung a major surprise by leading over big names like Bollywood star Aamir Khan, BJP national president Amith Shah and Microsoft CEO Satya Nadella.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more