వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ ‘పెద్ద’ తప్పులు: విమర్శలు, తలలు పట్టుకుంటున్నారు!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవగాహన లేకుండా ట్విట్టర్‌‌లో పెట్టిన రెండు పోస్టులు ఆయనపై విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా గళమెత్తిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన వాదనను సమర్థించుకునేందుకు అత్యుత్సాహంతో తప్పుటడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సరైన అవగాహన లేకుండా తనకు తెలియకుండానే తప్పులు చేస్తున్నారు. ఆయన చేసిన రెండు పెద్ద తప్పులు ఆయన ఏ స్థితిలో ఉన్నారో చెప్పకనే చెబుతున్నాయని బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

కాగా, ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ చేసిన తప్పులతో.. ఆయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌కు కార‌ణం ఆయ‌న ట్విట్ట‌ర్‌లో రీట్వీట్ చేసిన రెండు ఫొటోలు. అందులో ఒక‌టి నోట్ల ర‌ద్దుకు సంబంధించిన‌ది కాగా, మ‌రోటి రైలు ప్ర‌మాదానికి సంబంధించిన‌ది. ఈ రెండూ త‌ప్పుడు వార్త‌ల‌ని ఆల‌స్యంగా గుర్తించిన ముఖ్య‌మంత్రి త‌ర్వాత ట్విట్ల‌ర్ నుంచి వాటిని తొల‌గించారు.

kejriwal sinks new low shows picture dead robber claims him innocent

ఆదివారం కేజ్రీవాల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఉరివేసుకున్న ఓ వ్య‌క్తి పొటోను పోస్టు చేశారు. డబ్బులు మార్చుకునేందుకు నాలుగు రోజుల పాటు క్యూలో నిల్చున్నా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆయ‌న ఉరివేసుకున్నాడ‌ని, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని స‌త్నాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని అందులో రాశారు. అయితే అది త‌ప్పుడు వార్త అని తేల‌డంతో త‌ర్వాత ఆ పోస్టును కేజ్రీవాల్ తొల‌గించారు.

సీఎం పేర్కొన్న‌ట్టు ఉరివేసుకున్న వ్య‌క్తి స‌త్నాకు చెందిన వాడే అయినా ఆయ‌న డ‌బ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు రాలేదు. బ్యాంకును దోచుకునేందుకు వ‌చ్చాడు. పోలీసులు చుట్టుముట్ట‌డంతో త‌ప్పించుకునే మార్గంలేక బ్యాంకులో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అస‌లు విష‌యం తెలిసిన కేజ్రీవాల్ నాలుక క‌రుచుకుని వెంట‌నే ఆ ఫొటోను తొల‌గించారు.

ఆ త‌ర్వాత మ‌రో ఫొటో పోస్టు చేశారు. న‌లుగురైదుగురు చిన్నారుల ఫొటోను పోస్టు చేసి వారు రైలు ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారంటూ పోస్టు చేశారు. అయితే ఇదికూడా త‌ప్పుడు ఫొటోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న పోస్టు చేసిన ఫొటోలోని పిల్ల‌లు సిరియా శ‌ర‌ణార్థుల కుటుంబాల‌కు చెందిన వారు.

ఇలా ముందుగా నిర్ధారించుకోకుండానే ఓ ముఖ్య‌మంత్రి ఇలా త‌ప్పుదోవ ప‌ట్టించేలా ట్వీట్లు చేయ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌ప్పు తెలుసుకుని ట్వీట్లు తొల‌గించిన కేజ్రీవాల్ ఎందుకు తొల‌గించిందీ వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

English summary
Delhi CM Arvind Kejriwal is desperate to prove that Narendra Modi’s demonetisation drive is causing widespread death and destruction in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X