హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌ని దాటిన కేటీఆర్, బాబు కంటే జగనే ఎక్కువ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సెర్చింజన్ గూగుల్‌లో నెటిజన్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటే ఆయన తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావునే ఎక్కువగా వెతుకుతున్నారు! కేటీఆర్ గురించి వెతికే వారి శాతం చాలా బాగా పెరిగిందని గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి.

కేటీఆర్ గురించి వెతికే వాటిల్లో.. కేటీఆర్, కేటీఆర్ తెలంగాణ, కేటీఆర్ మంత్రి, కేటీఆర్ హైదరాబాద్ తదితరాలు టాప్‌లో ఉన్నాయి. నెటిజన్లు సెర్చే చేసే వారిలో ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ దాటేశారు. చంద్రబాబును దాటేసిన లెవల్లో కేసీఆర్ గురించి వెతకడంలో వేగం కనిపించడం లేదంటున్నారు.

ktr-cbn-jagan

కేసీఆర్ గురించి ఎక్కువగా... 'కేసీఆర్' పేరుతోనే వెతుకుతున్నారు. కేసీఆర్ పాపులారిటీ 2009 డిసెంబర్ నుంచి బాగా పెరిగింది. నాడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేయడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం తెలిసిందే. అప్పటి నుంచి కేసీఆర్ పాపులారిటీ (సెర్చింజన్‌లో) బాగా పెరిగింది.

విభజన కోసం ఇచ్చిన అపాయింటెడ్ డే జూన్ 2, 2014న నెటిజన్లు కేసీఆర్ కోసం బాగా వెతికారు. కేవలం ఆ రోజే కాకుండా ఆ సమయంలోన బాగా వెతికారు. ఆ తర్వాత నుంచి క్రమంగా కెసిఆర్ గురించి వెతకడం తగ్గింది. అదే సమయంలో తనయుడు కేటీఆర్ గురించి వెతకడం క్రమంగా పెరుగుతోంది.

మరో విషయమేమంటే.. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసిపి అధినేత జగన్ గురించి వెతకడం క్రమంగా తగ్గుతోంది. అంతేకాదు, పదేపదే దీక్షలు, ఉద్యమాలు చేస్తున్నారు. అవి కూడా అంతగా సెర్చ్‌లో కనిపించడం లేదంట.

బెంగళూరలో జగన్‌కు చెందిన భవంతి గురించి బాగా వెతికారు. అవినీతి ఆరోపణలు చేస్తూ టిడిపి దానిని బాగా హైలెట్ చేసిన విషయం తెలిసిందే. దీని కోసం నెటడిజన్లు బాగా వెతికారు.

ఇక, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి 2014 జున్ నెలలో బాగా వెతికారు. జూన్ 8న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 2 నుంచి ప్రమాణ స్వీకారం వరకు ఆయనను వెతికే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2015లో అమరావతికి భూమి పూజ చేశారు. అప్పుడు కూడా వెతికారు.

అయితే, ఆ తర్వాత చంద్రబాబు గురించి నెటిజన్ల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. మరో ఆసక్తికర విషయమేమంటే జగన్ గురించి గుంటూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరులలో నెటిజన్లు బాగా వెతుకుతున్నారు.

చంద్రబాబు గురించి తిరుపతిలో బాగా వెతుకుతున్నారు. గుంటూరు, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, విశాఖలలో కూడా నెటిజన్లు వెతుకుతున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర నుంచి జగన్‌ను వెతికే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

హైదరాబాద్ సహా తెలంగాణలో చంద్రబాబు ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి నెటిజన్లు చంద్రబాబును అంతగా వెతకడం లేదు. అయితే, వైసిపి అధినేత జగన్ ఈ విషయంలో చంద్రబాబు కంటే బెటర్. తెలంగాణ ట్రెండ్స్ చూస్తుంటే బాబు కంటే జగన్‌నే ఎక్కువగా వెతుకుతున్నారు.

English summary
Going by the times he has been searched by netizens on the popular search engine Google, K.T. Rama Rao is more popular than his Chief Minister father K. Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X