హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజమే, కానీ: రేవంత్‌రెడ్డిని సమర్థించిన మంత్రి కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే, ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏకీభవిస్తున్నారు. హైదరాబాద్ మేయర్ ఎన్నిక పైన రేవంత్ వ్యాఖ్యలను కెటిఆర్ సమర్థించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి దమ్ముంటే గ్రేటర్ హైదరాబాదులో మేయర్ ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ... మేయర్ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించే సత్తా ఉందా అని సవాల్ చేశారు.

దీనిపై మంత్రి కెటిఆర్ స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి నేరుగా ఎన్నికలు నిర్వహించాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని చెప్పారు. అయితే, అంతిమ నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని చెప్పారు.

KTR welcomes Revanth Reddy's comments

కాగా, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై పార్టీలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్, టిడిపిలు... కెసిఆర్ పరిపాలనలో విఫలమయ్యారని, ప్రభుత్వం ఏం చేయడం లేదని, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా సీమాంధ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇక అధికార తెరాస... కాంగ్రెస్ పార్టీ పదేళ్లు ఉండి ఏం చేయలేదని, ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా ఇంకా హైదరాబాద్‌లో పర్యటించలేదని, తెలంగాణకు ప్యాకేజీ తెచ్చాక బిజెపి నేతలు మాట్లాడాలని చెబుతోంది. టిడిపిని తెరాస లెక్కలోకి తీసుకున్నట్లుగానే కనిపించడం లేదు.

ఇదిలా ఉండగా, గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి - బిజెపి పొత్తుతోనే ముందుకు వెళ్లనుంది. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి దాని విషయమై స్పష్టత ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందని తెలిపారు.

English summary
Telangana IT Minister KT Rama Rao welcomes TDP MLA Revanth Reddy's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X