• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ మూడు వెంటే: దటీజ్ మల్లి మస్తాన్ బాబు(పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: ప్రముఖ పర్వాతారోహకుడు మల్లి మస్తాన్ బాబు నిత్యం తన వెంట భారత త్రివర్ణ పతాకం, భగవద్గీత, రుద్రాక్షమాలను ఉంచుకునేవారు. పర్వతారోహన అనంతరం ఆ మూడింటిని పర్వత శిఖరాల పైన ఉంచేవారు. పర్వతారోహణకు ఎప్పుడు వెళ్లినా ఈ మూడు మల్లి మస్తాన్ బాబు వెంట కచ్చితంగా ఉండేవి.

ప్రతి పర్వతం పైన భారత్ మూడు రంగుల జెండా, భగవద్గీత, రుద్రాక్షమాల ఉండాలనేది మల్లి కోరికగా ఉండేది. పర్వతారోహణ చేసినప్పుడు... తన సంతకంతో కూడిన ఈ మూడింటిని ఉంచేవారు. ఇవి తప్ప, తన ఫోటో లేదా తన కుటుంబ సభ్యుల ఫోటో ఉంచేవారు కాదు.

భగవద్గీతను ఎన్నోసార్లు చదివిన మల్లి మస్తాన్ బాబు దానికి అనుగుణంగానే జీవితాన్ని కొనసాగించారు. భగవద్గీత అతనికి గురువు. పర్వాతారోహణ సమయాల్లో అలసిపోతే గీతను పఠించేవారు. రుద్రాక్షణాలతో జపం చేసేవారు. చావు గురించి భయపడేవారు కాదు.

మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

ప్రముఖ పర్వాతారోహకుడు మల్లి మస్తాన్ బాబు అంతిమ యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అతడి స్వగ్రామం గాంధీ జనసంగంలో ప్రారంభమైంది.

మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

ఈ అంతిమ యాత్రకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు నారాయణ, పల్లె రఘనాథ రెడ్డి, రావెల కిశోర్ బాబు, జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

మస్తాన్ బాబు భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో గాంధీజనసంగం గ్రామం జనసంద్రమైంది.

మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

గాంధీ జనసంగంలోని మస్తాన్ బాబుకు చెందిన పొలంలోనే ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు.

మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పర్వతారోహణలో మస్తాన్ బాబు చరిత్ర సృష్టించారని, ఆయన కీర్తి ఎవరెస్టు శిఖరాన్ని చాటిందన్నారు.

 మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

మస్తాన్ బాబును సజీవంగా తీసుకురాలేకపోయామని విచారణ వ్యక్తం చేశారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ కోరిక మేరకు ఆఖరి చూపుకైనా మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ, సుష్మస్వరాజ్ చొరవతో అర్జెంటీనా దౌత్యపరమైన చర్చలు జరిపి మృతదేహాన్ని తీసుకొచ్చామని చెప్పారు.

 మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

మస్తాన్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ తదితరులు నివాళులు అర్పించారు.

మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

ప్రముఖ పర్వాతారోహకుడు మల్లి మస్తాన్ బాబు నిత్యం తన వెంట భారత త్రివర్ణ పతాకం, భగవద్గీత, రుద్రాక్షమాలను ఉంచుకునేవారు.

 మల్లి మస్తాన్ బాబు

మల్లి మస్తాన్ బాబు

పర్వతారోహన అనంతరం ఆ మూడింటిని పర్వత శిఖరాల పైన ఉంచేవారు. పర్వతారోహణకు ఎప్పుడు వెళ్లినా ఈ మూడు మల్లి మస్తాన్ బాబు వెంట కచ్చితంగా ఉండేవి.

అతనికి యోగ సాధన, ప్రాణాయామంలో మంచి పట్టు ఉంది. అందుకే పర్వతారోహణ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆకలిదప్పులు ఉండేవి కావని తెలుస్తోంది. హిమాలయాల పర్వతాల నుండి వెలుపలకు రాకుండా 90 రోజుల పాటు ఏకధాటిగా చార్‌ధామ్ యాత్రను పూర్తి చేశారు.

ఇదిలా ఉండగా, మార్చి 23వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఆండీస్ పర్వతాల్లోని పదవ శిఖరాన్ని మల్లి మస్తాన్ బాబు ఎక్కినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలపై గీత, భారత్ జాతీయ జెండా, రుద్రాక్షమాలను ఉంచి గిన్నిస్ రికార్డ్ సాధించారు. తద్వార ఆసియాలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు.

ఆండీస్ పర్వతారోహణ క్రమంలో ఆరువేల మీటర్ల ఎత్తులో మల్లి మస్తాన్ బాబు మృతి చెందగా, శనివారం నాడు ఆయన స్వగ్రామం గాంధీ జనసంఘంలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

English summary
Ace mountaineer Malli Mastan Babu, who died during an expedition in South America, was today buried in his native village Nellore in Andhra Pradesh with state honours as hundreds gathered to pay tributes and bid tearful adieu to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X