వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృత్రిమ ‘సూర్యుడు’ని తయారుచేసిన శాస్త్రవేత్తలు

ఇంతకాలానికి సూర్యుడికి పోటీదారుడు వచ్చేశాడు. బెర్లిన్ శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని రూపొందించారు. అత్యంత శక్తిమంతమైన స్పాట్ లైట్లను ఒక్కచోటుకు తీసుకురావడం ద్వారా దీన్ని సిద్ధం చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెర్లిన్: ఇంతకాలానికి సూర్యుడికి పోటీదారుడు వచ్చేశాడు. బెర్లిన్ శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని రూపొందించారు. అత్యంత శక్తిమంతమైన స్పాట్ లైట్లను ఒక్కచోటుకు తీసుకురావడం ద్వారా దీన్ని సిద్ధం చేశారు.

నిజానికి సూర్యుడు నిత్యం శక్తితో భూమిని ముంచెత్తుతుంటాడు. ఈ శక్తిని గరిష్ట స్థాయిలో ఒడిసిపట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సౌరఫలకాలు ఇంతటి గరిష్ట సామర్థ్యానికి ఇంకా చేరుకోలేదు.

ఈ దిశగా శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలకు శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ సిన్ లైట్ ఎక్స్ పెరిమెంట్ తన తోడ్పాటును అందిస్తుంది. వ్యోమనౌకల్లో ఉపయోగించే ఉష్ణరక్షణ భాగాలను పరీక్షించడానికి కూడా ఈ సిన్ లైట్ ను వినియోగించవచ్చు.

త్వరలోనే ఈ కృత్రిమ సూర్యుడిని శాస్త్రవేత్తలు ఆన్ చేయబోతున్నారు. ఈ కృత్రిమ సూర్యుడికి 'సిన్ లైట్ ఎక్స్ పెరిమెంట్' అని పేరు పెట్టారు. ఇందులో 149 ఫిల్మ్ ప్రొజెక్టర్ స్పాట్ లైట్లను ఉపయోగించారు.

Let there be light: German scientists test 'artificial sun'

ఒక్కో లైట్ సాధారణ విద్యుద్దీపాల కన్నా 4 వేల రెట్లు అధిక వాటేజీని కలిగి ఉంటాయి. భూమిని తాకే సహజసిద్ధమైన సూర్య కాంతి కన్నా 10 వేల రెట్లు అధిక వెలుగును ఇది ఉత్పత్తి చేస్తుంది.

మాడి మసైపోవడమే..

ఈ సిన్ లైట్ లోని దీపాలన్నీ ఒకే బిందువువైపు కేంద్రీకృతమై ఉంటాయి. దీన్ని గనక ఆన్ చేస్తే అది 3500 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో ఈ కృత్రిమ సూర్యుడు ఉన్న చోటికి మనుషులు వెళితే మాడి మసైపోతారు.

ఈ నేపథ్యంలో రేడియోధార్మికత వెలువడకుండా సీల్ చేసిన గదిలో ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రయోగానికి అయ్యే వ్యయం కూడా ఎక్కువే. నలుగురు నివసించే ఒక ఇంటికి ఏడాది పాటు ఖర్చయ్యే విద్యుత్తును ఇది నాలుగు గంటల్లోనే వాడేస్తుంది. అయినా ఇది అందించే అద్భుత ఫలితాల దృష్ట్యా ఈ ఖర్చు ఆమోదయోగ్యమేనని పరిశోధకులు పేర్కొంటున్నారు.

కాలుష్యానికి తావులేని శుద్ధమైన, చౌక ఇంధనాన్ని భవిష్యత్తులో ఎలా ఉత్పత్తి చేయాలనేది ఈ ప్రయోగం ద్వారా తేల్చాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్ డైఆక్సైడ్ రహిత ఇంధనంతో విమానాలు, కార్లు నడవాలంటే వందల కోట్ల టన్నుల హైడ్రోజన అవసరమవుతుంది. ముఖ్యంగా సూర్యకాంతిని ఉపయోగించి హైడ్రోజన్ ప్యూయల్ సెల్స్ ఉత్పత్తి చేసే తీరును వారు శోధించాలనుకుంటున్నారు.

English summary
Scientists in Germany flipped the switch Thursday on what's being described as "the world's largest artificial sun," a device they hope will help shed light on new ways of making climatefriendly fuels.The giant honeycomb like setup of 149 spotlights officially known as "Synlight" in Juelich, about 30 kilometers (19 miles) west of Cologne, uses xenon short arc lamps normally found in cinemas to simulate natural sunlight that's often in short supply in Germany at this time of year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X