వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసులోకి ఫిరాయింపులు: రేవంత్ రెడ్డితో ఎవరెవరు?

తాను కాంగ్రెసులో చేరడానికి ముందే తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కా ప్లాన్ రచించుకున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు ఆయన 15 నుంచి 25 మంది వరకు తెలుగుదేశం నాయకులను కాంగ్రెసులోకి తీసుకు ర

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను కాంగ్రెసులో చేరడానికి ముందే తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కా ప్లాన్ రచించుకున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు ఆయన 15 నుంచి 25 మంది వరకు తెలుగుదేశం నాయకులను కాంగ్రెసులోకి తీసుకు రావడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.

తన జాబితాను ఆయన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమర్పించినట్లు సమాచారం. కాంగ్రెసులో చేరేవారిలో మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చేతిలో ఓడిపోయే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో వారున్నారు.

వారంతా తెరాస పట్ల వైముఖ్యంతో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వైఖరి నచ్చనివారంతా రేవంత్ రెడ్డి బాటలో నడిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వారు ఎవరెవరనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వారికి ముందే తెలుసు...

వారికి ముందే తెలుసు...

కాంగ్రెసులో రేవంత్ రెడ్డి చేరే విషయంపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కకు, కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె. జానారెడ్డికి ముందే తెలుసునని అంటున్నారు. వారిని ఒప్పించిన తర్వాతనే రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలోని గ్రూపులను ఇష్టపడనివారు, రేవంత్ రెడ్డిని మొదటి నుంచీ సమర్థిస్తున్నవారంతా కాంగ్రెసు గూటికి చేరుతారని అంటున్నారు.

రేవూరి ప్రకాశ్ రెడ్డి పేరు వినిపించినా....

రేవూరి ప్రకాశ్ రెడ్డి పేరు వినిపించినా....

రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా హస్తం గూటిలోకి చేరుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే, కాంగ్రెసు అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చదలుచుకోలేదని సమాచారం. రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆశిస్తున్న నర్సంపేట స్థానానికి దొంతి మాధవ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచి కాంగ్రెసు అసోసియేట్ సభ్యుడిగా ఉన్నారు. దాంతో రేవూరి ప్రకాష్ రెడ్డి తెరాస వైపు చూస్తున్నట్లు సమాచారం.

పెద్ది రెడ్డి కూడా....

పెద్ది రెడ్డి కూడా....

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి, విజయ రామారావు, నిజామాబాదు జిల్లాకు చెందిన అన్నపూర్ణమ్మ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజేందర్ రెడ్డి టిడిపి నుంచి విజయం సాధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో ఉన్నారు.

ఉమా మాధవ రెడ్డి కూడా....

ఉమా మాధవ రెడ్డి కూడా....

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉమా మాధవ రెడ్డి కూడా కాంగ్రెసు తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. స్వర్గీయ ఎలిమినేటి మాధవ రెడ్డి సతీమణి అయిన ఆమె భువనగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, మొదటి నుంచి కూడా మోత్కుపల్లి నర్సింహులతో ఆమెకు విభేదాలున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోత్కుపల్లి నర్సింహులును సమర్థిస్తున్న నేపథ్యంలో ఆమె టిడిపితో విసిగిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో కాంగ్రెసులో చేరాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు కంచర్ల భూపాల్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డ కూడా కాంగ్రెసులో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నాగం జనార్దన్ రెడ్డి పునరాలోచన

నాగం జనార్దన్ రెడ్డి పునరాలోచన


ప్రస్తుతం బిజెపిలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఎర్రబెల్లి దయాకర్ రావుతో పొసగక టిడిపి నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం ఓ సంస్థను పెట్టి ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరారు. అయితే, తనకు బిజెపిలో తగిన ప్రాధాన్యం లేదనే భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా కాంగ్రెసులో చేరే విషయంపై పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

భారీగానే వలసలు....

భారీగానే వలసలు....

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తెరాసను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదనే భావన పేరుకుపోవడం, పార్టీలో గ్రూపులు చాలా మంది కాంగ్రెసు వైపు చూడడానికి కారణమని అంటున్నారు. చంద్రబాబు కూడా తెలంగాణలో పార్టీని వదులేసుకున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. దానికి తోడు, కెసిఆర్ వెల్‌కం వ్యూహానికి చంద్రబాబు సహకారం ఉందనే భావన కూడా క్రమంగా బలపడుతోంది. దీంతో కెసిఆర్‌ను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసగా కాంగ్రెసు బాట పట్టే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.

English summary
Along with Revanth Reddy, several Telangana Telugu Desam Part leaders like Uma Madha Reddy, Ravula Chandra Sekkar Reddy may join in Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X