వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిమ్మతిరిగే ఆస్తుల చిట్టా: డేరా బాబా వెనుక వేల కోట్లు.. ఒక్కడికే 100లగ్జరీ కార్లు!

డేరా బాబా అనుచరగణం చేస్తున్న విధ్వంసం ధాటికి కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది.

|
Google Oneindia TeluguNews

చంఢీగఢ్: డేరా బాబా అనుచరగణం చేస్తున్న విధ్వంసం ధాటికి కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమిల్లిన వీరిని అదుపు చేయడానికి భారీ సంఖ్యలో పోలీసులు పంజాబ్-హర్యానాల్లో మోహరించారు.

'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..

డేరా భక్తుల దాడిలో విధ్వంసం అవుతున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు తిరిగి ఆయన ఆస్తులనే అమ్మాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో డేరా బాబా ఆస్తుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా డేరా సచ్చా సౌదా ఆధీనంలో వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ ఆస్తులు:

ఇవీ ఆస్తులు:

డేరా నూతన భవనం.. అందులోనే షాహ్ సత్నామ్ సింగ్ బిజినెస్ స్కూల్, షాహ్ సత్నామ్ సింగ్ గర్ల్స్ స్కూల్, సత్నామ్ సింగ్ గర్ల్స్ కాలేజీ, బిజినెస్ కాలేజీ, డేరా పురాతన భవనం, ఏసీ మార్కెట్, క్రికెట్ స్టేడియం, ఫైవ్ స్టార్ హోటల్, డేరా బాబా అంతరాలయం, ఎంఎస్ జీ ఇంటర్నేషనల్ స్కూల్, షాహ్ సత్నామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,

వివిధ ఫ్యాక్టరీలు, ఎస్ఎంజీ ప్రొడక్ట్స్, ఫిల్మ్ సిటీ సెంటర్, మాహీ సినిమా, కషిష్ రెస్టారెంట్, ఆర్గానిక్ వ్యవసాయ పంటపొలాలు, డేరా శిక్షణ సంస్థలకు సంబంధించిన స్కూలు వ్యాను, ఇతర వాహనాలు, బాలికల హాస్టల్, నిర్మాణంలో ఉన్న పెద్ద క్రీడా గ్రామం.

షాహ్ మస్తాన్ మహారాజ్‌తో ప్రారంభం:

షాహ్ మస్తాన్ మహారాజ్‌తో ప్రారంభం:

హర్యానాలో 1948లో షాహ్ మస్తాన్ మహారాజ్ డేరా సచ్చా సౌదాను ప్రారంభించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు మనుషుల మధ్య మానవతా విలువలు పరిరక్షించేందుకు దీన్ని స్థాపించారు. సిర్సా పట్టణ కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ క్రమ క్రమంగా విస్తరించుకుంటూ వచ్చింది. డేరా సచ్చా సైదా వ్యవస్థాపకులైన షాహ్ మస్తాన్ మహారాజ్ తాను బెలూచిస్తాన్‌లో అవతరించానని చెప్పేవాడు.

షాహ్ సత్నామ్ సింగ్ మహరాజ్:

షాహ్ సత్నామ్ సింగ్ మహరాజ్:

షాహ్ మస్తాన్ మహారాజ్ నిర్యాణం తర్వాత ఆయన వారసునిగా షాహ్ సత్నామ్ సింగ్ మహరాజ్ 1960లో డేరా సచ్చా సౌదా బాధ్యతలు స్వీకరించారు. 23సంవత్సరాల వయసులోనే ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆయన మరణానంతరం డేరా సచ్చా సౌదాకు గుర్మీత్ వారసుడయ్యాడు. గుర్మీత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థను మరింత ఆధునీకరించారు. అత్యాధునిక భవనాలను నిర్మించి.. దీని కేంద్రంగానే వేల కోట్ల నిధులు సేకరించినట్లుగా ఆరోపణలున్నాయి.

కార్లపై మోజు:

కార్లపై మోజు:

దేశంలోని మిగతా బాబాలకు గుర్మీత్ బాబా చాలా భిన్నం. ఆయన కేవలం ఆధ్యాత్మిక గురువే కాదు. యాక్టర్, డెరెక్టర్, సింగర్, కొరియాగ్రాఫర్. కార్లు అంటే ఆయనకు అమితమైన మోజు అని చెబుతారు. ప్రస్తుతం ఆయన వద్ద 100 దాకా విలాసవంతమైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్లలో చాలావాటిని ఆయనే స్వయంగా డిజైన్ చేయించుకోవడం విశేషం. ఈ కార్లలోనే ఆయన భక్తుల మధ్య తిరుగుతుంటారు.

English summary
As followers of the controversial godman Gurmeet Ram Rahim Singh went on a rampage and destroyed properties across Haryana, Punjab and even in Delhi, the Punjab and Haryana High Court has ruled that all losses caused to property be recovered from Dera Sacha Sauda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X