వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలాలా నోబెల్‌కు పెషావర్ కిరాతకం ప్రతీకారమా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్ పాఠశాల ఘటన మలాలా యూసఫ్‌జాయ్ 'నోబెల్ బహుమతి'కి ప్రతీకారంగా కూడా కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అంతటి వారి క్రూరత్వానికి మలాలా నోబెల్ బహుమతి తీసుకోవడం ఓ కారణంగా ఉండి ఉండవచ్చుని పలువురు భావిస్తున్నారు.

కాగా, పెషావర్ పాఠశాల ఘటన పైన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ తండ్రి స్పందించారు. ఈ విషయం తెలియగానే తన గుండెబద్దలైందన్నారు. ఈ విషయం చెప్పగానే తన భార్య సొమ్మసిల్లి పడిపోయిందని చెప్పారు. ఈ ఘటనతో తమ కుటుంబం యావత్తు తీవ్ర ఆందోళనకు గురయిందని చెప్పారు.

Malala Yousafzai's father says his heart is bleeding over Peshawar school massacre

తన కూతురు మలాలా యూసఫ్‌‌జాయ్ ఇలాంటి విషాద సంఘటనలు ఎప్పుడు కూడా చూడవద్దని కోరుకుందన్నారు. మలాలా తీవ్రంగా బాధపడిందని, అప్ సెట్ అయిందని చెప్పారు.

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై టీటీపీ దాడిని అఫ్గాన్‌ తాలిబన్లు తీవ్రంగా ఖండించారు. అమాయకులను చిన్నపిల్లలను చంపడాన్ని ద ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ప్రతి సందర్భంలనూ ఖండిస్తోందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అమాయక ప్రజలను, మహిళలను, పిల్లలను ఉద్దేశపూర్వకంగా చంపడం ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమని, ప్రాథమికమైన ఈ ముఖ్యాంశానికి ప్రతి ఇస్లామిక్‌ ప్రభుత్వం, ఉద్యమం తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని అందులో వివరించారు.

English summary
Malala Yousafzai's father says his heart is bleeding over Peshawar school massacre
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X