వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానకిరాం... ఇది ప్రమాదాల రోడ్డు: జూ.ఎన్టీఆర్ మృత్యుంజయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారిందని అంటున్నారు. ఫోర్ లైన్‌తో ఉన్న 65 నెంబర్ జాతీయ రహదారి పైన తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి కూడా నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి.

నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరాం సాయంత్రం నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇదే రహదారి పైన పలువురు ప్రమాదాల బారిన పడ్డారు. ఈ రహదారిలో ఏటా సగటున వెయ్యి మంది వరకు మృతి చెందుతుంటారు.

నందమూరి హరికృష్ణ మరో తనయుడు, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా జానకిరాంకు ప్రమాదం జరిగిన కొద్ది దూరంలోనే యాక్సిడెంట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్, జానకిరాం ప్రమాద ఘటనలు పదిహేను కిలోమీటర్ల దూరంలో జరిగాయి.

జానకిరాం

జానకిరాం

నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరాం శనివారం సాయంత్రం నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

జూఎన్టీఆర్

జూఎన్టీఆర్

2009 మార్చి 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో జూ.ఎన్టీఆర్, రాజీవ్ కనకాల, హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాదానికి గురయ్యారు. వీరు గాయాలతో బయటపడ్డారు.

సునీల్

సునీల్

ఇదే రహదారి పైన ప్రముఖ సినీ నటుడు, హీరో కమ్ కమేడియన్ సునీల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కట్టంగూర్ - కేతేపల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది.

లాల్ జాన్ బాషా

లాల్ జాన్ బాషా

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. ఇదే రహదారిపై నార్కట్ పల్లి శివారులో టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా దుర్మరణం చెందారు. 2013 ఆగసక్టు 15న హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే సమయంలో నార్కట్ పల్లి బైపాస్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.

English summary
Many accidents on National High Way 65.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X