వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తన క్లాస్ విద్యార్థుల కోసం నగలు అమ్మిన ఉపాధ్యాయురాలు

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు. చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బందే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు. చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బందే. ఉపాధ్యాయులు ఉన్న సదుపాయాలతో చదువు చెబుతారు.

అయితే, తమిళనాడులో ఓ ఉపాధ్యాయురాలు మాత్రం పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చదువు కోసం తన నగలు అమ్మి వేయాలని నిర్ణయించుకుంది. ఆమె పేరు అన్నపూర్ణ మోహన్. విల్లుపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెబుతోంది.

Meet TN teacher, who sold her jewellery, to provide international standard education to kids

తమ క్లాస్ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు తన నగలను అమ్మివేసింది. తద్వారా తన క్లాస్ రూంకు ఇంటర్నేషనల్ లుక్ ఇవ్వాలని భావించింది.

ఆమె మూడో తరగతి క్లాస్ టీచర్. ఆ తరగతి గదిలో ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్మార్ట్ బోర్డు, ఫర్నీచర్ తదితర అన్ని సౌకర్యాలను కల్పించింది. ప్రయివేటు స్కూల్లో పిల్లలకు ఉండే సౌకర్యాలకు ధీటుగా తీసుకు వచ్చింది.

ఆమె ప్రయత్నం తోటి ఉపాధ్యాయులను, పిల్లల తల్లిదండ్రులను అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియా కూడా ఆమె మంచి ప్రయత్నాన్ని ప్రసంసిస్తోంది. అన్నపూర్ణ మోహన్ తన క్లాస్ పిల్లలకు ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రోత్సహిస్తోంది.

తన క్లాస్ రూంలో మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నానని, తాను పిల్లలతో ఇంగ్లీష్‌లో మాట్లాడి ప్రోత్సహిస్తానని, పిల్లలకు చిన్నప్పుడే ముఖ్యమని ఆ టీచర్ చెబుతోంది. తాను ఏదీ బరువుగా భావించడం లేదని, తనకు తోచినంత సాయం చేస్తానని చెబుతోంది.

English summary
Government schools across India, especially in small towns and villages, lack basic facilities for students to hone their skills to their maximum abilities. However, a Tamil Nadu teacher from a small town decided to end the trend by selling off her jewellery to provide international standard education to her pupils.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X