వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీ పరీక్షలకు నారా బ్రాహ్మణి కోచింగ్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోటీ పరీక్షలకు కూర్చునే ఆర్థిక స్తోమత లేని అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులను ఎన్టీఆర్ ట్రస్టీ నారా బ్రాహ్మణి సోమవారం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో వాటిని ఆమె ప్రారంభించారు.

ఉచిత శిక్షణ కోసం 12 వేల మంది అభ్యర్తులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 130 మందిని ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంపిక చేసింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించి అభ్యర్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చి దిద్దుతామని నారా బ్రాహ్మణి చెప్పారు.

హైదరాబాదు సమీపంలోని గండిపేటలోని ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో బాలికలకు డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చి వారిని ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేలా చూస్తామని చెప్పారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఇలా...

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఇలా...

గ్రూప్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి వచ్చిన నారా బ్రాహ్మణి ఇలా కనిపించారు.

అభ్యర్థులతో ఇలా..

అభ్యర్థులతో ఇలా..

ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఉచిత శిక్షణకు అర్హత సాధించిన అభ్యర్థులతో నారా బ్రాహ్మణి ముచ్చటిస్తూ ఇలా కనిపించారు.

ఎన్టీఆర్‌కు నివాళి...

ఎన్టీఆర్‌కు నివాళి...

తన తాతయ్య, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నారా బ్రాహ్మణి నివాళులు అర్పించారు.

నివాళులు అర్పించి..

నివాళులు అర్పించి..

తన తాతయ్య, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన తర్వాత నారా బ్రాహ్మణి ఇలా..

అభ్యర్థులతో ఇలా...

అభ్యర్థులతో ఇలా...

గ్రూప్ పరీక్షల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని నారా బ్రాహ్మ్ణి ప్రారంభించారు. వారంతా ఇలా కనిపించారు.

కేక్ కట్ చేసి..

కేక్ కట్ చేసి..

సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనే గ్రూప్ అభ్యర్థుల సమక్షంలో కేక్ కట్ చేసి బ్రాహ్మణి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు మోహన్ రావు తదితరులు నారా బ్రాహ్మణికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Nara Brahmani addressing in NTR Trust Bhavan Sponsored Free Coaching Classes for Competitive Exams Inaugural Programme at NTR Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X